Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 16 April 2016

ఇందూరులో మండుతున్న ఎండలు

ఇందూరులో మండుతున్న ఎండలు
నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16:
నిజామాబాద్‌ జిల్లాలో సూ ర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 44.9 డిగ్రీలుగా నమోదైంది. వారం రోజులుగా వడగాల్పులతో భయపెడుతున్న భానుడు త న ప్రతాపాన్ని మరింత చూపుతున్నాడు. శుక్రవారం మ ధ్యాహ్నం వరకు 43.6 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు సా యంత్రం వరకు 44.9 డిగ్రీలకు చేరడంతో ఎండలతో ప్రజలు విలవిల్లాడారు. రాష్ట్రం వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో ఎండ తీవ్రతల దృష్ట్యా కలెక్టర్‌ చైర్మన్‌గా హీట్‌వేవ్‌ కమిటీ ఏర్పాటు తరువాత రెండోసారి జిల్లాలో ఎండలు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాయి.
జిల్లాలో ఈ నెల 6 వరకు 12 మంది మృతి చెందగా ఈ నెల 12న నిజాంసాగర్‌ మండలం ముగ్దుంపూర్‌ గిర్నితండాకు చెందిన పశువుల కాపరి కడవత్‌ బన్సి మృతి చెందాడు. ఈ నెల 14న బోధన్‌ మండలం సంగెం గ్రామానికి చెందిన హైమద్‌ అనే కులీ వడ దెబ్బతో మృతి చెందాడు. వేసవి కాలంలో రికార్డుల్లోకి ఎక్కుతున్న మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో వారం రోజులుగా ఎల్‌నినో ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గాలిలో తేమ శాతం తగ్గడంతో వడగాల్పులు పెరిగి ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటలకు సూర్యుడు నడినెత్తివిూద కొట్టినంతగా ప్రతాపం చూపడంతో ప్రజలు పది గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
ఎండలు మండుతున్నాయని ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను ఇవ్వడంతో విద్యార్థులకు ఊరట కలిగించింది. కానీ పగలు డ్యూటీలకు వెళ్లేవారు మాత్రం సూర్యప్రతాపం సమయంలో విధులు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వడగాల్పుల ప్రభావం వాతవరణం చల్లబడే వరకు ఇదే పరిస్థితి ఉంటే తీక్షణమైన సూర్యకిరణాలకు చర్మం రంగు మారడంమే కాకుండా ఎక్కువ సేపు ఎండలో పని చేస్తే చర్మ సంబంధిత సమస్యలు తప్పవని జిల్లా జనరల్‌ వైద్యశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చర్మవ్యాధుల నిపుణుడు రాంచందర్‌ రావు తెలిపారు. వర్షాలు పడక నీళ్లు పాతళానికి పోయి సతమత మవుతున్న వేళ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వశాఖలు మాత్రం ప్రజలకు దాహార్తిని తీర్చిందుకు గ్రామస్థాయి మొదలు, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. కొన్ని ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అంబలి కేంద్రాలను, మజ్జిగ సరఫరా చేస్తుంటే మరికొందరు మినరల్‌ వాటర్‌ను ఉచితంగా సరఫరా చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి హీట్‌వేవ్స్‌ నేపథ్యంలో ప్రభుత్వం పగటి పనుల నేపథ్యంలో విధి నిర్వహణకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks