సచివాలయం పనులు చకచకా
విజయవాడ, జూన్ 11, (
అంధ్రప్రదేశ్ లో పాలనకు అన్నీ రెడీ అవుతున్నాయి.వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.ఎల్‌అండ్‌టీ చేపట్టిన 3,4,5 బ్లాకుల్లో గ్రౌండ్‌ఫ్లోర్ పై అంతస్తులో తేలికపాటి బ్రిక్స్‌తో గదుల నిర్మాణం చివరిదశకు చేరుకుంది.షాపూర్జీ అండ్ పల్లోంజీ కడుతున్న1,2 బ్లాకుల్లో కింది ఫ్లోర్లలో గదుల పనులు కూడా పూర్తికావచ్చాయి. పై అంతస్తుల్లో సెంట్రింగ్ తొలగించి గదుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐదు బ్లాకుల్లోనూ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.గోడలు కట్టేందుకు బ్రిక్స్‌ను కూలీలతో భవనాల్లోకి చేర్చుతున్నారు. కట్టిన గదులకు సిమెంట్‌లో తయారు చేసిన రెడీమేడ్ విండోస్‌ను అమర్చుతున్నారు. ఇప్పటికే సచివాలయానికి సామాగ్రి కూడా చేరుకుంటుంది. ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్, సీలింగ్, ఫ్లంబర్ పనులు చేసేందుకు సామాగ్రి సచివాలయ ప్రాంగణానికి వచ్చేసింది. రాజస్థాన్ నుంచి కజారియా కంపెనీ నుంచి షాపూర్జీ సంస్థ టైల్స్‌ను కూడా తెప్పించారు. ఫ్లంబర్ పని చేపట్టేందుకు కూడా వర్కర్లు సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం గదుల నిర్మాణం పూరైన బ్లాకుల్లో ఎలక్ట్రికల్ వైర్లు అమర్చే పని జరుగుతోంది. సచివాలయ ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు కుడా వేగంగా సాగుతున్నాయి. మందడం- ఐనవోలు రోడ్డు నుంచి సచివాలయ భవనాల వద్దకు మొదట రెండు రోడ్లల పనులు మొదలు పెట్టారు. తాజాగా మరో రోడ్డు వేస్తున్నారు.అలాగే ప్రతి రోడ్డును, ప్రతి భవనాన్ని కలుపుతూ అడ్డంగా మరో మూడు రోడ్లు మొదలు పెట్టారు. అయితే కొద్దిరోజులుగా వాతావరణం మారి అడపాదడపా వాన జల్లులు పడుతుండడంతో సచివాలయ నిర్మాణ పనులకు కొద్దిగా ఆటంకం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. సచివాలయ పనులకు అదనంగా కూలీలను రప్పించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి రెండు వందల మందికి పైగా కూలీలు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని పనులు చేస్తున్నారు.

No comments:
Post a Comment