రెజీనాను టాలీవుడ్ పక్కకు పెట్టిందా ? ఇప్పుడు ఇదే హాట్ న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. గత ఏడాది రెజీనా స్పీడ్ చూసిన వారు ఈమె టాప్
హీరోయిన్ ల లిస్టులోకి చేరిపోతుంది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు సీన్ వేరేగా వుంది..అందం అభినయం రెండు వున్న ఈ పిల్లకు కాలం మాత్రం
కలసి రావటం లేదు
రెజినా ఈ పిల్ల గురించి ఏం చెప్పుతాం...అన్ని వున్న టాలీవుడ్ ఈ పిల్లకు కలసిరావటం లేదు అనటం తప్ప..ఫస్ట్ మూవితోనే వారు వీరు అని తేడా
లేకుండ అందరిని ఇంప్రెస్ చేసింది..దాంతో వరసు అవకాశాలను అందిపుచ్చుకుంది..యంగ్ హీరోస్ కు ఈ పిల్లే బెస్ట్ అనిపించింది..దాంతో ఈ పిల్లకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ వుంటుంది అనుకున్నారు అందరు
రెజినా నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లో ఒక పక్క గ్లామర్ మరో పక్క అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేయడంతో ఇక ఆమెకు టాప్ హీరోల పక్కన
ఛాన్సులు వస్తాయని విశ్లేషకులు అంచనాలు వేసారు. అయితే ఒక్క 'సౌఖ్యం' సినిమా ఫెయిల్యూర్ ఆమె కెరీర్ కు అనుకోని షాక్ ఇచ్చి బ్రేక్ వేసింది
సౌఖ్యం సినిమాలో హీరో గా నటించిన గోపీచంద్ కు వరుసగా సినిమాలు వస్తున్నాయి కాని రెజీనాకు మాత్రం అవకాశాలు రావడం పూర్తిగా తగ్గి పోయింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది.
రెజినా ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తీస్తున్న 'జో అచ్యుతానంద' లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇది తప్ప రెజీనాకు ఒక్క సినిమా కూడ
లేదు. మెగా యంగ్ హీరోలతో వరుసగా మూడు సినిమాలు చేసిన రెజీనాను అదే మెగా యంగ్ హీరోలు ప్రస్తుతం పక్కకు పెట్టేస్తున్నారు అన్న వార్తలు
వినపడుతున్నాయి.
క్యూట్ అందాలతో పాటు హాట్ అందాలకు కూడ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రెజినాని పక్కన పెట్టటానికి రకరకాల కారణాలు కూడ ప్రచారంలో ఉన్నా యి.
మీడియం రేంజి సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల హీరోయిన్ గా రెజీనా ఎదుగుతుంది అనుకుంటే అసలు తెలుగులో సినిమాలే లేని పరిస్థితిలో
రెజీనా ఉంది అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఈ డస్కీ బ్యూటీకి ఇప్పటికే 27 ఏళ్లు వచ్చేసిన నేపధ్యంలో మరో రెండేళ్లు గడిస్తే రెజీనా కెరియర్ ముగిసి పోయే నేపధ్యంలో ఆమెకు ఇలా అవకాశాలు
రాకపోవడం వెనుక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ పిల్ల లవ్ వ్యవహారం కూడ ఓ రీజన్ అని
అంటున్నారు..ఈ వార్తలో ఎంత వరకు నిజం వుందో తెలియక పోయిన..రెజినా మాత్రం టాక్ ఆప్ ద టాలీవుడ్ అయ్యింది
అందం అభినయం రెండూ ఉన్న రెజీనాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం ఆమె దురద ష్టం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ఈమె నెమ్మదిగా కోలీవుడ్ లో సెటిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి
అని అంటున్నారు.. చివరికి ఈ కధ ఏ కంచికి చేరుతుందో తెలియాలి అంటే కొనాళ్లు ఆగుతే సరిపోతుంది.



No comments:
Post a Comment