దేశంలో ఎందరో స్టార్లు ఉండొచ్చు.. కానీ 'సూపర్ స్టార్' మాత్రం తానొక్కడినే అని రుజువు చేస్తున్నాడు రజినీకాంత్. తన కొత్త సినిమా 'కబాలి' టీజర్ తో
ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఓ కొత్త రికార్డ్ ను స ష్టిస్తుంది..
సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు, మిగిలిన హీరోలకు మార్కెట్ లేని మారుమూల చోట కూడా సూపర్ స్టార్ కి ఓ రేంజ్
ఫాలోయింగ్ ఉంది. అందుకే హిట్ కి ఫ్లాఫ్ కి సంభందం లేకుండా తన కెరీర్ ని శిఖరమంత ఎత్తుకు చేరేలా చేసుకున్నాడు సూపర్ స్టార్. రోబోతో అది నిజం
చేయగా తరువాత వచ్చిన సినిమాలు మాత్రం తీవ్ర నిరాశపరిచాయి.
90 కోట్లతో తెరకెక్కిన కొచ్చాడియాన్, 100 కోట్లతో తెరకెక్కిన లింగా సినిమాలు టోటల్ గా 50 కోట్లు, 67 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్ టైం డిజస్టర్లుగా
నిలిచాయి. ఇలాంటి సమయంలో స్టార్ డైరెక్టర్ తో కాకుండా మద్రాస్ అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పా.రంజిత్ తో కబాలి మొదలుపెట్టాడు
రజినీ.
ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యేవరకు ఎలాంటి అంచనాలు లేకున్నా టీజర్ స ష్టించిన రికార్డులతో ఇప్పుడు టోటల్ గా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేటట్లు సమాచారం. ఇదే జరిగితే సౌత్ లోనే కాదు టోటల్ ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఓ కొత్త రికార్డ్ ను స ష్టిస్తుంది.



No comments:
Post a Comment