ఇప్పటికైనా సాగునీరు అందేనా...
మహబూబ్ నగర్, జూలై 30,
మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ జరిగినా కూడా నీరందని దుస్థితి. కారణం చెరువు నీరు పొలాలకు అందించే కాలువల వ్యవస్థ కూలిపోవడం దీంతో పొలాలకు సాగునీరందడం కష్టంగా మారింది. కాలువల్లో పూడిక నిండడం, పిచ్చి మొక్కలు మొలవడం, కాలువలు కబ్జా గురికావడం ఇలా అనేక కారణాలతో చెరువు నుంచి పంట పొలాలకు సాగు నీరందడం లేదు. నుంచి పంటలకు సాగు నీరందించేందుకు గాను ఏర్పాటు చేసిన కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తా చెదారం నిండి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో పంట పొలాలకు సాగు నీరందండం కష్టంగా మారింది.చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి కొత్త చెరువు నుంచి అంగ్రాజ్‌పల్లి, రాయిపేట గ్రామాలలోని పంట పొలాలకు సాగు నీరందించేందుకు గాను ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం కాలువలను తవ్వించింది. ఈ కాలువల ద్వారా అంగ్రాజ్‌పల్లి, రాయిపేట గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందేది. గత కొన్నేళ్లుగా కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తా చెదారం నిండిపోవడంతో నీరు వెళ్లే మార్గం లేదు. రెండేళ్ల క్రితం కాలువకు గండిపడటంతో రైతులు ఇసుక బస్తాలను వేసి నీరు వథా కాకుండా చూశారు. ఇంత వరకు కాలువలకు మరమ్మతులు చేపట్టక కాలువల వ్యవస్థ మరీ అధ్వానంగా తయారైంది. కొందరు రైతులు కొన్ని చోట్ల కాలువలను కొద్ది కొద్దిగా చిన్నగా చేస్తూ వస్తున్నారు.కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని సైతం తొలగించడం లేదని చెబుతున్నారు. దాదాపు మండల వ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు

No comments:
Post a Comment