ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు పై సర్కార్ సీరియస్
ప్రైవేట్ పాఠశాలల పై కొరడా ఝులిపించింది తెలంగాణ సర్కార్ .ఇప్పటికే ఫీజుల నియంత్రణకు నోటీసులు జారీచేసిన విద్యాశాఖ అదికారులు ఇప్పుడు అడ్మిషన్ల పై దృష్టిసారించింది. అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఉమ్మడి షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.. ఇక అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు చేయాల్సి ఉంటుంది.ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమయింది.. రాష్ట్రంలో 11వేల ప్రైవేట్ పాఠశాలల్లో 32లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కంటే నాలుగు లక్షల మంది ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు.. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్స్ పై నే దృస్టి సారించిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ పై దృష్టి పెట్టింది. ఏటా ప్రైవేట్‌స్కూల్స్ లో చదివే పిల్లలు పెరిగిపోతుండటం, యాజమాన్యాల వేధింపుల నేపథ్యంలో తల్లిదండ్రుల చి అధికారులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రైవేట్ పాఠశాలల కట్టడి పై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఫీజులను నియంత్రించే దిశగా కదులుతున్న ప్రభుత్వం ప్రైవేటు బడుల్లో ప్రవేశాలకూ ఒక విధానం ఉండాలని నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా అప్లికేషన్లు ఇవ్వడం నచ్చినట్టు ప్రవేశాలు కల్పించడానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.షెడ్యూల్ విడుదల చేశి దాని ప్రకారమే అడ్మిషన్లు ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఒక షెడ్యూల్ ఉండాలని అధికారులు భావిస్తున్నారు.. దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంప్లిమెంట్ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.ఒక్కో పాఠశాలలో ఒక్కో సారి ప్రవేశాలు జరుగుతుండటంతో ఎప్పుడు దరఖాస్తులు ఇస్తారో, చివరి తేదీ ఎప్పుడో.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒక్కో స్కూల్ కు ఒక్కో షెడ్యూల్ ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు..ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ సన్నద్దమయింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఉమ్మడి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఆ ప్రకారమే యాజమాన్యాలు దరఖాస్తుల జారీ, ప్రవేశాలు తదితరాలను చేపట్టేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది.వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇదే షెడ్యూల్ అమలుకు విద్యాశాఖ కసరత్తుచేస్తోంది.

No comments:
Post a Comment