రౌడీయిజం పేరు చెబితే బెజవాడ గుర్తుకు వస్తుంది. రౌడీల అరాచకాలు అక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పోలీసు కమిషనర్ ఎవరొచ్చినా
ముందుగా రౌడీల పై ద ష్టి పెడతారు. గతంలో సురేంద్రబాబు కమిషనర్ గా వచ్చి రౌడీల మక్కెలు ఇరగదీశాడంటారు. నరసింహా సినిమాలో బాలయ్య బాబు
అలానే బెజవాడలో రౌడీల పై లాఠీలు ప్రయోగిస్తాడు. చివరకు వారిని లొంగదీస్తాడు. అంతగా రౌడీయిజం బెజవాడతో ముడిపడి ఉంది. పోలీసులు వారిని అదుపు చేయలేక పోతున్నారా లేక మామూళ్లకు రుచి మరిగి వాళ్లను ప్రొత్సహిస్తున్నారా అనే చర్చ సాగుతుందిప్పుడు.
విజయవాడ మొగల్రాజపురం కొండ పై నివాసముండే వాళ్లు ఇళ్లు కట్టాలంటే రౌడీలకు మాముళ్లు ఇచ్చుకోవాలి. ఆ పని చేయకపోతే ఎంతకైనా తెగించి
కర్రలతో కొట్టడం, రాడ్ లతో దాడి చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజలకు అది అలవాటుగా మారింది. పెద్ద పెద్ద వాళ్లను వదిలి పేదల పైనా వాళ్లు తమ
ప్రతాపం చూపిస్తారు. ఎంతగా అంటే ఇసుక పోసినందుకు ఇంతని లంచాలు ఇవ్వాలట. మేము ఇవ్వలేమంటే కర్రలతో రఫ్ ఆడిస్తారు. అదే విషయం పై
పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రౌడీలు ఎంతగా రెచ్చిపోతున్నారో ఆడియో,వీడియోల ఆధారాలు దొరికాయి. ఇంకా
దొరుకుతున్నాయి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
బుల్లెబ్బాయి అనే ముఠా కార్మికుడు తన పై దాడి చేసిన సురేష్ అనే రౌడీ గ్యాంగ్ పై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పట్టించుకోక
పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అరాచకాలకు పాల్పడితే తిత్తి తీస్తామనే పోలీస్ బాస్ లు రౌడీల విషయంలో ఆ మాటలు మాట్లాడటం లేదు.
విజయవాడ రౌడీలను అణిచి వేయడం అంత తేలిక కాదనే చర్చ సాగుతుంది. వారికి రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటమే ఇందుకు
కారణం. ఒకవేళ ఎవరినైనా తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే వెంటనే ఫోన్ వస్తుందట. మన వాళ్లే వదలమనేది అటు నుంచి వచ్చిన ఫోన్ సారాశం. దీంతో
రౌడీలు మరింతగా రెచ్చిపోతున్నారంటున్నారు. మరి పోలీస్ బాస్ ఏం చేస్తున్నాడో మరి.

No comments:
Post a Comment