'అవసరమయితే బిక్షమెత్తుకుంటాం'
హైదరాబాద్ :
ఆఖరికి బిక్షమెత్తుకుంటాం కాని అధికారం కోసం తెరాస పంచన చేరబోనని కాంగ్రెస్ మహిళా నేత, గద్వాల్ ఎమ్మెల్యే డీకే ఆరుణ వ్యాఖ్యానించారు. తన సోదరుడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్ లో చేరడంపై ఈ మధ్యాహ్నం స్పందించిన ఆమె, రామ్మోహన్ రెడ్డి చేసిన పనితో తమ తండ్రి ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తెలంగాణ రాష్ట్ర సమితి తిలోదకాలు ఇచ్చిందని ఆరోపించిన ఆమె, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రామ్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే రానుందని అరుణ అంచనా వేశారు.కుటుంబంలో చిచ్చుపెట్టి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కు చిత్తశుద్ది వుంటే వెంటనే రామ్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించాలని అన్నారు. తనకు, తన తండ్రికి రామ్మోహన్ మచ్చ తెచ్చాడని అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలెవరూ కుడా రామ్మోహన్ వెంట వెళ్లలేదని ఆరుణ అన్నారు.

No comments:
Post a Comment