టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ టైంలోనే అందరి మనసులను దోచేసింది రకుల్ ప్రీత్ సింగ్. కెరియర్ కి అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి
చేసుకోబోతుందా అంటే అలా ఏం లేదు కాని రీసెంట్ గా రకుల్ ఓ స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొని తన పెళ్లి వార్తల గురించి చాలా చాలా చెప్పింది.
హాట్ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రకూల్ ప్రీత్. కేవలం హాట్ అందాలకు మాత్రమేనా అంటే దాంతో పాటు లిప్ లాక్ లకు కూడ ఈ పిల్ల టూ స్పెషల్. అందుకే ఆ హిరో ఈ హీరో అనే తేడా లేకుండ ప్రతి హీరో ఛాయిస్ ఈ ముద్దుగుమ్మ నే అయ్యింది. అంతేకాదు వరుస సినిమాలతో హల్ చల్ చేస్తుంది. అంతేనా తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కబుర్లు కూడ చెప్పి టాలీవుడ్ ని మాయ చేస్తుంది.
ఈ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోదట. అలాగని ఇష్టమొచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోదట. మరెలా అంటే.. ప్రేమించి ఆ ప్రేమను పెద్ద వాళ్లు అంగీకరించేలా చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటుందట ఈ భామ. ఇలా అందంగా చాలా చాలా పెళ్లి ముచ్చట్లు చెప్పింది ఈ బ్యూటి.
మ్యారేజ్ మ్యాటర్స్ ఇలా చెప్పేస్తుందని ఇప్పుడే ఈ అమ్మడికి పెళ్లా అని ఫిక్స్ అవ్వకండి....ఎస్ ఇప్పుడప్పుడే అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు
అంది..అంతేకాదు.. అసలు ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశా అంటూ వయ్యారాలు పోయింది అమ్మడు. ఇక్కడితో అపిందా..టాలీవుడ్ హ్యాండ్ సమ్ పై మనసు
పరేసుకున్నా అని తాపిగా చెప్పింది వరుస సినిమాలతో టాలీవుడ్ ని ఏలేస్తున్న రకూల్ పనిలో పనిగా తన మనసులోని మాట ను బయట పెట్టింది...ఎస్ మహేష్ బాబుతో సినిమా చేయకుండా పెళ్లెలా చేసుకుంటా అంటూ సూపర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని తెలిపింది ఈ బ్యూటి...సో ఈ మాటలను బట్టి ఈ అమ్మడి నెక్ట్స్ టార్టెట్ మహేష్ అన్న ఫిక్స్ అయ్యిపోవచ్చు.
ఈ ఇయర్ లో జూనియర్ ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాల హిట్ అందుకున్న రకుల్ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయ్యింది.
మొన్నటిదాకా ఓ మోస్తారు హీరోలతో చేసిన హీరోయిన్ ఇప్పుడు స్టార్ హీరోల పక్కన మాత్రమే అంటుంది. ప్రస్తుతం రాం చరణ్ తని ఒరువన్ రీమేక్ ధ వ
సినిమా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, రీసెంట్ గా సాయి ధరం తేజ్ సినిమాలో ఓకే అయ్యింది.
అంతేకాదు సరైనోడు సినిమాలో తను రాసుకున్న పాత్రకు తెర మీద జీవం పోసిందని రకుల్ ను తన తర్వాత సినిమాలో కూడా తీసుకున్నాడు దర్శకుడు
బోయపాటి శ్రీను. మరి ఈ రేంజ్ లో రేసుగుర్రంలా పరుగెడుతున్న అమ్మడి కెరియర్ చూస్తుంటే నిరంతరాయంగా మరో ఐదారేళ్లు దిగ్విజయంగా కొనసాగేలా
ఉంది. సో పెళ్లి గిల్లి లాంటివన్ని పక్కన పెట్టేసి రకుల్ కెరియర్ పై ద ష్టి సారిస్తే మంచింది.



No comments:
Post a Comment