'సఖ్యతతో ముందుకు పోదాం'
ఖమ్మం, ఏప్రిల్ 16 : కయ్యాలకు, గిల్లికజ్జాలకు పోకుండా పరస్పరం సహకరించుకుందామని ఆంధ్ర సర్కారుకు తెలంగాణ సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. గిల్లికజ్జాలతోసాధించేదేవిూ లేదని, అది ఇద్దరికీ నష్టమేనని అన్నారు. ఏపీకి సాధ్యమైనంత సహకారం అందించేందుకు సిద్ధమని సీఎం చెప్పారు.దుమ్ముగూడెం తర్వాత గోదావరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిలో 1000 టీఎంసీల నీటిని లంగాణవాడుకున్నా ఇంకా 1500 టీఎంసీల నీటిని ఏపీ వాడుకునే అవకాశం ఉందని అన్నారు. దుమ్మగూడెం ప్రాజెక్టు దాటిన తరువాత ప్రతి ఏటా వెయ్యి నుంచి పదిహేను వందల టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోతుందని, వాటిని యోగించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించానని సీఎం చెప్పారు. ఆంధ్రలో ఉన్నది కూడా రైతులేనని, వారికి ఉపయోగకరంగా గోదావరి నీటిని వినియోగించుకోవాలని అన్నారు.గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా కలిసే బదులు తెలుగు ప్రజలు ఎవరు వాడుకున్నా ఫరవాలేదని కెసిఆర్ అన్నారు. తెలంగాణతో నీటి వాదాలు లేకుండాసఖ్యతతోవ్యవహరిస్తామని చంద్రబాబే చెప్పారని, తాను కూడా అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయాన్ని చెప్పానని కెసిఆర్ తెలిపారు. ఖమ్మం
జిల్లా భద్రాచలంలో సీతారామ కల్యాణానికి విచ్చేసిన కెసిఆర్, అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రాలో విలీనమైన భద్రాచలం నియోజకవర్గంలోని పంచాయతీలను తిరిగి ఇచ్చేందుకు ఇటీవల అమరావతిలో ఆంధ్ర సిఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. భద్రాచలం మాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రి తరహాలో ఆర్కిటెక్ట్ ఆనందసాయి పర్యవేక్షణలో జీయర్‌స్వామి, ఆగమశాస్త్ర పండితుల సూచనలు, సలహాల ప్రకారం ఆలయంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సమయాభావం వల్ల తాను స్వయంగా పరిశీలించలేక పోయానని, త్వరలో జీయర్‌స్వామితో కలిసి వచ్చి ఎక్కడెక్కడ ఏమి అవసరమో పరిశీలించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేసి, జిల్లాలో అంగుళం భూమిని కూడా వదలకుండా
సాగునీటితో అభిషేకం చేస్తామన్నారు. సీతారామప్రాజెక్టు కోసం ఇంజనీర్ల కంటే కూడా తనతోపాటు తుమ్మల నాగేశ్వరరావు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. ఖమ్మం జిల్లా కృష్ణా, గోదావరి బేసిన్‌లకు మధ్యన ఉన్నా కరవు, తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇదంతాగత పాలకుల పాపమేనన్నారు.
ఖమ్మం జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కొందరు అవాకులు , చవాకులు పేలుతున్నారని, లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై కనీసం అవగాహన, పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఖమ్మంజిల్లాను ఒరుసుకుంటూ పారే గోదావరి ఉన్నా 60 ఏండ్లలో జరిగింది శూన్యమన్నారు. గోదావరి జలాలతోనే ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మిషన్ భగీరథ గురించి నీతి అయోగ్ ఛైర్మన్ ప్రశంసలు కురిపిస్తే మన ప్రతిపక్షాలు మాత్రం లేనిపోని ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు.పోడు భూముల సమస్య గురించి కూడా ఢిల్లీలో పర్యావరణ శాఖతో మాట్లాడామని అన్నారు. భద్రాచలం టెంపుల్‌సిటీ గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్పందిస్తూ...ఆలోచన ఉందని, గిరిజన చట్టాలు, ఇతర విషయాలపై త్వరలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక
భద్రాచలంలోనే వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపిలు బాల్క సుమన్,సీతారామ్‌నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment