గతంలో ఏ చిత్రం చూసినా ఆ సినిమాలో ఉన్న పాత్రల్లో నటులు ఒదిగిపోయేవారు. సినిమాలో పాత్రలే వారిని నడిపించేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. హీరో, హీరోయిన్లు బట్టి పాత్రలు, కథలు రాసేస్తున్నారు. చిత్రసీమలో ఏ హీరోయిన్‌ను చూద్దామన్నా ఎంత గ్లామర్‌గా ఆ సినిమాలో నటించాం? హీరోకి పోటీ ఇవ్వగలిగామా? లేదా? అన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారు గానీ ఆ పాత్రకు న్యాయం చేశామా? లేదా? అన్న దాన్ని కాదు.
కొందరు ఇప్పటికీ పాత్రంటే ప్రాణమిచ్చే వాళ్లూ ఉన్నారు. బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాజల్ అగర్వాల్ కూడా తన గ్లామర్‌ను
పక్కపెట్టి ఓ సాహసోపేతమైన పాత్ర చేస్తోంది. బాలీవుడ్‌లో రూపొందుతోన్న 'దో లఫజోన్ కి కహాని' చిత్రంలో ఈమె అంధురాలుగా నటిస్తుంది. బాలీవుడ్‌లో
అవకాశాలు సంపాదించుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం తన కెరీర్‌లో ఓ చాలెజింగ్ పాత్ర అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్‌లో నటించేందుకు ఆమె అనేక
ప్రదేశాలను పరిశీలించింది. వాటి గురించి ఆమె మాట్లాడుతూ '' నేను చాలా చోట్ల పరిశీలించాను. హెలెన్ కెల్లర్ రాసిన పుస్తకాలు చదివాను. అంధుల పాత్రలు
ఉన్న అనేక సినిమాలు చూశాను. ఓ వర్క్‌షాప్‌కు వెళ్లాను. సెయింట్ ఎక్స్‌వేయిర్స్ కాలేజీ స్పెషల్ బ్రాంచ్‌కి వెళ్లాను. అక్కడ నాకర్థమైంది అంధుల
జీవితమంటే ఏమిటి? వాళ్ల అలవాట్లు ఎలా ఉంటాయి. వాళ్లు నిత్యం ఏం చేస్తుంటారు అని. అక్కడ డాక్టర్ సామ్, కాల్‌వీన్ ఇద్దరూ నాకు అన్ని విషయాలు వివరించారు.
బ్రెయిలీ లిపి, అంధులు వాడే ప్రత్యేక కంప్యూటర్, ఆడియో మిషీయన్, మైక్రోవేవ్స్, సెల్‌ఫోన్స్ గురించి వాళ్లు వివరించారు. అంధురాలుగా ఆ పాత్రలో ఎలా చేయాలో నాకు సహాయ పడింది వాళ్లే. కాల్‌వీన్ అయితే నాకు కర్ర పట్టుకుని మరీ నడిపించారు. ఓ నిజమైన అంధురాలకు ఎలాంటి భావన ఉంటుందో
అటువంటి భావనకు నేనూ లోనయ్యాను. ఓ దశలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంతలా బాధ అనిపించింది. ఈ చిత్రంలో నా పాత్ర
ప్రముఖంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను'' అని అన్నది కాజల్. రణదీప్ హుడా కథానాయకుడు. దీపక్ తిజోరి దర్శకుడు. ఈ సినిమా జూన్ పదో తేదీన
విడుదల కానుంది.



No comments:
Post a Comment