బీజేపీతో తెగతెంపులకు బాబు నో..
న్యూఢిల్లీ, జూలై 30,
పార్లమెంట్ లో ఏపీకి మళ్లీ అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా నిరాకరించడాన్ని తప్పుపట్టారు. ''అవమానాలను.. అన్యాయాలను సహించేది లేదన్నారు. ప్రత్యేక ¬దాపై అరుణ్ జైట్లీపై సమాధానం అసంతృప్తి కలిగించింది. బాధను మిగిల్చింది. విభజన చేసిన తర్వాత ఆర్థిక సంఘం చివరి వరకు ఏపీకి లోటు బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏవిూ లేదు. పార్లమెంట్ చర్చలు బాధేస్తుంది. ప్రత్యేక చర్చతో ఒరిగింది ఏమిటి..? మొదటి రెండు రోజులు హంగామా చేసిన కాంగ్రెస్.. పరిణతి చెందిన పార్టీగా ప్రవర్తించలేదు. విభజన చట్టంలో పెట్టిన వాటిపై ఎందుకు పెదవి విప్పలేదు. నిమిషంలోనే అంతా తేల్చేసింది. బీజేపీ కూడా అన్యాయం చేసింది. మూడు రోజులు కూడా ఓపిక పట్టింది రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురుచూశాను. కేంద్రంపై నేను ఆధారపడటం లేదు. మన కష్టమే మనకు మిగులుతుందని చెబుతున్నాను.మిత్రపక్షమైనంత మాత్రాన సాయం చేయలేమన్నారు జైట్లీ. ఆ రోజు విూకు తెలియదా..? డబ్బులు లేనప్పుడు విభజన ఎందుకు చేశారు.? మా మానాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా.. రెండేళ్ల పసిబిడ్డపై కనికరం చూపరా..? యాభై రెండు శాతం ప్రజలనున్న ఏపీకి 47 శాతం ఆదాయం.. 42 శాతం ఉన్న ప్రజల తెలంగాణ ఆదాయం 57 శాతం. అడ్డగోలుగా విభజించారు. సుప్రీం కోర్టు కూడా తప్పుపట్టింది. సమతుల్యం లేకుండా విభజన జరిగిందని చెప్పింది. ఇంత వరకు ఏం చేయలేకపోయింది కేంద్రం. బాధతో అడుగుతున్నాం. త్వరగా పరిష్కరించండి. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగే శక్తి మాకు ఇవ్వండి. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరు.. మరింత ఓపికగా పనిచేస్తాను'' చెప్పుకొచ్చారు చంద్రబాబు.ఏపీకి న్యాయం చేసే విషయంలో అవసరమైతే ఒక కమిటీ వేయాలంటూ.. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి చేసిన ప్రతిపాదనను చంద్రబాబు సమర్థించారు. దీనిపై కేంద్రం దృష్టిసారించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కోరారు.మరోవైపు బీజేపీతో తెగతెంపులపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు దాటవేత ధోరణితో మాట్లాడారు చంద్రబాబు. స్పష్టత ఉండాలి.. కమిట్ మెంట్ లేకుండా పని చేయలేనని చెప్పారు. మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఇంకా టైమ్ ఉంది. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారు. ఎలా వెళ్లాలో అలా వెళ్లి కేంద్రం నుంచి రావల్సినవి రాబట్టుకుంటానని చెప్పారు.

No comments:
Post a Comment