Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Sunday, 3 January 2016

ఆదివారము కొనసాగిన 'ఆపరేషన్ పఠాన్ కోట్ '



  • వైమానిక స్థావరంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు
  • ఆదివారం ఉదయం నుంచీ కాల్పులు.. ఎదురు కాల్పులు 
  • 48 గంటలైనా కొనసాగుతూనే ఉన్న ‘ఆపరేషన్‌ పఠాన్‌కోట్‌’ 
  • ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు 
  • ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లు, రాకెట్‌ లాంచర్లు, జీపీఎస్‌ సిస్టమ్స్‌ 
  • ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష.. దర్యాప్తు బాధ్యత ఎన్‌ఐఏకు 
  • ఇప్పటికి లెఫ్టినెంట్‌ కల్నల్‌ సహా ఏడుగురు సైనికుల వీర మరణం



పఠాన్‌కోట్‌, జనవరి 3: ‘ఆపరేషన పఠానకోట్‌’ ముగియలేదు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోనే నక్కి ఉన్నారు. అక్కడి నుంచే కాల్పులు జరుపుతున్నారు. వారిని మట్టుబెట్టడానికి ఆదివారం రోజంతా భద్రతా దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. అయినా ఫలితం లేదు! మరోవైపు, పఠానకోట్‌ కాల్పుల్లో మరణించిన సైనికుల సంఖ్య ఏడుకు పెరిగింది. వారిలో ఎనఎ్‌సజీ బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ సభ్యుడు, లెఫ్టినెంట్‌ కల్నల్‌ నిరంజన కూడా ఉండడం విషాదం. వాస్తవానికి, ఆపరేషన్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆపరేషన ముగిసిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారమే ప్రకటించారు. అయితే, మరింత మంది ఉగ్రవాదులు ఉండి ఉంటారన్న అనుమానంతో శనివారం రాత్రి కూడా భద్రతా దళాలు వైమానిక స్థావరంలో కూంబింగ్‌ జరిపాయి. ఆదివారం ఉదయం స్థావరంలోని రెండు ప్రాంతాల నుంచి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. అదనంగా ఐదు కంపెనీల బలగాలను ఆర్మీ రంగంలోకి దించింది. సైన్యం, జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎ్‌సజీ), వైమానిక, పారామిలటరీ బలగాలతోపాటు పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌ లోపల, పరిసర ప్రాంతాల్లో గాలింపు జరుపుతున్నారు. రాష్ట్రంలోకి వచ్చి పోయే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలకు సమాచారం, సహాయం కోసం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ గస్తీ కాసింది. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో కూడా ఉగ్రవాదులు పేలుడు, కాల్పులకు పాల్పడ్డారు. అయితే, ఐదో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కథనాలు వస్తున్నాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులనూ అంతమొందించినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాతే వారి మరణాన్ని నిర్థారిస్తామని, ఆపరేషన్‌ను ముగించినట్లు ప్రకటిస్తామని ఎయిర్‌ మార్షల్‌ అనిల్‌ ఖోస్లా చెప్పారు. కాగా, వైమానిక స్థావరంలో కీలకమైన టెక్నికల్‌ ఏరియా, అందులోని మిగ్‌-21 జెట్‌ ఫైటర్స్‌, ఎంఐ-35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర కీలక సామగ్రి భద్రంగానే ఉన్నాయని వైమానిక వర్గాలు తెలిపాయి. నిరంతర నిఘా, పటిష్ఠ భద్రత కారణంగా ఈ ప్రాంతానికి ఉగ్రవాదులు చేరుకోలేకపోయారని చెప్పాయి. ఉగ్రవాదులు ఉన్న నాన్‌-ఆపరేషనల్‌ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో మట్టుబెట్టే వరకూ ఆపరేషన కొనసాగుతుందని ఎయిర్‌ కమడోర్‌ జేఎస్‌ థమూన చెప్పారు. ఆదివారం రాత్రి కూడా కూంబింగ్‌ కొనసాగనుంది.
రంగంలోకి ఎన్‌ఐఏ 
పఠానకోట్‌ ఆపరేషన్‌పై 8 మందితో కూడిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ఈ బృందం పఠాన్‌కోటకు చేరుకుంది. పఠాన్‌కోటలో తాజా పరిస్థితిని రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌... ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఇద్దరు ఆదివారం కర్ణాటకలోనే ఉన్నారు. 

లెఫ్టినెంట్‌ కల్నల్‌ దుర్మరణం 
కేరళ రాష్ట్రానికి చెందిన ఎనఎ్‌సజీ కమెండో, బాంబు డిస్పోజల్‌ బృంద సభ్యుడు నిరంజన ఆదివారం అనూహ్యంగా దుర్మరణం పాలయ్యారు. ఎదురు కాల్పుల్లో మరణించిన ఓ ఉగ్రవాది ఒంటికి అతుక్కుని ఒక గ్రనేడ్‌ ఉంది. కూంబింగ్‌ సందర్భంగా దానిని నిర్వీర్యం చేసేందుకు నిరంజన సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఆ గ్రనేడ్‌ పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన మరణించారు. దాంతో, ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్‌రిషీ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో 12 మంది ఎన్‌ఎ్‌సజీ జవాన్లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారంతో సత్వరమే స్పందించి పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను కాపాడుకోగలిగామన్నారు. బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో మరో నలుగురు గాయపడ్డారు.

భారీగా ఆయుధ సామగ్రి 
పాక్‌తో సరిహద్దుకు సమీపంలో... అందులోనూ భారతకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పఠాన్‌కోట ఎయిర్‌బే్‌సను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన ఉగ్రవాదులు... అందుకు తగినట్లుగా భారీగా ఆయుధాలు, సాంకేతిక పరికరాలను కూడా వెంట తెచ్చుకున్నారు. ఎదురు దాడిలో హతమైన ఉగ్రవాదుల నుంచి ఏకే-47 తుపాకులు, మోర్టార్లు, గ్రెనేడ్‌ లాంచర్లు, గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) పరికరాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

కొనసాగిన నిరసనలు
పఠాన్‌కోటలో ఉగ్రవాదుల దాడిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమవుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆదివారం కూడా నినాదాలు చేస్తూ... ఆ దేశ దిష్టిబొమ్మను పఠాన్‌కోట వాసులు దహనం చేశారు. పఠాన్‌కోటకు సమీపంలోనే వీరు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత దాడికి పాకిస్థాన్‌దే బాధ్యత అంటూ... ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. కాల్పులు, పేలుళ్ల వల్ల తాము భయంతో బిక్కుబిక్కుమంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పఠాన్‌కోట ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి అన్ని దేశాలూ కలిసి పని చేయాలని సూచించింది. 
జూ పఠాన్‌కోట ఆపరేషన్‌లో అమరుడైన రాష్ట్ర వాసి, గరుడ కమాండో గురుసేవక్‌ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. 
జూ పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో... దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఉన్న హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌. దీంతో, పరిసరాల్లో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిం

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks