ఎండలకు కాగుతున్న విశాఖ
విశాఖపట్నం, ఏప్రిల్ 16:
భానుడి ప్రతాపంతో విశాఖ జిల్లా అట్టుడుకుతోంది. మూడ్రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జిల్లా వాసులు అల్లాడుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్ధితి ఉంటుందని అధికారులు స్పష్టం చేయడంతో బయటకు రావడానికే జంకుతున్నారు. వడగాలులను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన కూడళ్ళు కర్ఫ్యూ ను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్ననికి ఎండతో పాటు వేడిగాల్పులు వీయడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. రోజువారీ పనులపై బయటకు వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంది.. ఇక పాఠశాలలు వదిలిన తర్వాత ఇళ్లకు చేరుకోవటానికి పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండ దాటికి ముఖమంతా మండిపోవటంతో స్కార్ఫ్‌లతో ఒళ్లు దాచుకుంటున్నారు. అలానే నెత్తిన గొడుగులు వేసుకుని మరీ బయటకు వస్తున్నారు.
ఉదయం 11 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావటానికి సాహసించటం లేదు. దాంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మూడ్రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నమోదైంది. అలానే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. మొన్నటి వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీలుగా నమోదైతే, గడచిన మూడ్రోజులుగా రాత్రి సమయంలో 27 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతతో పాటు ఉక్కబోతను భరించలేకపోతున్నారు. మరోవైపు జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎండబారిన పడకుండా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మేలో ఎండల పరిస్ధితి ఎలా ఉంటుందోననే ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ కూడా ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయనే సమాచారం ఇస్తుండటంతో ఎలా గడిపేది దేవుడా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

No comments:
Post a Comment