నేరగాళ్లుగా మారిన సమైక్యాంధ్ర నేతలు
విశాఖపట్టణం, జూలై 30,
ఉన్నత విద్యావంతులు, ఒకప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నాయకులు, సమైక్యాంధ్ర పార్టీ తరఫున ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసిన వ్యక్తులు నేరగాళ్లుగా మారిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్ల నుంచి విజిలెన్స్ ప్రత్యేక అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు దిగారు. ఆరుగురు సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా ఆంటోని నగర్ పరిధి మహారాణిపేటకు చెందిన జొల్ల తారకరామారావు, సింగంపల్లి జగదీష్, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మరడాంకు చెందిన లగుడు గోవిందు(డాక్టరేట్ విద్యావంతుడు), విజయనగరంలోని వివేకానంద కాలనీకి చెందిన వర్రి హరీష్, ఏయూ విద్యార్థులు చల్లా నరేష్‌కుమార్, అట్టాడ అవినాష్‌లు బృందంగా ఏర్పడ్డారు. విజిలెన్స్ బృందం పేరుతో ఉత్తరాంధ్ర మూడుజిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు. నిందితుడు రామారావు సమైక్యాంధ్ర తరఫున విశాఖపట్నం ఎంపీగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా, మరో నిందితుడు గోవిందు ఇదే పార్టీ తరఫున విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం వీరు బ్లూ బుగ్గకారుతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. గత 14 రోజులుగా వసూళ్లను ముమ్మరం చేశారు. పాఠశాలలు సందర్శించడం, మరుగ దొడ్లు, మౌలిక వసతుల పరిశీలించడం, పాఠశాలలు బ్లాక్‌లిస్టులో పెట్టి గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించి బేరం కుదుర్చు కోవడం, డబ్బులు వసూలయ్యాక వెళ్లిపోవడం వీరి విధి. అయితే, కార్పొరేట్ పాఠశాలల జోలికి వెళ్లడంలేదు. చిన్న పాఠశాలు, గ్రావిూణ ప్రాంత పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్నారు. మూడు జిల్లాల్లో 54 పాఠశాలల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. ప్రస్తుతం పోలీసులు రూ. 50,300, ఇన్నోవా కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై జేఆర్ పురం పీఎస్‌ల
రెండు, నరసన్నపేటలో మూడు, కోటబొమ్మాలిలో మూడు, టెక్కలిలో ఒక కేసు నమోదయ్యింది. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు.

No comments:
Post a Comment