హైదరాబాద్ లో సంచలనం స ష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. కేసులో నిందితులుగా నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారు. వీరంతా తమ చేష్టలతో సమాజంలో ఉండే అర్హతను కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ-8గా ఉన్న నిందితుడికి 20 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. వీరి నేరాలు తీవ్రమైనవని, అభియోగాలు తనకు దిగ్బ్రాంతిని కలిగించాయని, లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కానప్పటికీ, స్వల్ప శిక్షకు వీరు అనర్హులని అన్నారు.
పహాడీషరీఫ్ పోలీస్ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్‌గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్‌లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఫైజల్ దయానీ నేత త్వంలో 8 మంది సభ్యుల గల ముఠా పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటపడడంతో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. పహాడీషరీఫ్ ప్రాంతంలో షాహీన్ నగర్‌లోని ఓ ఫాం హౌస్‌లో కుటుంబం ఉండేది. కుటుంబ సభ్యులందరూ వెళ్లిపోగా పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది.విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి వాచ్‌మన్‌పై దాడి చేసి జంట ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ విక తమైన చేష్టలతో ఆ యువతిపై విరుచుకుపడి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీడియోలు తీసి తమ పైశాచికత్వాన్ని బయటపెట్టారు. ఈ జంట ఎంత ప్రాధేయపడినా గ్యాంగ్ వినిపించుకోకుండా యువతిపై అఘాత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి రూ.60 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించారు.
తమ కుటుంబ నేపథ్యం, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని నిందితులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. నేరస్థుల కుటుంబ నేపథ్యం కాకుండా.. జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, హైదరాబాద్ శివార్లలో కనిపించే జంటలకు పాములు చూపించి అత్యాచారాలు, దోపిడీలు చేసినట్టుగా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి అత్యాచారాలను నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లభించకపోగా, దోపిడీ, భయభ్రాంతులను చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయి. మొత్తం 9 మందిపై చార్జ్ షీట్ దాఖలు కాగా, 8 మందిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. దాదాపు 37 మంది స్నేక్‌గ్యాంగ్ యువతులపై అక త్యాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది.

No comments:
Post a Comment