నాలుగేళ్లకోసారి వచ్చే క్రికెట్ పండుగ.. ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. యావత్ క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించే విశ్వపోరుకు ఇంకా 32 రోజులే మిగిలాయి. ఫిబ్రవరి 14న మొదలయ్యే ఈ మెగా సంబరానికి ఆసే్ట్రలియాతో పాటు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 44 రోజుల పాటు జరిగే ఈ ‘అంతిమ’ యుద్ధంలో 14 దేశాలు పాల్గొనబోతున్నాయి. కొత్తపాత ఆటగాళ్ల కలబోతతో ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కోట్లాది మంది అభిమానుల ఆశల ‘పల్లకి’ని మోసే ఆటగాళ్లెవరో ఖరారైంది. ఇక కదనరంగంలో ‘బ్యాట్లు.. బంతులు’ దూసేందుకు ‘సైనికులు’ సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేయడంలో వారంతా నిమగ్నమైపోయారు. ‘శత్రువు’లపై ప్రయోగించేందుకు అసా్త్రలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే..! మరోవైపు చూస్తే మాత్రం జట్ల ఎంపికలో ఆయా దేశాల బోర్డుల నిర్ణయాలు ఆశ్చర్యాలకు... అనుమానాలకు.. విమర్శలకు తావిచ్చాయి. ఎన్నో సందర్భాల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు కట్టబెట్టిన వారి ఆశలు అడియాశలయ్యాయి..! కారణమేదైనా ఓ పది మంది టాప్ క్రికెటర్లు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఫామ్ కోల్పోయి ఒకరు.. వయసు మీద పడి మరొకరు.. బోర్డును ధిక్కరించిన ఇంకొకరు... ఇలా చాంపియన్ ఆటగాళ్ల కలలు కల్లలుగా మారిపోయాయి. ప్రత్యర్థులకు ‘మిస్టరీ’గా మారి.. ఇప్పుడు ‘హిస్టరీ’లో కలిసిపోయేలా కనిపిస్తున్న ఆ ఆటగాళ్లెవరూ చూద్దాం రండి.
వేటుగాళ్లు...
యువరాజ్ సింగ్: భారత జట్టును ప్రకటించే 48 గంట ముందు దేశంలో ‘యువరాజ్ ప్రచారం’ ఊపందుకుంది. జడేజా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యువీని జట్టులోకి తీసుకోవాలని అతని అభిమానులు.. మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేశారు. పేలవ ప్రదర్శనతో ఏడాదిగా జట్టుకు దూరమై.. ప్రాబబుల్స్‌లోనూ చోటు దక్కించుకోని ఈ డాషింగ్ ఆల్‌రౌండర్.... జట్టు ప్రకటనకు ముందే యాదృచ్ఛికంగా రంజీల్లో ‘హ్యాట్రిక్’ శతకాలు సాధించాడు. కానీ, గత ప్రపంచకప్‌లో అదరగొట్టిన యువీ పునరాగమనంపై అభిమానుల్లో ఏ మూలనో మిణుకుమిణుకు మన్న ఆశలకు సందీప్ పాటిల్ అండ్ కో ముగింపు పలికింది.
డ్వెన్ బ్రావో: ఇటీవల కాలంలో వెస్టిండీస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ బాధ్యతలు అప్పజెప్పేందుకు ముందు వరుసలో ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు పక్కన బెట్టింది. బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఏర్పడ్డ వేతన ‘వెతల’ కారణంగా భారత పర్యటనను విండీస్ అర్ధంతరంగా ముగించడంలో బ్రావోది ప్రధాన పాత్ర. ఈ కారణంగానే ప్రపంచకప్‌లో పాల్గొనే తుది జట్టులో ఈ కరీబియన్ సారథికి చోటివ్వలేదు.
