రాజమహేంద్రవరం,
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్డు కం రైలు వంతెనగా పేరుగాంచిన ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రధాన వారధి అయిన రోడ్డు కం రైలు వంతెన ఇకపై విద్యుత్ వెలుగులతో కాంతులీననుంది. గోదావరి మహా పుష్కరాల సందఠంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 20 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్రంగానే ఉండి ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని వీక్షించారు. ఈసందఠంగా రోడ్డు కం రైలు వంతెనకు రాత్రి సమయాల్లో విద్యుత్ సదుపాయం లేకపోవడాన్ని గుర్తించారు. అయితే పుష్కరాల సందఠంగా తాత్కాలికంగా విద్యుత్‌ను ఏర్పాటు చేశారు. పుష్కరాల 12 రోజులపాటు రోడ్డు కం రైలు వంతెన విద్యుత్ అలంకరణతో కాంతులు చిమ్మింది. అనంతరం మళ్లీ వంతెనను చీకటి ఆవరించింది. ఈనేపథ్యంలో ఈ వంతెనకు శాశ్వతంగా విద్యుత్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పర్యాటకశాఖాధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. రెండు నెలలుగా ఈ వంతెనపై విద్యుత్ అలంకరణ పనులను రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో సంబంధిత ఎలక్ట్రికల్ విభాగం చేపట్టింది. ఈ వంతెనకు విద్యుత్ అలంకరణ పనులు పూర్తయ్యాయి.
ఈనేపథ్యంలో ఈనెల 18వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ అలంకరణను ప్రారంభించనున్నారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని నగరంలోని మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమం సందఠంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమం మధ్యాహ్నం పూట కావడంతో రాత్రి సమయంలో విద్యుత్ అలంకరణకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో జరిగే బహిరంగ సభ ఆ రోజు సాయంత్రం ఆరు గంటల దాటిన తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ సందఠంగా పెద్దాపురంలో జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రోడ్డు కం రైలు వంతెనపై విద్యుత్ అలంకరణకు సంబంధించిన స్విచ్‌ను చంద్రబాబునాయుడు ఆన్ చేయనున్నారు. పెద్దాపురంలో స్విచ్ ఆన్ చేయగానే రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్నత స్థానంలో నిలిచి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు మరోసారి హైటెక్ హంగులతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా మరోసారి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు వీలుగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

No comments:
Post a Comment