Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Thursday, 14 April 2016

దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి

దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి


రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దేశంలో జల, నౌకాయాన విధాన రూపకర్త కూడా అంబేద్కర్‌ అని ప్రధాని మోదీ అన్నారు. జల రవాణా పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రెండు శక్తివంతమైన సంస్థలను రూపొందించారని, జల, నౌకాయానంతో పాటు విద్యుత్తు శక్తిపై సంస్థలను అంబేద్కర్‌ ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర జలవనరులు, నీటిపారుదల, నౌకాయాన కమిషన్‌తో పాటు కేంద్ర సాంకేతిక విద్యుత్తు బోర్డుల రూపకల్పన అంబేద్కర్‌ చేశారని మోదీ కీర్తించారు. మహనీయులంతా సాధారణ కుటుంబాల్లో పుట్టారని.. వారి వ్యక్తిత్వంతో మహనీయులయ్యారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్‌ ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన అంబేద్కర్‌ 125వ జయంతి వేడుకలకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి రాజ్యాంగమే పవిత్రగ్రంథం అన్నారు. ప్రజల గుండెల్లో అంబేద్కర్‌ చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా లక్ష్యాన్ని సాధించారని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగారన్నారు.ఏపీలో 10 రోజుల పాటు అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బాబు పేర్కొన్నారు. ఆహారభద్రతకు నాంది పలికిన నేత ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ఓట్ల కోసం విగ్రహాలు పెట్టినవారు దళితులను పట్టించుకోలేదని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహం కంటే పెద్ద విగ్రహాలు పెట్టారన్నారు. చరిత్ర సృష్టించిన వాళ్లతో ఎవరూ పోటీపడలేరని స్పష్టం చేశారు. అమరావతి, అంబేద్కర్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. భావితరాలు స్ఫూర్తి పొందేలా అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎస్సీ హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మారుస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో కామన్‌ కిచెన్‌ ఏర్పాటుచేయనున్నట్లు సీఎం తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో వృత్తి నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యవర్తుల దోపిడీకి చెక్‌ పెడతామన్నారు. హాస్టళ్లలో బయోమెట్రిక్‌ విధానంతో అవినీతిని అరికట్టామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు సరిపడా భోజనం పెడుతున్నామన్న బాబు పదోతరగతి నుంచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాలకు కట్టుబడి ఉంటామని సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks