పాలేరులో పోటీ తప్పదా ?
ఖమ్మం, ఏప్రిల్ 16:
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. అక్కడ పోటీ చేస్తామని సిపిఎం చెప్పడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో పోటీ ఎక్కువైంది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో అక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. అయితే ఈ స్థానానికి పోటీ పెట్టకుండా..ఏకగ్రీవం చేయించాలి, మళ్లీ తమ సీటును తామే పొందాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి, వెంకట్ రెడ్డి కుటుంబం నుంచి గులాబీ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే ఏకగ్రీవం అనుకుంటోంది. అయితే ఈలోపు ఖమ్మం తమ కంచుకోటగా భావిస్తున్న సిపిఎం పాలేరులో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఏకగ్రీవం కాస్తా ఎన్నికగా మారనుంది. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఇప్పుడు అభ్యర్థులపై ఆసక్తి ఏర్పడింది.
టిఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో తిరుగులేని విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నిక గులాబీ నేతలకు అంది వచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. ఇటీవల ఖమ్మంలో రెండు సాగునీటి ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా వచ్చే ఏడాది నాటికి వాటిని పూర్తి చేస్తామని అధికార పార్టీ ప్రకటించడంతో ఖమ్మంలో గులాబీ పార్టీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడంతో ఇక తిరుగులేదనుకుంటున్నారు. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదేనన్న ధీమాలో గులాబీ పార్టీ ఉండడంతో...అభ్యర్థులు కూడా అదే స్థాయిలో పోటీలు పడుతున్నారు. గెలిచే టికెట్ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.
దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు...గెలిచే సీటుకు ప్రతినాయకుడు సమర్థుడే అన్నట్లుగా గులాబీ నేతల్లో పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం పాలేరు సీటు తనకు కేటాయించాలని ఈ మధ్య వైసీపీ నుంచి టిఆర్‌ఎస్ కు వచ్చిన గట్టు రామచంద్రరావు అడుగుతున్నారు. తన కోరికను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఖమ్మం నేతగా, వైసీపి నుంచి వచ్చిన తనకు అక్కడ కొంత పట్టు ఉందని తనకు టికెట్ ఇస్తేమంచి మెజారిటీ సాధిస్తానంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నేత బేగ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలంటున్నారు. పార్టీకోసం మొదటి నుంచి కష్టపడిన తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అవుతానంటున్నారు. ఇందుకోసం పార్టీలో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక పార్టీలో జిల్లా ఇన్ ఛార్జీగా పనిచేస్తున్న నూకల నరేష్ రెడ్డి ఈ ఉప ఎన్నిక అవకాశం తనకే ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే అవకాశం ఇచ్చిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా పార్టీ కోసం జిల్లాలో పనిచేస్తున్న వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఆయాచితంగా గెలిచే సీటును అందరు ఆశిస్తారు. రాజకీయాల్లో టికెట్ కోరడం కూడా తప్పేం కాదు. కానీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది..టికెట్ ఎవరికీ దక్కుతుందనే దానికి అనేక లెక్కలుంటాయి. మరి ఇప్పుడు పాలేరు టికెట్ పై అధిష్టానం ఆలోచన కూడా ఇలాగే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మండలి తరపున పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న తుమ్మలను పాలేరు నుంచి బరిలో దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన అధిష్టానం మదిలో ఉన్నట్లు చర్చనడుస్తోంది. జిల్లాలో బలమున్న నేతగా ఉన్న తుమ్మలను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో నిలబెడితే ఎమ్మెల్సీ అవకాశం ఇంకొకరికి ఇచ్చే ఛాన్స్ వస్తుందని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మంత్రి పదవిలో ఉండే అవకాశం తుమ్మలకు లభిస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాలేరు అభ్యర్థిత్వంపై పార్టీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది.
పాలేరు ఎమ్మెల్యే స్థానం సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ తామే దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉండగా...వరుస విజయాలు సాధిస్తున్న టిఆర్‌ఎస్ తమ జాబితాలో మరో ఎమ్మెల్యే స్థానాన్నిపెంచుకునేందుకు సిద్ధమైంది. అయితే అభ్యర్థిత్వంపై అధికార పార్టీలో పోటీ ఎక్కువ కావడంతో ఇప్పుడు పాలేరు ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారో పార్టీ త్వరలో తేల్చనుంది.

No comments:
Post a Comment