వేసవిలో ఇబ్బందులు పడుతున్న ఆర్ టి సి డ్రైవర్లు, కండక్టర్లు
హైదరాబాద్, ఏప్రిల్ 16:
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్ధానాలకు చేరుస్తున్నా టిఎస్ ఆర్ టి సి మాత్రం ఉద్యోగులను పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఈ వేసవి లో ఆర్ టి సి ఉద్యోగులకు రక్షణ లేదు. వేసవి లో ఆర్ టి సి డ్రైవర్లు, కండక్లర్లు ఎదుర్కుంటున్న సమస్యలు ఇంతా అంతా కావు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ వేసవి లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్ధాయి లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు ఈ వేసవి లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వడదెబ్బలతో నిత్యం ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే ఆర్ టి సి ఉద్యోగులు వేసవి కాలంలో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఆర్ టి సి ఉద్యోగులకు డిపోలలో శుధ్ది చేసిన మినరల్ వాటర్ ను ఆర్ వో ప్లాంట్ల ద్వారా అందిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు కధ మొదలయింది. డిపో నుంచి బయలుదేరాక మంచి నీరు లభించటం లేదు. దీంతో వారు చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈ వేసవి లో మంచి నీళ్లు సరైన సమయంలో తాగక ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక నిత్యం 8 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్న ఆర్ టి సి డ్రైవర్లు, కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లు..గ్లూకోజ్ ప్యాకెట్లు ఉచితంగా అందించాలని ఇటీవల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ ఎండ కు ...బస్సు ఇంజన్ నుంచి వేడి వల్ల వారి ఆరోగ్యాలకు హాని కలుగుతుందని ఆ తీర్పులో ప్రస్తావించింది. దీనిని ఆర్ టి సి యజమాన్యం పాటించటం లేదు. దీంతో నిత్యం డ్యూటి చేయాలంటే నరకం కనపడుతోందని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. బస్సుల కొనుగోలకు..ఆధునీకీకరణకు కోట్లు ఖర్చు పెడుతున్నా ఆర్ టి సి యజమాన్యానికి కార్మికుల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవటంపై తీవ్ర స్ధాయిలో విమర్శులు వస్తున్నాయి. ఇకనైనా ఈ సమస్యపై సమస్యపై యజమాన్యం పరిష్కరించాలని ఆర్టీసీ రన్నింగ్ స్టాఫ్ కోరుకుంటున్నారు.

No comments:
Post a Comment