కరీంనగర్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డయేరియా(అతిసారం) ప్రబలుతుంది. గత వారం రోజుల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో
మార్పులు చోటుచేసుకోవటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి సాయంత్రానికల్లా ఈదురుగాలులు, వర్షాలు కురవటంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సింగరేణి సంస్థ ప్రాంతీయ వైద్యశాలలో సుమారు వంద మందికి పైగా డయేరియా బాధితులు చికిత్స
పొందుతున్నారు. సింగరేణి సంస్థ కార్మికుల గ హాలతో పాటు రామగుండం నగర పాలక సంస్థ సారధ్యంలో మంచినీటిని సరఫరా చేస్తుంది. కాగా ఇటీవల
కురుస్తున్న ఆకాల వర్షంతో మంచినీరు కాస్తా కలుషితం కావటంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కలుషిత నీరు తాగిన పెద్దలకు, చిన్నారులకు
వాంతులు, వీరేచనాలు రావటంతో ఆస్పత్రికి వరుస కడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికి కలుషితమైన నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు ఇస్తున్నారు.
సాధారణంగా రోజు వచ్చే నీటినే తాగుతున్నమని, ఒక్కసారిగా వాంతులు వస్తున్నయని డయేరియా బాధితులంటున్నారు. నీరు కలుషితం కాకుండా
చూసుకోవాలని కోరుకుంటున్నారు.

No comments:
Post a Comment