చల్ల చల్లని రోగాలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16:
ఐస్ తయారి దారులు నాణ్యతను పాటించకపోవడంతో సామాన్యులకు రోగాలు తప్పడం లేదు. కేవలం కుళాయి, బోరు వాటర్ మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా కాలువలు, చెరువుల్లోను ఉండే మురుగు వాటర్ తో కుడా ఐస్ తయారు చేస్తున్నారు. ఇది చుట్టుపక్కల వున్న జ్యూస్ సెంటర్లకు చేరుతుంది. భానుడి దాటికి సామాన్యుడు తాగే చెరకు, పళ్లరసాల్లో ఈ ఐస్ కలవడంతో అనారోగ్యాలు పాలౌతున్నారు.
వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు ఎండలకు ఎంతో భయపడతారు. ఒక ఏడాదికి మించి ఇంకో ఏడాది భనుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వడగాల్పులకు తట్టుకోలేకపోతున్నారు. సాద్యమైనంత వరకు ఇంటిలో నుండి బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. కానీ రెక్కాడితేనే గాని డొక్కాడని ప్రజలు మండుటెండలోనే పనులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చల్లని పానియాలను సేవిస్తుండడంతో అవే వారి అనారోగ్యాలకు కారణాలవుతున్నాయి. వేసవిలో చల్లదనాన్ని అందించే పండ్లరసాలు, చెరుకురసాలు మొదలైనవి కనిపిస్తుంటాయి. సహజ సిద్దంగా వీటికి వేడిమి నుండి సేదదీర్చే గుణం ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా వీటిని తాగమని చెబుతుంటారు. కానీ సహజ సిద్దంగా వీటికున్న గుణంతో పాటు కృత్రిమంగా ఐస్ ను కలపడంతో ఇవే రోగాలను తెచ్చిపెడుతున్నాయి. వేసవిలో చెరుకురసాలు, పండ్ల రసాల వ్యాపారం జోరందుకుంటుంది. ఈ ప్రధాన వ్యాపారానికి మూలకం అయిన ఐస్ వ్యాపారానికి కూడా హద్దులంటూ ఉండవు విచ్చల విడిగా రేట్లను పెంచీ జోరుగా వ్యాపారం సాగిస్తుంటారు. అయితే వ్యాపారం పేరుతో సొమ్ము చేసుకొనే క్రమంలో న్యాణ్యత పాటించకపోవడం, నియమనిబంధనలు పాటించకపోవడం శుభ్రతను పాటించకపోవడమే ఇక్కడ ప్రాణాల విూదికి తెస్తున్నాయి.
ఐస్ తయారి కోసం పాటించాల్సిన నిబంధనలను తయారి దారులు గాలికి వదిలేయడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. శుద్ది చేసిన మంచి నీరు లేదా శుద్ది చేసిన భూగర్భ జలాలను తీసుకోని ఐస్ తయారు చేయాలి. కానీ తూర్పుగోదావరి జిల్లాలోని చాలా చోట్ల ఈ వేసవి కాలంలో కాలవల్లోను, చెరువుల్లోను లభించే మురుగు నీటినే ఐస్ తయారికి వాడేస్తున్నారు. చెరుకు రసాలు, జ్యూస్ షాపులు వంటి వాటిల్లో శుభ్రత పాటించకపోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. చల్లని పానియాలు ఉపయోగించే చోట గ్లాసులను సరిగా శుభ్రం చేయాలని లేదంటే పేపర్ క్లాసులను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
సేదదీరడానికి చల్లని పానియాలు తాగాలంటేనే భయం వేస్తుందని సామాన్యులు వాపోతున్నారు. వేడిమిని తప్పించుకోవడానికి చల్లని పానియాలు తాగక తప్పడంలేదని కానీ శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. సంబందిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. తాపాన్ని చలార్చే చల్లని పానియాలని ఆశ్రయించి డబ్బులిచ్చి మరీ జబ్బులను కొనుగోలు చేసినట్లు అవుతుందని కొనుగోలుదారులు అంటున్నారు. వ్యాపారులు నియమ నిబందనలు పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.

No comments:
Post a Comment