హన్మకొండ: వరంగల్ జిల్లాలో మూడురోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం వరంగల్ మహానగరానికి రానున్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్ వరంగల్ మహానగర పరిధిలోని మడికొండకు చేరుకుంటారు. ఇక్కడ హైదరాబాద్-భూపాలపట్నం 163వ జాతీ య రహదారిపై యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు 99.10 కిలోమీటర్ల మేర రూ.1,905 కోట్లతో వ్యయంతో నిర్మించే నాలుగు లేన్ల రహదారి పనులకు శంకుస్థాపన జరగనుంది. ఇదే జాతీయ రహదారిలో 260వ కిలోమీటర్ వద్ద గోదావరి నదిపై ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద రూ.339 కోట్లతో నిర్మించిన వంతెన నిర్మాణానికి ప్రారంభోత్సం జరగనున్నది.
- -జిల్లాలో మూడురోజుల పర్యటన ఖరారు
- -నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన
- -గోదావరిపై వంతెన ప్రారంభం
- -కేటీపీపీలోని రెండోదశ ప్లాంటు జాతికి అంకితం
- -పలు అభివృద్ధి పనులు, సమ్మక, సారలమ్మ జాతరపై సీఎం సమీక్ష
మడికొండ వద్ద జరిగే ఈ రెండు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ ఎస్ మదుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), పసునూరి దయాకర్(వరంగల్), సీతారాంనాయక్ (మానుకోట), రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొంటారు. మడికొండ వద్ద భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సాయంత్రం హన్మకొండలోని కలెక్టరేట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూరులోని కేటీపీపీని సందర్శిస్తారు. కేటీపీపీ రెండోదశ థర్మల్ విద్యుత్ ప్లాం టును సీఎం జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం కలెక్టరే ట్‌లో మరోసారి పథకాల అమలుపై సమీక్షిస్తారు. కార్యక్ర మంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొం టారు. బుధవారం సీఎం కేసీఆర్ వరంగల్ నగరంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలోనే ఫిబ్రవరి 17నుంచి 21 వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై, టెక్స్‌టైల్ పార్కు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, ఆరు లేన్ల రహదారుల పనులపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు.





No comments:
Post a Comment