కీరన్ పొలార్డ్: ఈ స్టార్ ఆల్‌రౌండర్ గత ఆరు నెలలుగా బ్యాట్‌తో గానీ, బంతితో గానీ నిలకడగా రాణించడం లేదు. అయతే ఇప్పటికీ క్షణాల్లో మ్యాచ్‌ను ఏకపక్షం చేసే సామర్థ్యం అతనిలో ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, దురదృష్టవశాత్తూ సెలెక్టర్లు పొలార్డ్‌ను పక్కనబెట్టారు. భారత పర్యటన ‘రద్దు’ విషయంలో బ్రావోకు సహకరించిన అతనిపై వేటు వేశారు.
అలిస్టర్ కుక్: ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌ను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈసీబీ ప్రపంచకప్ జట్టుకు అవకాశం ఇవ్వకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్ 2-5తో సిరీస్ కోల్పోవడంలో ఆటగాడిగా, సారథిగా విఫలమైన కుక్‌పై వేటు వేసింది. శ్రీలంకతో సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగానే ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను తప్పించడంతో పాటు మోర్గాన్‌కు సారథ్యం అప్పజెపుతున్నట్టు బోర్డు ప్రకటించింది.
ఉమర్ గుల్: మోకాలి గాయం తిరగబెట్టడంతో మరో ప్రపంచకప్‌లో ఆడాలన్న ఈ స్టార్ పేసర్ ఆశలు ఆవిరయ్యాయి. గతేడాది మేలో శస్త్ర చికిత్స చేయించుకున్న గుల్ ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో అతనిపై పాక్ బోర్డు వేటు వేసింది.
కమ్రాన్ అక్మల్: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వికెట్ కీపర్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టయింది. ఎటువంటి లాజిక్ లేకున్నా సర్ఫరాజ్ అహ్మద్‌కు చాన్స్ ఇచ్చిన పాక్ బోర్డు నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. అయితే కమ్రాన్ సోదరుడు ఉమర్ అక్మల్‌కు చాన్స్ ఇచ్చిన బోర్డు జట్టులో యువ రక్తం నింపేందుకు ప్రయత్నించింది.
ర్యాన్ హారిస్: ఈ మెగా టోర్నీ తర్వాత జరిగే యాషెస్ సిరీస్‌కు సిద్ధంగా ఉంచడం కోసం ఈ పేసర్‌ను తప్పించి క్రికెట్ ఆసే్ట్రలియా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచకప్‌లో ఆడడం కోసం పరితపించిన హారిస్‌ను బలిచేసినట్టయింది. పరిమిత ఓవర్ల ఆటలో తమ ప్రణాళికలో భాగంగా 35 ఏళ్ల హారిస్ ఎక్కువ కాలం వన్డేల్లో కొనసాగలేడని చెప్పి తన నిర్ణయాన్ని సీఏ సమర్థించుకుంది.
అజంతా మెండిస్: మిస్టరీ స్పిన్నర్‌గా పేరు దక్కించుకొని టీమిండియాను ముప్పు తిప్పలు పెట్టిన ఈ శ్రీలంక ఆటగాడు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. దీంతో ఆఖరి నిమిషంలో ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన ఆ స్టార్ స్పిన్నర్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
జిమ్మీ నీషమ్ : మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్ నీషమ్ స్థానంలో ఆల్‌రౌండర్ గ్రాంట్ ఇలియట్‌ను ఎంపికచేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలియట్ 2013 నవంబర్ నుంచి ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో తనను కాదని అతనికి చాన్స్ ఇవ్వడంపై నీషమ్ అవమానంగా భావిస్తున్నట్టు కివీస్‌లో పెద్ద చర్చ నడుస్తోంది.
రాబిన్ పీటర్సన్: మూడు ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఆడిన ఈ వెటరన్ క్రికెటర్ మరో ‘చాన్స్’ పొందలేకపోయాడు. తుదిజాబితాలో తన పేరు లేకపోవడంతో ఇక వన్డేలకు స్వస్తి చెప్పే యోచనలో పీటర్సన్ ఉన్నట్టు సమాచారం.

No comments:
Post a Comment