చెన్నై:
మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు. ఎన్నికల సీజన్‌లో తమిళనాడులో ఉచిత బహుమతుల వాన కురుస్తున్నది. ప్రణాళికల్లో, వాగ్దానాల రూపంలో ఎవరెన్ని ఉచిత సరుకులివ్వగలరన్న దానికి పోటీపడుతున్నారు. డీఎంకే తన ప్రణాళిక ప్రచురించిన తర్వాత, ఎన్నికలకు కేవలం పది రోజుల
ముందు ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించారు. ఏఐఏడీఎంకే ఈసారి ప్రణాళికలో చెప్పిందేమంటే....
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణం పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఇస్తారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్నెట్‌తో సహా ల్యాప్‌టాప్‌లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ 'అరస' నుండి టీవీ కనెక్షన్ కోసం సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తామన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడకానికి ఛార్జీలు చెల్లించక్కర్లేదు. దీనివల్ల సుమారు 78 లక్షల కుటుంబాలకు మినహాయింపు లభిస్తుంది. సర్వత్రా ఉచితంగా
వైఫై కనెక్షన్ హామీ కూడా ఇచ్చారు. అన్నిటికంటే ఆకర్షణీయమైన హామీ మహిళలకు స్కూటర్ / మోపెడ్ కొనుక్కోడానికి 50 శాతం ధర ప్రభుత్వం
చెల్లిస్తుంది. 'అమ్మ' గారి తాయిలాల సంచి నుండి ఉప్పొంగుతున్న హామీలకు కారణం గత కొద్ది రోజులుగా ఏఐడీఎంకే ప్రజాభిమానంలో కొంత కొరత
ఏర్పడటమే. హామీల పరుగులో డీఎంకే పెద్ద సవాలే చేసింది. తాను అధికారంలోకి వస్తే 16 లక్షలమంది పాఠశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్ ఇస్తామని
ప్రకటించారు. పేద కుటుంబాల వారందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు. వ్యవసాయ, విద్యా రుణ మాఫీ, విద్యుత్-పాల ధర తగ్గింపు ప్రకటించారు. జయలలిత తన ప్రణాళికలో వీటన్నిటితో పాటు తనవి కొన్ని జోడించారు. సాధారణంగా లెక్కలు వేసి చూస్తే తెలుస్తున్నది ఏమంటే ఏఐడీఎంకే ప్రణాళికా హామీలు అమలుపర్చడానికి ఏడాదికి రు.10 వేల కోట్లు అదనంగా ఖర్చవుతుంది. తమిళనాడులో విద్యా రుణాల పరిమాణం 2015 మార్చి 31 నాటికి రు.16,482 కోట్లు ఉంది. ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ ఈ రుణమాఫీ హామీ ఇవ్వటంతో ఈ బరువు రాష్ట్ర ఖజానాయే భరించాల్సి ఉంటుంది. తమిళనాడులో ఈ విధంగా సరుకులు, సేవలు పంపకం కొత్తేమీ కాదు. తమిళనాడులో రు.2/-లకు కిలో బియ్యం పథకం చాలాకాలం క్రిందే అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అది దేశమంతటా విస్తరించింది.
ఎం.జి.రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పిల్లలు బడి మానేసే రేటును
తగ్గించింది. తర్వాత అది జాతీయ పథకంగా 'మిడ్ డే మీల్' పేరుతో దేశంలో ఇతరత్రా విస్తరించింది. విద్యార్థినులకు సైకిళ్ళు ఇచ్చే పథకం కూడా
తమిళనాడులోనే మొదలైంది. క్రమంగా దీరెకాలపు ఆర్థిక సామాజిక కార్యక్రమాలకు బదులు సరుకులు చేతికందించడం ద్వారా ఓట్లు అడిగే ప్రక్రియ
బలపడింది. కలర్ టీవీ, ల్యాప్‌టాప్, వంటింటి సామాగ్రి - ఈ మూడు పథకాల వల్ల ఒక దశాబ్దంలో రాష్ట్ర ప్రభుత్వం రు.11,561 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇదికాక తమిళనాడు ప్రభుత్వం పంచెలు, చీరలు, చెప్పుల కొరకు కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ విధంగా ఉచితంగా హామీలతో
తమిళనాడు ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతున్నదా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనియాంశమవుతున్నది.

No comments:
Post a Comment