125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ శంకుస్థాపన
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ సవిూపంలో 125 అడుగుల ఎత్తు నిర్మించనున్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని నిర్మించబోయే స్థలంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు రాష్ట్రమంత్రులు, నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ నిర్వహించారురాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వేదపండితులు పూజలు నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు గ్రానైట్ రాయిని వేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, నాయిని నర్సింహరెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment