గుంటూరు పడగవిప్పిన ల్యాండ్ మాఫియా
గుంటూరు, ఏప్రిల్ 16 (న్యూస్ పల్స్)
గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం నేపథ్యంలో భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. అదే స్థాయిలో భూ వివాదాలు, పంచాయితీలు, బెదిరింపులు, హత్యలు తారాస్థాయికి చేరాయి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా గుంటూరు నగరంలో ల్యాండ్ మాఫియా చెలరేగుతోంది. కోట్ల ఖరీదు చేసే భూములకు పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఇదే తరహా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్యామలానగర్‌లో కోట్ల ఖరీదు చేసే భూకబ్జా ఘటన మొదలుకుని తాజాగా మంగళగిరి, గుంటూరు నగరంలో వెలుగు చూసిన అనేక ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భూ కబ్జా కేసుల్లో పోలీసుల ఉదాశీనత వల్లే ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందనే విమర్శలున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళితే విచారించకుండానే సివిల్ వివాదం అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ల్యాండ్ మాఫియా రోజురోజుకు చెలరేగిపోతోంది. ల్యాండ్ మాఫియాపై కఠిన వైఖరి అవలంభించకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా అమాయకుల ఆస్తులు హారతి కర్పూరం కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
గుంటూరు నగరంలో సంచలనం సృష్టించిన శ్యామలానగర్ భూవివాదం ఘటనల్లో అప్పటి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సస్పెన్షన్ గురికాగా సుమారు 16 మందిని అరెస్టు చేశారు. అందులో ఓ మహిళ కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. ఆ తరువాత అనేక భూకబ్జా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్నింటిపై మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ మహిళ పలు మోసాలకు పాల్పడుతుంటడంతో పోలీసుల ఆమె గురించి ఆరా తీస్తున్నారు. దీంతో నగరంపాలెం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో కేసుల ఫైళ్లను బయటకు తీశారు. ఆమెకు ఒక పోలీసు అధికారికి మధ్య ఉన్న సంబంధంపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. అంతేగాక ఆమె ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా మోసాలకు పాల్పడిందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈమె నగరానికి చెందిన ఓ భూకబ్జాదారుడితో చేతులు కలిపినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా భూ వివాదాలకు సంబంధించి ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం విూద ఆమెపై షీటు తెరవాల్సిందిగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు.
పట్టాభిపురంలో కేసులో ఓ న్యాయవాది పాత్రపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. న్యాయవాది ముసుగులో భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తేలింది. న్యాయవాదిపై పట్టాభిపురం, అరండల్‌పేట, పాతగుంటూరు స్టేషన్లలో భూకబ్జా కేసులు ఉన్నాయి. ఇతడిపై పోలీసులు షీట్ కూడా తెరిచారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ సవిూపంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వ్యూహాత్మకంగా ఆ స్థలానికి డాక్యుమెంట్లు సృష్టించి లోపాయకారిగా ఒకరిపై ఒకరు కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అప్రమత్తమై స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో న్యాయవాదిని నగరం నుంచి బహిష్కరించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని సమాచారం. ఈ మేరకు వీరిని నగర బహిష్కరణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గత జనవరిలో పట్టాభిపురం పోలీసులు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. నగరంలో ల్యాండ్ మాఫియాపై ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా వారిలో మార్పు కనిపించకపోవడంతో వారిని కూడా నగరం నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకొని ల్యాండ్ మాఫియా అమాయకుల భూములను అమాంతం సొంతం చేసుకుంటుంది. దానికి సబ్ రిజిస్ట్రార్లు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. వాస్తవానికి ఒక భూమికి ఒక సారి రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత అదే అమ్మిన వ్యక్తి ఆ ఆస్తిని మరోసారి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగితే దానిని రద్దు చేయాలంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాల్సిందే. ఈ నేపథ్యంలో బాధితుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. చివరకు మాఫియాకు బాధితులు తలొగ్గాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ల్యాండ్ మాఫియా ఆగడాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
నగరంలో సుమారు 20 మంది ల్యాండ్ మాఫియాగా తయారయ్యారు. భూకబ్జాదారుల ముఠాలో తాజాగా చేరిన ఓ మహిళ చురుకైనపాత్ర పోషిస్తుంది. పండరీపురం ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు చేరిన భూకబ్జాదారుల ముఠాలో తాజాగా చేరిన ఓ మహిళ ఆ తరువాత అదే ఇంటిని కొనుగోలు చేస్తానని వృద్ధుడైన ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తనకు మత్తు ఇచ్చి విక్రయ బయానా అగ్రిమెంట్ బదులు విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాయించుకుని మోసం చేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో 2014లో పట్టాభిపురంస్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఏడాది కన్నావారితోటలోని బొగ్గవరపు నారాయణమ్మకు చెందిన కోట్లు ఖరీదు చేసే ఇంటికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ మహిళే నలుగురికి విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు రిజిసే?ట్రషన్ అధికారులకు, నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమోతో పాటు మరో ఎనిమిది మందిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులు మూలనపడ్డాయి. మంగళగిరి పరిధిలోని ఎన్నారై ఆసుపత్రి ఎదుట ఉన్న కోట్ల ఖరీదు చేసే భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.30 లక్షల చలానా కూడా తీశారు. మంగళగిరి సబ్ రిజిసా?ట్రర్ కార్యాలయంలో రిజిసే?ట్రషన్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో బాధితుడు, న్యాయవాది వాకా రామ్‌గోపాల్‌గౌడ్ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో కేసు నమోదైంది. రాజధానిగా మారిన నేపద్యంలో గుంటూరు జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ల్యాండ్ మాఫియా ఇక్కడి భూముల కబ్జాపై దృష్టిసారించిందని రియల్టర్లు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు కూడా ల్యాండ్ మాఫియాకు కలసివస్తోందన్నారు.

No comments:
Post a Comment