హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన వాలు కనులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసిన అదా శర్మ సినిమాలైతే చేస్తుంది కాని హిట్ మాత్రం కొట్టట్లేదు. అయితే
సడెన్ గా వచ్చిన ఓ సినిమా మాత్రం అమ్మడి ఎకౌంట్ లో ఓ సూపర్ హిట్ పడేలా చేసుకుంది.అదే ఇప్పుడు ఈ పిల్లకు మరో సూపర్ ఆఫర్ ని
తెచ్చిపెట్టింది.
హార్ట్ ఎటాక్ సినిమాతో అదా శర్మ ఆ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నా తర్వాత సరైన అవకాశాలను సంపాధించలేక పోయింది..అదాశర్మకు
తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు... సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్న రోల్ కావడంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు.
పిల్ల లో మ్యాటర్ వున్నా కాలం మాత్రం ఈ పిల్లకు సాత్ ఇవ్వలేదు..అంతేకాదు ప్రాతలను ఎన్నుకోవటం కూడ ఈ పిల్లకు చేత కాదు అనే విమర్శలు
వినిపించాయి..విమర్శలకు తగ్గట్టుగానే ఈ పిల్ల నటించిన సినిమాలు అన్ని సో సో మార్కులే వేయించుకున్నాయి...హాట్ అందాలు ఆరబోసిన గరమ్
కూడా ఈ పిల్ల కు హెల్ప్ కాలేదు.
బాలీవుడ్ నుండి వచ్చినా తెలుగు వాతావరణం బాగా నచ్చి ఇక్కడే సెటిల్ అయ్యేందుకు రెడి అయ్యిపోయింది ఈ పిల్ల అని అందరు ఫిక్స్
అయ్యారు..అయిన ఏం లాభం వరుస సినిమాలు చేస్తున్నా అమ్మడికి బ్రేక్ మాత్రం రాలేదు...చాలా రోజుల తరువాత నటించిన గరం మళ్లీ నిరాశ పరచగా
క్షణం పర్వాలేదనిపించుకుంది.. హిట్ తాలూకు పరిణామాల్లో తానెంత ఉపయోగపడిందో అనే దాని కన్నా అదా శర్మ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.
క్షణం అంటూ చేసిన ఓ చిన్న ప్రయత్నం సూపర్ హిట్ అయ్యింది. తన పాపను మిస్ చేసుకున్న తల్లి పాత్రలో అదా శర్మ తన అదుÄతే నటనను
ప్రదర్శించిందని చెప్పొచ్చు. అయితే ఇదే తనకు ఓ భారీ లక్కీ ఆఫర్ ను తెచ్చిపెట్టింది. తెలుగులో సూపర్ హిట్ అయిన క్షణం సినిమాను బాలీవుడ్లో భారీ
రేంజ్ లో నిర్మించాలనుకుంటున్నారు.
అదా శర్మ పరిశ్రమకు వచ్చి మూడు నాలుగేళ్లు కావొస్తున్నా తెరంగేట్రం చేసిన ఒక్క సినిమా తప్ప చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆఫర్లు
రాక వచ్చిన అవకాశాలనే చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ గా చేసినా ప్రేక్షకులు చూడలేని పరిస్థితి ..అలాంటి సిట్యూయేషన్ ని పూర్తిగా
మార్చేసింది క్షణం సినిమా.
ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను
నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ గా అదా శర్మనే సెలెక్ట్ చేశారని సమాచారం. అయితే తొలి సినిమా బాలీవుడ్లో చేసినా తెలుగులో ఆఫర్ రాగానే ఇక్కడకు
వచ్చిన అదా ఇక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాలైతే చేస్తుంది కాని అవి ప్రేక్షకులకు చేరువవ్వలేదు.
పరాెక్ట్‌ే ఫిగర్ కు ప్రతి రూపమైన అదాకు క్షణం హిట్ అయ్యి అదే బాలీవుడ్ ఆఫర్ ను తీసుకురావడం గొప్ప విషయం,. మరి బీ టౌన్లో అయినా
వరుసెంట హిట్ సినిమాలు చేయాలాని ఆకాంక్షిద్దాం. హిట్ మజాను ఎంజాయ్ చేస్తున్న అదా శర్మ ఇకనుండి సినిమాల విషయంలో ఆచితూచి
అడుగులేయాలనుకుంటుంది.



No comments:
Post a Comment