అందరూ వూహించినట్లే నిన్న ఉత్తరాఖండ్ లో జరిగిన బలపరీక్షలో హరీశ్ రావత్ విజయం సాధించారు. ఆయన నెగ్గినట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. హరీశ్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నారని వ్యాఖ్యానించింది. అంతకుముందు రాష్ట్ర సీఎస్ ఓ సీల్డ్ కవర్ లో విశ్వాస పరీక్ష ఓటింగ్ వివరాలు ధర్మాసనానికి అందించారు. రావత్ గెలిచినట్టు ధర్మాసనం వ్యాఖ్యలు విన్న ఏజీ, ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలు విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 న రాష్ట్రపతి పాలన విధించారు.
బుధవారం ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్షలో 61 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుంటే... 9 మంది కాంగ్రెస్ రెబల్‌పై అనర్హతవేటు పడింది. దీంతో అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు 61 మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు 27 మంది సభ్యులుంటే.. బలపరీక్షకు ముందు రేఖా ఆర్య బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ 28 ఎమ్మెల్యేలు ఉండగా, బీమ్‌లాల్ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు మద్దుతు ప్రకటించారు. అసెంబ్లీలోని ఇద్దరు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెట్లు కూడా రావత్‌కు అనుకూలంగా నిలించారు.
సభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా... 9 కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.
దీంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బలపరీక్షలో హరీశ్‌రావత్‌కు మద్దతుగా 33 ఓట్లు వచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిందిగా ఆయనకు సూచించింది. దీంతో గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఎదుర్కొటున్న బీజేపీకి ఈ పరిణామం భంగపాటుగా భావించవచ్చు.

No comments:
Post a Comment