ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. ఈ లీగ్‌లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న శ్రీకాంత్ సింగిల్స్‌లో హైదరాబాద్ హంటర్స్ టాప్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీకి షాకిచ్చి సంచలనం సృష్టించాడు. అయితే, శ్రీకాంత్ ప్రదర్శన అబ్బురపరిచినా, కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో బెంగళూరు షట్లర్లు ఓడడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. ఫలితంగా హైదరాబాద్ హంటర్స్ 3-2తో బెంగళూరును ఓడించి శుభారంభం చేసింది. మరోపోరులో పీవీ సింధు సారథ్యంలోని చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. - -అయినా బెంగళూరుకు తప్పని ఓటమి
- -ట్రంప్ మ్యాచ్‌ల విక్టరీతో హైదరాబాద్ బోణీ
- -ముంబైని బోల్తా కొట్టించిన చెన్నై
- -ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
ముంబై: పీబీఎల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ట్రంప్ మ్యాచ్ నిబంధన జట్లకు ఎంత కీలకమన్నది ఆదివారం హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్‌గన్స్ జట్ల
మధ్య జరిగిన పోరే నిదర్శనం. ఈ పోరులో బెంగళూరు జట్టు మొత్తం ఐదుమ్యాచ్‌లకుగాను మూడు మ్యాచ్‌లను గెలుపొందినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే, తాము ఓడిన ఆ రెండుమ్యాచ్‌లూ కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లే కావడంతో బెంగళూరుకు పరాభవం తప్పలేదు. ట్రంప్ మ్యాచ్ నిబంధనను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న హైదరాబాద్ 3-2తో విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టింది.
తొలుత మహిళల సింగిల్స్‌లో సూ ది 15-8, 15-11తో సుపనిద కటేతొవాంగ్‌పై నెగ్గి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్నిచ్చింది. తర్వాత జరిగిన పురుషుల
డబుల్స్ పోరును హైదరాబాద్ ట్రంప్‌మ్యాచ్‌గా ఎంపికచేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జోడీ మోగెన్‌సన్-మార్కిస్ కిదో 13-15, 15-9, 15-14తో బెంగళూరు జంట హూన్ తిన్-కిమ్ వా లిమ్‌ను ఓడించింది. దీంతో బెంగళూరు ఓ పాయింట్‌ను కోల్పోగా, ట్రంప్ మ్యాచ్ విజయంతో హైదరాబాద్ బోనస్‌పాయింట్‌తో కలిపి తన ఆధిక్యాన్ని ఏకం గా 2-0కు పెంచుకుంది. ఆ తర్వాత జరిగిన పురుషు ల సింగిల్స్ తొలిమ్యాచ్‌ను బెంగళూరు జట్టు ట్రంప్ మ్యాచ్‌గా వినియోగించుకుంది. కానీ, ఇందులో హైదరాబాద్ స్టార్ కశ్యప్ 15-14, 15-13తో సమీ ర్ వర్మను ఓడించడంతో బెంగళూరు -1పాయింట్‌కు పడిపోయింది.
దీంతో హైదరాబాద్ ఆధిక్యం మూడుపాయింట్లకు పెరిగిం ది. ఆ తర్వాత జరిగిన నామమాత్రపు మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల రెండో సింగిల్స్ మ్యాచుల్లో బెంగళూరు గెలిచినా ప్రయోజనం లేకపోయింది. మిక్స్‌డ్‌లో బెంగళూరు జోడీ జోచిమ్ ఫిషర్-అశ్వినీ పొన్నప్ప 15-13, 15-13తో జ్వాల-మార్కిస్ జంటను ఓడించడంతో హైదరాబాద్ ఆధిక్యం 3-1కు తగ్గింది. ఇక చివరిదైన పురుషుల రెండోసింగిల్స్‌లో బెంగళూరు స్టార్ శ్రీకాంత్ 15-12, 6-15, 15-7తో లీ చోంగ్ వీని చిత్తుచేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే, అప్పటికే హైదరాబాద్ గెలుపు ఖరారవడంతో ఆ జట్టు 3-2 ఆధిక్యంతో ముందంజ వేసింది. లీ చోంగ్ వీపై శ్రీకాంత్‌కిదే తొలి విజయం కావడం విశేషం.
సింధు బృందం జోరు
యువ సంచలనం పీవీ సింధు సారథ్యం వహిస్తున్న చెన్నై స్మాష ర్స్ లీగ్‌లో అద్భుతంగా బోణీ కొట్టింది. చెన్నై 4-3తో ముంబై రాకెట్స్‌ను ఓడించింది. అప్పటికే రెండు విజయాలతో 3-1 ఆధిక్యంలోనున్న ముంబైకి మహిళల సింగిల్స్‌లో సిం ధు 15-8, 11-15, 15-8తో హాన్ లిని ఓడించి షాకిచ్చింది. దీంతో ముంబై ఆధిక్యం 3-2కు తగ్గిపోయింది. ఇక.. ట్రంప్ మ్యాచ్ గా ఎంపికచేసుకున్న చివరిది, కీలకమైన పురుషుల రెండో సింగిల్స్‌లో సిమోన్ సాం టసో 15-9, 15-12తో గురుసాయి దత్ ను ఓడించి చెన్నైకి బోనస్‌పాయింట్‌తో విజయాన్నందించాడు. ఫలితంగా చెన్నై 4-3తో పైచేయి సాధించింది.




No comments:
Post a Comment