Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Thursday, 14 April 2016

భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది : ప్రధాని

భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది : ప్రధాని


భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌ కు వున్న 7500 కీలోవిూటర్ల సముద్రతీరం పలు రకాల పెట్టుబడులకు అనువుగా వుందని ప్రధాని అన్నారు. ముంబయిలో ఏర్పాటు చేసిన 'మారిటైమ్‌ ఇండియా' సదస్సును గురువారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నౌకాశ్రయాలు, అంతర్గత జలరవాణా వ్యవస్థలను అధునీకరించాల్సిన అవసరముందన్నారు. అది సముద్రమార్గం ద్వారా అయితే ఇంకా మంచిదని పేర్కొన్నారు. దేశంలో 'మారిటైమ్‌ ఇండియా' సదస్సు నిర్వహించటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. సాగరమాల పథకం, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ మూడు రోజుల పాటు జరగనుంది. సమ్మిట్‌ ద్వారా రూ. 82 వేల కోట్ల ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. దాదాపు 41 దేశాల నుంచి 300 ప్రతినిధులతో పాటు 3 వేల మంది సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. దక్షిణ కొరియా భాగస్వామిగా ఈ ప్రపంచస్థాయి సదస్సు జరుగుతుంది.
ప్రధాని మాట్లాడుతూ.. రవాణా మార్గాల్లో సముద్ర రవాణా చాలా విస్తృత పరిధి కలిగిఉంది. ఇది పర్యావరణ హితమైన రవాణా కూడా. అత్యంత చౌకయినది. సముద్రయానం మన జీవన విధానం, వాణిజ్య పద్దతులు సముద్ర ఆవరణను కలుషితం చేయకూడదు. భారత్‌ మొదటిసారిగా ఈ గ్లోబల్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. బాబాసాహెబ్‌ విజన్‌కు కట్టుబడి మా ప్రభుత్వం జాతీయ జల రవాణాను ముందుకు తీసుకుపోనుంది. పోర్టుల ఆధునీకరణ, సెజ్జులు, పోర్ట్‌ ఆధారిత స్మార్ట్‌ సిటీస్‌, పారిశ్రామిక పార్కులు, గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ పార్క్స్‌ను అభివృద్ధి పరిచి ఆధునీకరించనున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని సాగర్‌ మాల పథకం వివరాలను అవిష్కరించారు. దేశంలోని నౌకాశ్రయాల సామర్ధ్యాలను 2025 నాటికి 3000 టన్నుల లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణ శాఖా మంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్ణవీస్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks