కామారెడ్డి లో నకిలీ రిజిస్ట్రేషన్లు
నిజామాబాద్, జూలై 30,
సుమారు కోటిన్నర రూపాయలు విలువ చేసే భూమిని నకిలీ ధ్రువపత్రాలతో పాటు పేరు ఒకరిది ఫొటో మరొకరిదితో రిజిస్ట్ట్రేషన్ చేసిన సంఘటన కామారెడ్డిలో సంచలనం సృష్టించింది. రిజిస్ట్ట్రేషన్లకు కేరాఫ్‌గా కామారెడ్డి రిజిస్ట్ట్రేషన్ కార్యాలయం మారింది. పట్టణంలోని ప్రధాన కాలనీలో గల 30 గుంటల భూమిని హంఫట్ చేసిన సంఘటన చోటు చేసుకుంది.పట్టణంలోని సైలానీబాబా కాలనీలో గల సర్వే నెంబర్ 142/14 బీ లోని 30 గుంటల భూమి యాజమాని మహమ్మద్ సిరాజొద్దీన్. 1998లో సిరాజొద్దీన్ భూమి కొనుగోలు సమయంలో సాక్షి గా ఉన్న ఖాజామొహినొద్దీన్ 2016లో తన కొడుకులు, అల్లుడు పేరు విూద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసు కున్నాడు. రైతులతో పాటు అన్ని సక్రమంగా ఉన్న భూములను సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడానికి నిబంధనలు విధించే అధికారులు వీటిని మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.. ఆ భూమిని మహమ్మద్ ఖాజా మొహినొద్దీన్ 3-5-2016 రోజున నకిలీ పత్రాలతో రిజిస్ట్ట్రేషన్ చేసుకున్నాడు. సిరాజొద్దీన్ పే రు విూద ఉ న్న భూమిని సబ్‌రిజిస్ట్ట్రార్ ధ్రువపత్రాలు చూడకుండానే రిజిస్ట్ట్రేషన్ చేశారనే ఆరోపణలు న్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిరజొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యం లోవిచారణ చేపట్టారు. 4-7-2016లో ఖాజా మొహినొద్దీన్‌ల తో పాటు మహమ్మద్ అబీబ్‌ఖాన్, ఖాజా హరిపొద్దీన్, ఖాజా అబిబొద్దీన్, ఖాజా హసమిలపై ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471, 120-బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ధ్రువపత్రాలు పాస్ పుస్తకాల ఆ ధారంగా ఈ ప్రక్రియ జరిగిందన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో పాటు ఫొటోలను మార్చి రిజిస్ట్ట్రేషన్ చేశారని టౌన్ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. నిందుతులపై కేసు నమోదు చేశామన్నారు.

No comments:
Post a Comment