జపాన్‌ను మరోసారి కుదిపేస్తున్న భూప్రకంపనలు..
సెంట్రల్ డెస్క్, ఏప్రిల్ 16:
జపాన్‌లోని కుమమోటోలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రెండు రోజుల క్రితం సంభవించిన భూకంపం నుంచి తేరుకోకముందే ఈరోజు మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. క్యూషూ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు, 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన సంభవించిన కొంద్ది గంటల్లోనే 5.4 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.విూ దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10 కిలోవిూటర్ల లోతులో ఇది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరుస భూకంపాలతో ఇప్పటివరకు 29 మంది మృతిచెందారు. 400 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాలను తొలగించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. భవన శిధిలాల క్రింద దాదాపు 23 మంది చిక్కుకున్నట్లు నిర్దారించారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసారు.
భుకంప విలయతాండవాన్ని స్థానిక టీవీ ఛానళ్లు చూపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనాలు, తెగిపోయిన రహదారులు, కొండచరియలు విరిగిపడే దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. క్యూషూ ప్రాంతంలో ఈ ఏడాది ఇంతవరకు 165 సార్లు భుమి కంపించింది. 375 శిబిరాల్లో దాదాపు ఏడువేలమంది భాదితులు తలదాచుకుంటున్నారు.

No comments:
Post a Comment