-శ్రీలంక క్రికెట్ ఎన్నికల్లో ఓటమి
కొలంబో: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు ఆ దేశ క్రికెట్ బోర్డు సంఘం (ఎస్‌ఎల్‌సీ) తీవ్ర పరాభవం ఎదురైంది. లంక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షునిగా పోటీచేసిన రణతుంగ 22 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఇక అధ్యక్షునిగా పోటీపడ్డ రణతుంగ సోదరుడు నిషాంత రణతుంగకు కూడా ఓటమి తప్పలేదు. తిలంగా సుమతిపాల 88ఓట్లతో నిషాంతను ఓడించి మూడోసారి లంక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.. శ్రీలంక క్రికెట్ బోర్డులో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో బోర్డు కార్యవర్గాన్ని శ్రీలంక క్రీడాశాఖ రద్దు చేయడంతో అప్పట్లో బోర్డు కార్యదర్శిగా ఉన్న నిషాంత పదవి కోల్పోయాడు. ప్రజాస్వామ్య పద్దతిలో బోర్డు ఎన్నికలు నిర్వహించాలని ఐసీసీ ఒత్తిడి నేపథ్యంలో తాత్కాలిక కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న బోర్డుకు ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహించారు. బోర్డు కార్యదర్శిగా సుమతిపాల వర్గానికే చెందిన మోహన్ డిసిల్వా ఎన్నికయ్యాడు.



No comments:
Post a Comment