నిజామాబాద్ అర్బన్ :మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టి చెరువు పనుల్లో నాణ్యత, బిల్లులు చెల్లింపు బాధ్యత ఈఈలదేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్షించా రు. చెరువుల పునరుద్దరణ అంశాలలో నిర్దేశించిన తూముల మరమ్మతు, కట్ట,అలుగులను పటిష్టపరిచే పనులను ముందస్తుగా పూర్తి చేయించాలని అన్నారు. 15వ తేదీ నాటికి రెండో దశ పనుల అంచనాలను పంపాలని స్పష్టం చేశారు
చెరువుల పునరుద్ధరణ అంటే పూడిక పని మాత్రమే కాదని, బిల్లులు చెల్లింపులు పనుల నాణ్యతకు ఈఈలే బాధ్యులని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాకు చెందిన నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. చెరువుల పునరుద్ధరణ అంశాల్లో నిర్దేశించిన తూముల మరమ్మతులు, కట్ట, అలుగులను పటిష్టపరిచే పనులను ముందస్తుగా పూర్తి చేయించాలని ఆదేశించారు. పూడిక తీస్తే చెరువు పునరుద్ధరణ జరుగదన్నారు.
మిషన్ కాకతీయలో భాగంగా మొదటి దశలో మంజూరు చేసిన 667 చెరువుల పనుల్లో 653 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన 14 పనులను చే లేదో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొదటి దశ పనుల్లో 233 పూర్తి చేశారని, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. మిషన్‌కాకతీయ రెండో దశలో 700 పను లు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇప్పటి వరకు 96 చెరువుల అంచనాల ప్రతిపాదనాలు పంపారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివారం పనులు సమీక్షించనున్నట్లు చెప్పారు. ఈ నెల 15నాటికి 400 చెరువులు, నెలాఖరుకు నూరుశాతం (700) చెరువుల అంచనాలు పంపాలన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 15 రోజుల్లో వచ్చే జూనియర్ ఇంజినీర్లను జిల్లాకు కేటాయించి, సిబ్బంది కొరత తీర్చనునన్నట్లు చెప్పారు. ఈలోగా రిటైర్డ్ ఇంజినీర్లు, నిజాంసాగర్, గోదావరి ఎత్తిపోతల పథకాల ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆర్‌ఆర్‌ఆర్ మూడో దశ కింద 153 చెరువుల పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్) పనులు మంజూరైతే 129 చెరువు పనుల కోసం డీపీఆర్‌లు పంపారని, వాటిలో 106 పనులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్‌జోషి, ఉప కార్యదర్శి మల్సు, జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ భూపాల్‌రెడ్డి, డిప్యూటీ ఎస్‌ఈ దామోదర్, ఈఈలు సత్యశీలారెడ్డి, మధుకర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈలు, జేఈఈలు, తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment