Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label క్రీడ. Show all posts
Showing posts with label క్రీడ. Show all posts

Monday, 4 January 2016

ఫుట్ బాల్ : శాప్ టైటిల్ నెగ్గిన భారత్

తిరువనంతపురం, జనవరి 3: దక్షిణ ఆసియా (శాఫ్) కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత్ విజయభేరి మో గించింది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ అఫ్గాని స్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో 2-1 తేడాతో విజయం సా ధించి, ఏడోసారి శాఫ్ కప్ విజేతగా నిలిచింది. కెప్టెన్ సునీల్ చెత్రీ కీలక గోల్ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆట మొదలైన మరుక్షణం నుంచి ఇరు జట్లు గోల్స్ కోసం ప్రయత్నించాయ. అయతే ఏ దశలోనూ రక్షణాత్మక వి ధానాన్ని మరచి పోలేదు. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్‌కూడా నమో దు కాలేదు. ద్వితీయార్ధంలోనూ కొంతసేపు ఇదే పరిస్థి తి కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు తీ వ్రమైన ఒత్తిడికి లోనుకావడంతో పలు అవకాశాలను చేజార్చు కున్నారు. 71వ నిమిషంలో భారత రక్షణ వల యాన్ని ఛేదించిన జుబైర్ అమీనీ అఫ్గాన్‌కు గోల్‌ను సంపాదిం చిపెట్టాడు. అయతే, తర్వాతి నిమిషంలోనే యువ ఆట గాడు జేజె లాల్పెక్లువా భారత్‌కు ఈక్వెలైజ ర్‌ను అం దించాడు. అఫ్గాన్ గోల్‌కీపర్ అజిజీని ఏమా ర్చిన అత ను ఎంతో లాఘవంగా బంతిని గోల్ పోస్టు లోకి కొ ట్టాడు. స్కోర్లు సమం కావడంతో రెండు జట్ల మధ్య పోరు తీవ్రమైంది. ఆధిపత్యం కోసం సంకుల సమరం కొనసాగింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరొక గోల్‌తో సమవుజ్జీగా ఉండగా, ఎక్‌స్ట్రాటైమ్ అనివార్యమైంది. ఈ సమయం కూడా ముగిసిపోతు న్న సమయంలో భారత్‌కు అదృష్టవశాత్తు ఫ్రీ కిక్ లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చెత్రీ గోల్ సాధించి, భారత్‌కు ఏడోసారి శాఫ్ కప్ టైటి ల్‌ను అందించాడు. 11వ సారి శాఫ్ కప్‌లో పాల్గొన్న భారత్ ఏడో పర్యాయం విజేతగా నిలవడం ద్వారా తన సత్తాను నిరూపించుకుంది.

Sunday, 3 January 2016

ఓడిన 'రణ'తుంగ

-శ్రీలంక క్రికెట్ ఎన్నికల్లో ఓటమి

కొలంబో: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు ఆ దేశ క్రికెట్ బోర్డు సంఘం (ఎస్‌ఎల్‌సీ) తీవ్ర పరాభవం ఎదురైంది. లంక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షునిగా పోటీచేసిన రణతుంగ 22 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఇక అధ్యక్షునిగా పోటీపడ్డ రణతుంగ సోదరుడు నిషాంత రణతుంగకు కూడా ఓటమి తప్పలేదు. తిలంగా సుమతిపాల 88ఓట్లతో నిషాంతను ఓడించి మూడోసారి లంక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.. శ్రీలంక క్రికెట్ బోర్డులో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో బోర్డు కార్యవర్గాన్ని శ్రీలంక క్రీడాశాఖ రద్దు చేయడంతో అప్పట్లో బోర్డు కార్యదర్శిగా ఉన్న నిషాంత పదవి కోల్పోయాడు. ప్రజాస్వామ్య పద్దతిలో బోర్డు ఎన్నికలు నిర్వహించాలని ఐసీసీ ఒత్తిడి నేపథ్యంలో తాత్కాలిక కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న బోర్డుకు ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహించారు. బోర్డు కార్యదర్శిగా సుమతిపాల వర్గానికే చెందిన మోహన్ డిసిల్వా ఎన్నికయ్యాడు.

లీ చోంగ్‌కు శ్రీకాంత్ షాక్


ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. ఈ లీగ్‌లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న శ్రీకాంత్ సింగిల్స్‌లో హైదరాబాద్ హంటర్స్ టాప్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీకి షాకిచ్చి సంచలనం సృష్టించాడు. అయితే, శ్రీకాంత్ ప్రదర్శన అబ్బురపరిచినా, కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో బెంగళూరు షట్లర్లు ఓడడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. ఫలితంగా హైదరాబాద్ హంటర్స్ 3-2తో బెంగళూరును ఓడించి శుభారంభం చేసింది. మరోపోరులో పీవీ సింధు సారథ్యంలోని చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. 



  • -అయినా బెంగళూరుకు తప్పని ఓటమి
  • -ట్రంప్ మ్యాచ్‌ల విక్టరీతో హైదరాబాద్ బోణీ
  • -ముంబైని బోల్తా కొట్టించిన చెన్నై
  • -ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 


ముంబై: పీబీఎల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ట్రంప్ మ్యాచ్ నిబంధన జట్లకు ఎంత కీలకమన్నది ఆదివారం హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్‌గన్స్ జట్ల
మధ్య జరిగిన పోరే నిదర్శనం. ఈ పోరులో బెంగళూరు జట్టు మొత్తం ఐదుమ్యాచ్‌లకుగాను మూడు మ్యాచ్‌లను గెలుపొందినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే, తాము ఓడిన ఆ రెండుమ్యాచ్‌లూ కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లే కావడంతో బెంగళూరుకు పరాభవం తప్పలేదు. ట్రంప్ మ్యాచ్ నిబంధనను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న హైదరాబాద్ 3-2తో విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టింది. 


తొలుత మహిళల సింగిల్స్‌లో సూ ది 15-8, 15-11తో సుపనిద కటేతొవాంగ్‌పై నెగ్గి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్నిచ్చింది. తర్వాత జరిగిన పురుషుల
డబుల్స్ పోరును హైదరాబాద్ ట్రంప్‌మ్యాచ్‌గా ఎంపికచేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జోడీ మోగెన్‌సన్-మార్కిస్ కిదో 13-15, 15-9, 15-14తో బెంగళూరు జంట హూన్ తిన్-కిమ్ వా లిమ్‌ను ఓడించింది. దీంతో బెంగళూరు ఓ పాయింట్‌ను కోల్పోగా, ట్రంప్ మ్యాచ్ విజయంతో హైదరాబాద్ బోనస్‌పాయింట్‌తో కలిపి తన ఆధిక్యాన్ని ఏకం గా 2-0కు పెంచుకుంది. ఆ తర్వాత జరిగిన పురుషు ల సింగిల్స్ తొలిమ్యాచ్‌ను బెంగళూరు జట్టు ట్రంప్ మ్యాచ్‌గా వినియోగించుకుంది. కానీ, ఇందులో హైదరాబాద్ స్టార్ కశ్యప్ 15-14, 15-13తో సమీ ర్ వర్మను ఓడించడంతో బెంగళూరు -1పాయింట్‌కు పడిపోయింది. 

దీంతో హైదరాబాద్ ఆధిక్యం మూడుపాయింట్లకు పెరిగిం ది. ఆ తర్వాత జరిగిన నామమాత్రపు మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల రెండో సింగిల్స్ మ్యాచుల్లో బెంగళూరు గెలిచినా ప్రయోజనం లేకపోయింది. మిక్స్‌డ్‌లో బెంగళూరు జోడీ జోచిమ్ ఫిషర్-అశ్వినీ పొన్నప్ప 15-13, 15-13తో జ్వాల-మార్కిస్ జంటను ఓడించడంతో హైదరాబాద్ ఆధిక్యం 3-1కు తగ్గింది. ఇక చివరిదైన పురుషుల రెండోసింగిల్స్‌లో బెంగళూరు స్టార్ శ్రీకాంత్ 15-12, 6-15, 15-7తో లీ చోంగ్ వీని చిత్తుచేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే, అప్పటికే హైదరాబాద్ గెలుపు ఖరారవడంతో ఆ జట్టు 3-2 ఆధిక్యంతో ముందంజ వేసింది. లీ చోంగ్ వీపై శ్రీకాంత్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 


సింధు బృందం జోరు
యువ సంచలనం పీవీ సింధు సారథ్యం వహిస్తున్న చెన్నై స్మాష ర్స్ లీగ్‌లో అద్భుతంగా బోణీ కొట్టింది. చెన్నై 4-3తో ముంబై రాకెట్స్‌ను ఓడించింది. అప్పటికే రెండు విజయాలతో 3-1 ఆధిక్యంలోనున్న ముంబైకి మహిళల సింగిల్స్‌లో సిం ధు 15-8, 11-15, 15-8తో హాన్ లిని ఓడించి షాకిచ్చింది. దీంతో ముంబై ఆధిక్యం 3-2కు తగ్గిపోయింది. ఇక.. ట్రంప్ మ్యాచ్ గా ఎంపికచేసుకున్న చివరిది, కీలకమైన పురుషుల రెండో సింగిల్స్‌లో సిమోన్ సాం టసో 15-9, 15-12తో గురుసాయి దత్ ను ఓడించి చెన్నైకి బోనస్‌పాయింట్‌తో విజయాన్నందించాడు. ఫలితంగా చెన్నై 4-3తో పైచేయి సాధించింది.

Saturday, 2 January 2016

విండిస్ కథ మారేనా ... - వ్యధ మిగిలేనా

విండీస్ క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్

సిడ్నీ, జనవరి 2: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదంలో పడింది. మొదటి టెస్టును ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆతర్వాత రెండో టెస్టును 177 పరుగుల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో పటిష్టమైన ఇంగ్లాండ్‌కు ఈ జట్టు ఎంత వరకూ ఎదురునిలిస్తుందనేది అనుమానంగానే ఉంది. మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకున్నా, వైట్‌వాష్ ప్రమాదం నుంచి బయటపడుతుంది. కానీ జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్నది. క్రిస్ గేల్ వంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని వారే ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నది. పూర్తి స్థాయి విండీస్ జట్టు బరిలోకి దిగితేనే ఆసీస్‌ను నిలువరించడం కష్టం. అలాంటిది దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుగా కనిపిస్తున్న హోల్డర్ బృందం అద్భుతాలను సాధిస్తుందని ఊహించడం కూడా కష్టమే. చివరి మ్యాచ్‌ని కూడా గెల్చుకోవడం ద్వారా క్లీన్‌స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉండగా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై విండీస్ జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహరచన చేస్తున్నది

Sunday, 22 March 2015

విశ్లేషణ : కోచ్‌ల మధ్య పోరాటమా ?


సిడ్నీ, మార్చి 22: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ దశ ముగిసింది. సెమీ ఫైనల్‌లో నాలుగు జట్ల మధ్య పోరాటం సహజం. అదే సమయంలో ఆయా జట్ల కోచ్‌ల మధ్య ఆధిపత్య పోరు కూడా జరగనుంది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కోచ్ డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు వరల్డ్ కప్‌తో ముగుస్తుంది. అతని ఒప్పందాన్ని కొనసాగించే అవకాశాలు ఏమాత్రం లేవు. జట్టుకు డైరెక్టర్ పదవిని సృష్టించి మరీ మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీకి బిసిసిఐ విస్తృత అధికారాలు కట్టబెట్టడమే ఫ్లెచర్ భవిష్యత్తు ఏమిటో స్పష్టం చేస్తున్నది. ఇలావుంటే, ప్రపంచ కప్ పోటీలకు ముందు మ్యాచ్‌లు ఆడిన, ఇప్పుడు ఆడుతున్న టీమిండియా ఒకటేనా అన్న అనుమానం తలెత్తుతోంది. వరల్డ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఆ వెంటనే, ఇంగ్లాండ్ కూడా పాల్గొన్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లోనూ పరాజయాలను మూటగట్టుకుంది. కానీ, ప్రపంచ కప్ టోర్నీ ఆరంభమైన మరుక్షణం నుంచి జట్టు ఆట తీరు ఒక్కసారిగా మారింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. ఆతర్వాత మరో ఐదు వరుస విజయాలు సాధించి క్వార్టర్స్ చేరింది. అదే ఊపును కొనసాగిస్తూ, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకొచ్చింది. టీమిండియా జైత్రయాత్రలో రవి శాస్ర్తీ పాత్ర కీలకమన్నది వాస్తవం. అయితే, ఈఘనతలో కోచ్‌గా ఫ్లెచర్‌కు కూడా భాగస్వామ్యం ఉండకపోదు. కాంట్రాక్టు నిలబడాలన్నా లేదా ఇతర క్రికెట్ బోర్డుల నుంచి ఆహ్వానం అందాలన్నా ఫ్లెచర్‌కు ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ నిలబెట్టుకుంటే ఫ్లెచర్‌కు డిమాండ్ పెరుగుతుంది. భారత్‌కు కాకపోయినా, మరో మేటి జట్టుకు కోచ్‌గా వెళ్లే అవకాశం లభిస్తుంది.
భారత్ మాదిరిగానే గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లతోపాటు క్వార్టర్ ఫైనల్స్‌లోనూ గెలిచిన న్యూజిలాండ్‌కు కోచ్ మైక్ హెస్సన్ అసాధారణ సేవలు అందిస్తున్నాడు. 3అండర్ డాగ్2 ముద్ర వేయించుకున్న కివీస్ జట్టు ఇన్ని విజయాలను సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. 3బ్లాక్ క్యాప్2 ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించడం వెనుక హెస్సన్ కృషి ఎంతో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే సెమీ ఫైనల్‌లో కివీస్ నెగ్గితే, కోచ్‌గా హెస్సన్ నిలదొక్కుకుంటాడు.
ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్నాడు. జట్టు ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో తెలియని పరిస్థితి అతనిని ఆందోళనకు గురి చేస్తున్నది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు 3హాట్ ఫేవరిట్2 జాబితాలో ముందున్న ఆసీస్ ఆతర్వాత పడుతూలేస్తూ ముందుకు సాగుతున్నది. సమర్థులైన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నా, ప్రతి మ్యాచ్‌లోనూ ఇద్దరుముగ్గురు మాత్రమే రాణిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టుకు బంగ్లాదేశ్‌తో ఆడే అవకాశం వర్షం కారణంగా లభించలేదు. మిగతా నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను గెల్చుకుంది. కానీ, ఆ విజయాలు ఆశించినంత గొప్పవేం కాదు. అయితే, మాజీ ఆటగాడు లీమన్ మార్గదర్శకంలో, క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి సెమీస్‌లోకి అడుగుపెట్టిన విధానం ఆసీస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందన్న విషయాన్ని స్పష్ట చేస్తున్నది. కాగితంపై చూస్తే భారత్, ఆస్ట్రేలియా జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తాయి. రెండు జట్లకూ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంతకు ముందు ఆసీస్ బౌలింగ్ బలంగా ఉంటే, భారత్ బౌలింగ్ విభాగంలో వెనుకంజలో నిలిచింది. కానీ, వరల్డ్ కప్‌లో భారత బౌలర్లు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడమే టీమిండియా బౌలింగ్ మెరుగుపడిందనడానికి నిదర్శనం. కాబట్టి, బౌలింగ్‌లోనూ ఆసీస్‌తో భారత్ పోటీపడే స్థాయికి చేరింది. శక్తివంతమైన భారత్‌ను ఓడించగలిగితే, ఆసీస్ మళ్లీ గాడిలో పడడమేగాక, కోచ్‌గా లీమన్‌కు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే భారత్‌తో సెమీస్‌ను అతను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాడు.
కీలక మ్యాచ్‌ల్లో తీవ్రమైన ఒత్తిడికిగురై పరాజయాలను ఎదుర్కొంటుందన్న ముద్ర నుంచి దక్షిణాఫ్రికాను బయటకు తెచ్చేందుకు కోచ్ రసెల్ డొమింగో బాగానే కష్టపడుతున్నాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లతోపాటు క్వార్టర్ ఫైనల్స్‌ను కూడా గెల్చుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ను ఢీకొనడం దక్షిణాఫ్రికాకు అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాఫ్రికాను విజయపథంలో నడిపించి, కోచ్‌గా తనను తాను నిరూపించుకోవాలన్న తపన డొమింగోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈరెండు జట్లూ ఎన్నడూ వరల్డ్ కప్ ఫైనల్ చేరలేదు. దీనితో ఏ జట్టు గెలిచినా కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది.

Wednesday, 11 March 2015

మలి వయస్సులో రెచ్చి పోతున్న సంగక్కరా - రికార్టు సెంచరీలతో మోత

హోబర్ట్, మార్చి 11: శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర వరుసగా నాలుగో శతకాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. తిలకరత్నే దిల్షాన్ కూడా సెంచరీతో రాణించడంతో, ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం స్కాట్‌లాండ్‌ను ఎదుర్కొన్న శ్రీలంక 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 364 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన స్కాట్‌లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. కాగా, శ్రీలంకకు ఇది నాలుగో విజయం. పూల్ ‘ఎ’లో ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో ఈ జట్టు న్యూజిలాండ్ (10 పాయింట్లు) తర్వాత, రెండో స్థానంలో ఉంది. అయితే, న్యూజిలాండ్-బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా-స్కాట్‌లాండ్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాతే స్టాండింగ్స్‌పై స్పష్టత వస్తుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరో ఓవర్ మూడో బంతికి లాహిరు తిరిమానే (4) అవుట్‌కావడంతో మాథ్యూస్ నిర్ణయంపై తలెత్తిన అనుమానాలకు తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర తెరదించారు. రెండో వికెట్‌కు వీరు 195 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 99 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 104 పరుగులు చేసిన దిల్షాన్‌ను కల్లం మెక్‌లియోడ్ క్యాచ్ అందుకోగా, జొష్ డావీ అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. మహేల జయవర్ధనే కేవలం 2 పరుగులు చేసి డావీ బౌలింగ్‌లోనే మెక్‌లియోడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాతి బంతికే సంగక్కర వికెట్ కూడా కూలింది. అతను 139 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 95 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 124 పరుగులు సాధించి, మాథ్యూ క్రాస్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఈ ప్రపంచ కప్‌లో సంగాకు ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. ఏంజెలో మాథ్యూస్ (51) కొంత సేపు నిలదొక్కుకొని ఆడగా, కుశాల్ పెరెరా (24), తిసర పెరెరా (7), సీక్కుగే ప్రసన్న (3), లసిత్ మలింగ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. చివరిలో కులశేఖర (18), దుష్మంత చమీరా (12) నాటౌట్‌గా నిలవగా, లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మోంసెన్, కోల్మన్ పోరాటం వృథా
లంకను ఓడించేందుకు 364 పరుగుల భారీ లక్ష్యన్ని అందుకోవడానికి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్‌లాండ్ ఆ ప్రయత్నంలో విఫలమైంది. కెప్టెన్ ప్రెస్టన్ మోంసెన్, ఫ్రెడ్డీ కోల్మన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేశారు. మిగతా ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో స్కోర్లు చేయలేకపోవడంతో స్కాట్‌లాండ్ ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే, 215 పరుగులకు ఆలౌటైంది. మోంసెన్ 75 బంతుల్లో 60, కోల్మన్ 74 బంతుల్లో 70 చొప్పున పరుగులు చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ, వీరి పోరాటం వృథా అయింది. లంక నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సెంచరీ హీరో సంగాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాప్ స్కోరర్
ఈ ఏడాది అన్ని ఫార్మెట్స్‌లో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కుమార సంగక్కర రికార్డు సృష్టించాడు. ఇప్పటికే అతను 1,025 పరుగులు తన ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించగా, కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్) 900 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
వరల్డ్ కప్ టోర్నీలో సంగక్కర వరుసగా నాలుగవ, మొత్తం మీద 5వ శతకాన్ని సాధించాడు. సచిన్ తెండూల్కర్ 6 సెంచరీతో మొదటి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌తో కలిసి సంగా రెండో స్థానంలో నిలిచాడు.
వనే్డ ఇంటర్నేషనల్స్‌లో జహీర్ అబ్బాస్ (పాకిస్తాన్), సరుూద్ అన్వర్ (పాకిస్తాన్), హెర్చెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్) వరుసగా మూడు సెంచరీలు సాధించారు. ఆ రికార్డును సంగా అధిగమించాడు. ఈ వరల్డ్ కప్‌లో అతను బంగ్లాదేశ్‌పై 105, ఇంగ్లాండ్‌పై 117 (నాటౌట్), ఆస్ట్రేలియాపై 104, తాజాగా స్కాట్‌లాండ్‌పై 124 చొప్పున పరుగులు సాధించాడు.
ఒక వరల్డ్ కప్ టోర్నీలో మార్క్ వా, మాథ్యూ హేడెన్, సౌరవ్ గంగూలీ తలా మూడు సెంచరీలు చేయగా, సంగా నాలుగు సెంచరీలతో వారిని అధిగమించారు.
కీపింగ్‌లోనూ రికార్డే
వికెట్‌కీపింగ్‌లోనూ సంగా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కప్ టోర్నీలో అతను ఇప్పటి వరకూ 54 మందిని అవుట్ చేశాడు. ఆడం గిల్‌క్రిస్ట్ (52 డిస్మిసల్స్), బ్రెండన్ మెక్‌కలమ్ (32 డిస్మిసల్స్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు.
ఆస్ట్రేలియాలో ఆడిన వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్ జాబితాలో సంగక్కర మూడో స్థానాన్ని సంపాదించాడు. డెస్మండ్ హేన్స్ 3,067, వివియన్ రిచర్డ్స్ 2,769 పరుగులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌లో సంగా సాధించిన పరుగులు 2,038.
20వ సెంచరీ భాగస్వామ్యం
తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర రెండో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. వీరికి ఇది 20వ సెంచరీ భాగస్వామ్యం. వనే్డల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలను సాధించిన రెండో జోడీగా వీరు రికార్డు పుటల్లోకి ఎక్కారు. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ 26 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌తో ‘జోడీ నంబర్ వన్’గా కొనసాగుతున్నారు. ఆడం గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్ 16 సెంచరీ భాగస్వామ్యాలను అందించి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
స్కోరుబోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: తిరిమానే సి మోంసెన్ బి ఇవాన్స్ 4, దిల్షాన్ సి మెక్‌లియోడ్ బి డావీ 104, సంగక్కర సి క్రాస్ బి డావీ 124, జయవర్ధనే సి మెక్‌లియోడ్ బి డావీ 2, మాథ్యూస్ సి కోల్మన్ బి మెక్‌చాన్ 51, కుశాల్ పెరెరా సి మెక్‌లియోడ్ బి రోబీ టేలర్ 24, తిసర పెరెరా సి కోల్మన్ బి బెరింగ్టన్ 7, ప్రసన్న సి కోల్మన్ బి ఇవాన్స్ 3, కులశేఖర నాటౌట్ 18, మలింగ సి లీస్క్ బి బెరింగ్టన్ 1, చమీరా నాటౌట్ 12, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 363.
వికెట్ల పతనం: 1-21, 2-216, 3-244, 4-244, 5-289, 6-326, 7-328, 8-331, 9-336.
బౌలింగ్: రోబీ టేలర్ 10-0-46-1, అస్‌డైర్ ఇవాన్స్ 10-0-72-2, జొష్ డావీ 8-0-63-3, బెరింగ్టన్ 6.1-0-31-2, మైఖేల్ లీస్క్ 7-0-63-0, కేల్ కోజర్ 4.5-0-39-0, మాట్ మచాన్ 4-0-46-1.
స్కాట్‌లాండ్ ఇన్నింగ్స్: కేల్ కోజర్ సి అండ్ బి మలింగ 0, కల్లం మెక్‌లియోడ్ బి కులశేఖర 11, మాట్ మచాన్ ఎల్‌బి దిల్షాన్ 19, ప్రెస్టన్ మోంసెన్ సి తిరిమానే బి తిసర పెరెరా 60, ఫ్రెడ్డీ కోల్మన్ సి తిసర పెరెనా బి కులశేఖర 70, రిచీ బెరింగ్టన్ సి కులశేఖర బి చమీరా 29, మైఖేల్ లీస్క్ సి సంగక్కర బి కులశేఖర 2, మాథ్యూ క్రాస్ సి సంగక్కర బి చమీరా 7, రోబీ టేలర్ సి తిసర పెరెరా బి మలింగ 3, జొష్ డావీ సి తిరిమానే బి చమీరా 4, అస్‌డైర్ ఇవాన్స్ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్) 215.
వికెట్ల పతనం: 1-0, 2-26, 3-44, 4-162, 5-189, 6-192, 7-200, 8-209, 9-210, 10-215.
బౌలింగ్: మలింగ 9-0-29-2, కులశేఖర 7-0-20-3, తిసర పెరెరా 7-0-41-1, దిల్షాన్ 5-0-15-1, ప్రసన్న 8-0-57-0, చమీరా 7.1-0-51-3.
రికార్డు సెంచరీ..
సంగక్కర
తిలకరత్నే దిల్షాన్

Saturday, 31 January 2015

ప్రారంభమైన జాతీయ క్రీడోత్సవాలు - మార్చ్ ఫాస్ట్ పాల్గొన్న TS మంత్రి

-అథ్లెట్లతో కలిసి మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్న 
క్రీడల మంత్రి పద్మారావు ఎంపీ జితేందర్‌రెడ్డి
-టోర్నీని ప్రారంభించిన సచిన్


తిరువనంతపురం: 35వ జాతీయ క్రీడలు శనివారం ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టోర్నీకి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రులు సర్బనంద సోనోవాల్, వెంకయ్యనాయుడులు శనివారం పోటీలను ప్రారంభించారు. కాగా టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర జట్టు తొలిరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి, రాష్ట్ర క్రీడలమంత్రి టీ పద్మారావుతో పాటు రాష్ట్ర క్రీడాప్రాథికారం సంస్థ చైర్మన్ దినకర్‌బాబులు రాష్ట్ర జట్టుతో కలిసి మార్చ్‌పాస్ట్‌లో పాల్గొని అథ్లెట్లలో ఉత్సాహం నింపడం విశేషం.

games



ఈనెల 14వరకు జరగనున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి మొత్తం 150మందికిపైగా అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. దేశంలో నంబర్‌వన్ క్రీడారాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న రాష్ట్ర ప్రభుత్వం..జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన రాష్ట్ర అథ్లెట్లకు భారీస్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో గగన్ నారంగ్, అథ్లెటిక్స్‌లో అబ్దుల్ నజీబ్ ఖురేషీ, టెన్నిస్‌లో విష్ణువర్ధన్, సాకేత్‌లాంటి అథ్లెట్లు తెలంగాణ నుంచి ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు.

Friday, 30 January 2015

పెర్త్ లోనూ పారని ధోని మంత్రం - భారత్ ఓటమి


ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన భారత్‌ .. ఫైనల్‌ చాన్స్‌ మిస్‌
ఆసీ్‌సతో తుదిపోరుకు మోర్గాన్‌సేన
ముక్కోణపు టోర్నీ

లోపాలు సరిదిద్దుకుంది లేదు..! వ్యూహాలకు పదునుపెట్టిందీ లేదు..! అసలు విజయమనే మాటే లేదు..! టెస్ట్‌ల్లో ఓడినా అచ్చొచ్చిన వన్డేల్లో అదరగొడుతారులే అని ఆశపడ్డాం. ప్రపంచకప్‌నకు రిహార్సల్‌గా భావించిన ముక్కోణపు సిరీ్‌సలో బౌలింగ్‌ గాడినపడాలని కోరుకున్నాం...! రంగు చొక్కాలు వేసుకోగానే ప్రత్యర్థిని హడలెత్తించే యువ భారత్‌ ఈ సారి చేతులేత్తేసింది. మూడు మ్యాచ్‌ల్లోనూ చిత్తుగా ఓడి సిరీస్‌ నుంచి నిష్క్రమించింది. బలమనుకున్న బ్యాటింగే.. బలహీనతగా మారింది. మొత్తంగా ఆసే్ట్రలియా పర్యటనలో గెలుపు రుచే చూడని భారత్‌.. విశ్వపోరుకు ముందు కొత్త ఆందోళనలను తెరపైకి తెచ్చింది...!
పెర్త్‌: వరుణుడి రూపంలో వచ్చిన అవకాశాలను టీమిండియా అందిపుచ్చుకోలేపోయింది. ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబరచింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్లతో పరాజయం పాలైంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత్‌ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. 103/1తో పటిష్ట స్థితిలో కనిపించిన ధోనీసేన మరో 97 పరుగులే చేసి మిగతా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ రహానె (73) అర్ధశతకంతో మెరవగా, ధవన్‌ (38) సిరీ్‌సలో తొలిసారి రాణించాడు. రైనా (1), కోహ్లీ (8), రాయుడు (12), ధోనీ (17), బిన్నీ (7)తో పాటు జడేజా (5), అక్షర్‌ (1) విఫలమయ్యారు. చివర్లో షమి (18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 25) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫిన్‌ మూడు, వోక్స్‌, బ్రాడ్‌, అలీ తలో రెండు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓ దశలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఓటమి దిశగా పయనించింది. అయితే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేమ్స్‌ టేలర్‌ (82) అద్భుత పోరాటానికి తోడు బట్లర్‌ (67) అర్ధశతకంతో రాణించడంతో ఇంగ్లండ్‌ మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రూట్‌ (3), మోర్గాన్‌ (2), బొపార (4), బెల్‌ (10), అలీ (17) విఫలమయ్యారు. బిన్నీ మూడు, మోహిత్‌ రెండు వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్‌-ఆసీస్‌ మధ్య ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది.
స్కోరుబోర్డు
భారత్‌: రహానె (సి) బట్లర్‌ (బి) ఫిన్‌ 73, ధవన్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 38, కోహ్లీ (సి) రూట్‌ (బి) అలీ 8, రైనా (సి) వోక్స్‌ (బి) అలీ 1, రాయుడు (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 12, ధోనీ (ఎల్బీ) అండర్సన్‌ 17, బిన్నీ (సి) బెల్‌ (బి) ఫిన్‌ 7, జడేజా (సి) ఫిన్‌ (బి) బ్రాడ్‌ 5, అక్షర్‌ (సి) బెల్‌ (బి) ఫిన్‌ 1, మోహిత్‌ (నాటౌట్‌) 7, షమి (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 25; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 48.1 ఓవర్లలో 200; వికెట్ల పతనం: 1-83, 2-103, 3-107, 4-134, 5-136, 6-152, 7-164, 8-164, 9-165. బౌలింగ్‌: అండర్సన్‌ 9-1-24-1, వోక్స్‌ 9.1-1-47-2, బ్రాడ్‌ 10-1-56-2, ఫిన్‌ 10-0-36-3, అలీ 10-0-35-2.
ఇంగ్లండ్‌: బెల్‌ (ఎల్బీ) మోహిత్‌ 10, అలీ (సి) రాయుడు (బి) అక్షర్‌ 17, టేలర్‌ (సి) బిన్నీ (బి) మోహిత్‌ 82, రూట్‌ (సి అండ్‌ బి) బిన్నీ 3, మోర్గాన్‌ (సి) ధవన్‌ (బి) బిన్నీ 2, బొపార (సి) జడేజా (బి) బిన్నీ 4, బట్లర్‌ (సి) రాయుడు (బి) షమి 67, వోక్స్‌ (నాటౌట్‌) 4, బ్రాడ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 46.5 ఓవర్లలో 201/7; వికెట్ల పతనం: 1-14, 2-40, 3-44, 4-54, 5-66, 6-191, 7-193. బౌలింగ్‌: బిన్నీ 8-0-33-3, మోహిత్‌ 10-1-36-2, షమి 9-0-31-1, అక్షర్‌ 10-1-39-1, జడేజా 9.5-0-62-0.

Sunday, 18 January 2015

శివాలెత్తిన డివీలియర్స్ - చేతులెత్తేసిన విండిస్ - భారి వోటమి


16 బంతుల్లో 50
31 బంతుల్లో 100
44 బంతుల్లో 149
డివిల్లీర్స్‌ కెరీర్‌
పూర్తి పేరు : అబ్రహాం బెంజిమెన్‌ డివిల్లీర్స్‌
స్వస్థలం : ప్రిటోరియా
టెస్ట్‌లు : 98-పరుగులు:7606
వన్డేలు : 177-పరుగులు:7440
టీ20లు : 57-పరుగులు:1007
జొహాన్నెస్‌బర్గ్‌: ఎదుర్కొన్న తొలి బంతే బౌండ్రీ.. తర్వాత రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు.. క్రీజులో నిలిచిన 59 నిమిషాలూ అదే జోరు. బంతి పిచ్‌పై పడిందంటే బౌండ్రీ లైన్‌ బయటికే.. లేదంటే స్టాండ్స్‌లోకి.. ఇది వెస్టిండీస్‌తో రెండో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్‌ బ్యాటింగ్‌ హోరు. విండీస్‌ బౌలర్లను డివిల్లీర్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సర్లతో 149) ఊచకోత కోయడంతో వన్డే క్రికెట్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఈ సఫారీ సారథి వన్డేల్లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో డివిల్లీర్స్‌ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయగా... శతకం పూర్తి చేయడానికి మరో 15 బంతులే తీసుకున్నాడు. 8 ఫోర్లు, 10 సిక్సర్లతో డివిల్లీర్స్‌ ఈ ఫీట్‌ చేశాడు. ఈ క్రమంలో గతేడాది వెస్టిండీస్‌పైనే 36 బంతుల్లోనే సెంచరీ చేసిన కోరే అండర్సన్‌ రికార్డు బద్దలైంది. కాగా ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌ 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అలాగే డివిల్లీర్‌ దెబ్బకు 19 ఏళ్ల క్రితం సనత్‌ జయసూర్య (శ్రీలంక) నెలకొల్పిన అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డు కూడా తుడిచిపెట్టుకు పోయింది. 1996లో పాకిస్థాన్‌పై జయసూర్య 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లతో రోహిత్‌ శర్మ రికార్డునూ డివిల్లీర్స్‌ సమం చేశాడు. డివిల్లీర్స్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా వన్డేల్లో రెండో అత్యుత్తమ స్కోరు చేయగలిగింది. కాగా ఈ ఫార్మాట్లో సఫారీలు 400పైన స్కోరు చేయడం ఇది మూడోసారి. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో డివిల్లీర్స్‌తో పాటు ఆమ్లా (142 బంతుల్లో 14 ఫోర్లతో 153 నాటౌట్‌), రూజో (115 బంతుల్లో 11 ఫోర్లతో 128) శతకాలు సాధించారు. అలాగే డివిల్లీర్స్‌-ఆమ్లా జోడీ 33 ఇన్నింగ్స్‌ల్లో 79.8 అత్యధిక సగటుతో 2473 పరుగులు చేసి వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది. కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ డివిల్లీర్స్‌ 2005లో ఇంగ్లండ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. 2007 వరల్డ్‌ కప్‌లో వెస్టిండీస్‌పై కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 
ఫాస్టెస్ట్‌ సెంచరీలు
ఆటగాడు దేశం బంతులు
డివిల్లీర్స్‌ దక్షిణాఫ్రికా 31
అండర్సన్‌ న్యూజిలాండ్‌ 36
అఫ్రీది పాకిస్థాన్‌ 37
బౌచర్‌ దక్షిణాఫ్రికా 44
లారా వెస్టిండీస్‌ 45
వన్డేల్లో అత్యధిక స్కోర్లు
జట్టు పరుగులు 
శ్రీలంక 443/9
దక్షిణాఫ్రికా 439/2
దక్షిణాఫ్రికా 438/9
ఆసే్ట్రలియా 434/4
దక్షిణాఫ్రికా 418/5
సఫారీల ఆట అదుర్స్‌
 డివిల్లీర్స్‌, ఆమ్లా, రూజో శతకాలు
 రెండో వన్డేలోనూ విండీస్‌ ఓటమి
 సిరీస్‌లో 2-0తో దక్షిణాఫ్రికా ఆధిక్యం

జొహాన్నెస్‌బర్గ్‌: వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో సఫారీలు 148 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచారు. డివిల్లీర్స్‌ (149) ప్రపంచ రికార్డు శతకంతో పాటు ఆమ్లా (153 నాటౌట్‌), రూజో (128) సెంచరీలతో మెరవడంతో.. దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 439 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ పూర్తి ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులకు పరిమితమైంది. డ్వెన్‌ స్మిత్‌ (64) టాప్‌ స్కోరర్‌. మోర్కెల్‌, ఫిలాండర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. డివిల్లీర్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 
పింక్‌ సఫారీలు: క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు పింక్‌ కలర్‌ జెర్సీలతో బరిలోకి దిగారు. మ్యాచ్‌కు హాజరైన 20వేల పైచిలుకు ప్రేక్షకులు కూడా అదే రంగు టోపీలు, జెండాలతో అలరించారు. 

దక్షిణాఫ్రికా: ఆమ్లా (నాటౌట్‌) 153, రూజో (సి) బెన్‌ (బి) టేలర్‌ 128, డివిల్లీర్స్‌ (సి) కార్టర్‌ (బి) రస్సెల్‌ 149, మిల్లర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 50 ఓవర్లలో 439/2; వికెట్ల పతనం: 1-247, 2-439; బౌలింగ్‌: టేలర్‌ 10-0-95-1, హోల్డర్‌ 9-0-91-0, బెన్‌ 10-0-49-0, రస్సెల్‌ 10-0-78-1, సామి 4-0-26-0, శామ్యూల్స్‌ 3-0-28-0, స్మిత్‌ 4-0-68-0; 
వెస్టిండీస్‌: స్మిత్‌ (సి) డుమిని (బి) బెహార్డిన్‌ 64, గేల్‌ (సి) బెహార్డిన్‌ (బి) మోర్కెల్‌ 19, జాన్సన్‌ (ఎల్బీ) ఫిలాండర్‌ 1, శామ్యూల్స్‌ (సి) బెహార్డిన్‌ (బి) ఫిలాండర్‌ 40, రామ్‌దిన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) మోర్కెల్‌ 57, కార్టర్‌ (సి) సబ్‌ (బి) స్టెయిన్‌ 40, రస్సెల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) తాహిర్‌ 0, సామి (నాటౌట్‌) 25, హోల్డర్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 50 ఓవర్లలో 291/7; వికెట్ల పతనం: 1-36, 2-63, 3-122, 4-148, 5-231, 6-232, 7-253; బౌలింగ్‌: మోర్కెల్‌ 10-0-43-2, ఫిలాండర్‌ 10-0-69-2, స్టెయిన్‌ 10-0-29-1, డుమిని 4-0-39-0, తాహిర్‌ 10-0-60-1, బెహార్డిన్‌ 6-0-39-1.

Monday, 12 January 2015

కోహ్లీని ధోనీతో పోల్చలేం - దాదా


సిడ్నీ: ధోనీతో.. కొత్త కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని పోల్చడం సమంజసం కాదని టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్‌ గంగూలీ అన్నా డు. అనుభవ పూర్వకంగానే ఎవరై నా పట్టుసాధిస్తారని చెప్పా డు. ‘ధోనీతో కోహ్లీని పోల్చమని తీవ్రం గా అడుగుతున్నారు. వాస్తవానికి ఇద్దరినీ పోల్చలేం. అలా చేయడం కూడా సబబుకాద’ని చెప్పాడు.

ప్రపంచకప్‌ మరో 32 రోజుల్లో - సన్నహకల్లో భారత జట్టు


నాలుగేళ్లకోసారి వచ్చే క్రికెట్‌ పండుగ.. ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. యావత్‌ క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించే విశ్వపోరుకు ఇంకా 32 రోజులే మిగిలాయి. ఫిబ్రవరి 14న మొదలయ్యే ఈ మెగా సంబరానికి ఆసే్ట్రలియాతో పాటు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 44 రోజుల పాటు జరిగే ఈ ‘అంతిమ’ యుద్ధంలో 14 దేశాలు పాల్గొనబోతున్నాయి. కొత్తపాత ఆటగాళ్ల కలబోతతో ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కోట్లాది మంది అభిమానుల ఆశల ‘పల్లకి’ని మోసే ఆటగాళ్లెవరో ఖరారైంది. ఇక కదనరంగంలో ‘బ్యాట్లు.. బంతులు’ దూసేందుకు ‘సైనికులు’ సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేయడంలో వారంతా నిమగ్నమైపోయారు. ‘శత్రువు’లపై ప్రయోగించేందుకు అసా్త్రలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే..! మరోవైపు చూస్తే మాత్రం జట్ల ఎంపికలో ఆయా దేశాల బోర్డుల నిర్ణయాలు ఆశ్చర్యాలకు... అనుమానాలకు.. విమర్శలకు తావిచ్చాయి. ఎన్నో సందర్భాల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు కట్టబెట్టిన వారి ఆశలు అడియాశలయ్యాయి..! కారణమేదైనా ఓ పది మంది టాప్‌ క్రికెటర్లు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఫామ్‌ కోల్పోయి ఒకరు.. వయసు మీద పడి మరొకరు.. బోర్డును ధిక్కరించిన ఇంకొకరు... ఇలా చాంపియన్‌ ఆటగాళ్ల కలలు కల్లలుగా మారిపోయాయి. ప్రత్యర్థులకు ‘మిస్టరీ’గా మారి.. ఇప్పుడు ‘హిస్టరీ’లో కలిసిపోయేలా కనిపిస్తున్న ఆ ఆటగాళ్లెవరూ చూద్దాం రండి.
వేటుగాళ్లు...
యువరాజ్‌ సింగ్‌: భారత జట్టును ప్రకటించే 48 గంట ముందు దేశంలో ‘యువరాజ్‌ ప్రచారం’ ఊపందుకుంది. జడేజా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యువీని జట్టులోకి తీసుకోవాలని అతని అభిమానులు.. మాజీ ఆటగాళ్లు డిమాండ్‌ చేశారు. పేలవ ప్రదర్శనతో ఏడాదిగా జట్టుకు దూరమై.. ప్రాబబుల్స్‌లోనూ చోటు దక్కించుకోని ఈ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌.... జట్టు ప్రకటనకు ముందే యాదృచ్ఛికంగా రంజీల్లో ‘హ్యాట్రిక్‌’ శతకాలు సాధించాడు. కానీ, గత ప్రపంచకప్‌లో అదరగొట్టిన యువీ పునరాగమనంపై అభిమానుల్లో ఏ మూలనో మిణుకుమిణుకు మన్న ఆశలకు సందీప్‌ పాటిల్‌ అండ్‌ కో ముగింపు పలికింది.
డ్వెన్‌ బ్రావో: ఇటీవల కాలంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ బాధ్యతలు అప్పజెప్పేందుకు ముందు వరుసలో ఉన్న ఈ డాషింగ్‌ క్రికెటర్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు పక్కన బెట్టింది. బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఏర్పడ్డ వేతన ‘వెతల’ కారణంగా భారత పర్యటనను విండీస్‌ అర్ధంతరంగా ముగించడంలో బ్రావోది ప్రధాన పాత్ర. ఈ కారణంగానే ప్రపంచకప్‌లో పాల్గొనే తుది జట్టులో ఈ కరీబియన్‌ సారథికి చోటివ్వలేదు.
కీరన్‌ పొలార్డ్‌: ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గత ఆరు నెలలుగా బ్యాట్‌తో గానీ, బంతితో గానీ నిలకడగా రాణించడం లేదు. అయతే ఇప్పటికీ క్షణాల్లో మ్యాచ్‌ను ఏకపక్షం చేసే సామర్థ్యం అతనిలో ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, దురదృష్టవశాత్తూ సెలెక్టర్లు పొలార్డ్‌ను పక్కనబెట్టారు. భారత పర్యటన ‘రద్దు’ విషయంలో బ్రావోకు సహకరించిన అతనిపై వేటు వేశారు.
అలిస్టర్‌ కుక్‌: ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈసీబీ ప్రపంచకప్‌ జట్టుకు అవకాశం ఇవ్వకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్‌ 2-5తో సిరీస్‌ కోల్పోవడంలో ఆటగాడిగా, సారథిగా విఫలమైన కుక్‌పై వేటు వేసింది. శ్రీలంకతో సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగానే ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ను తప్పించడంతో పాటు మోర్గాన్‌కు సారథ్యం అప్పజెపుతున్నట్టు బోర్డు ప్రకటించింది.
ఉమర్‌ గుల్‌: మోకాలి గాయం తిరగబెట్టడంతో మరో ప్రపంచకప్‌లో ఆడాలన్న ఈ స్టార్‌ పేసర్‌ ఆశలు ఆవిరయ్యాయి. గతేడాది మేలో శస్త్ర చికిత్స చేయించుకున్న గుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో అతనిపై పాక్‌ బోర్డు వేటు వేసింది.
కమ్రాన్‌ అక్మల్‌: ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వికెట్‌ కీపర్‌ కెరీర్‌ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టయింది. ఎటువంటి లాజిక్‌ లేకున్నా సర్ఫరాజ్‌ అహ్మద్‌కు చాన్స్‌ ఇచ్చిన పాక్‌ బోర్డు నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. అయితే కమ్రాన్‌ సోదరుడు ఉమర్‌ అక్మల్‌కు చాన్స్‌ ఇచ్చిన బోర్డు జట్టులో యువ రక్తం నింపేందుకు ప్రయత్నించింది.
ర్యాన్‌ హారిస్‌: ఈ మెగా టోర్నీ తర్వాత జరిగే యాషెస్‌ సిరీస్‌కు సిద్ధంగా ఉంచడం కోసం ఈ పేసర్‌ను తప్పించి క్రికెట్‌ ఆసే్ట్రలియా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచకప్‌లో ఆడడం కోసం పరితపించిన హారిస్‌ను బలిచేసినట్టయింది. పరిమిత ఓవర్ల ఆటలో తమ ప్రణాళికలో భాగంగా 35 ఏళ్ల హారిస్‌ ఎక్కువ కాలం వన్డేల్లో కొనసాగలేడని చెప్పి తన నిర్ణయాన్ని సీఏ సమర్థించుకుంది.
అజంతా మెండిస్‌: మిస్టరీ స్పిన్నర్‌గా పేరు దక్కించుకొని టీమిండియాను ముప్పు తిప్పలు పెట్టిన ఈ శ్రీలంక ఆటగాడు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. దీంతో ఆఖరి నిమిషంలో ప్రపంచకప్‌ జట్టులో చోటు కోల్పోయిన ఆ స్టార్‌ స్పిన్నర్‌ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
జిమ్మీ నీషమ్‌ : మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్‌ నీషమ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ గ్రాంట్‌ ఇలియట్‌ను ఎంపికచేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలియట్‌ 2013 నవంబర్‌ నుంచి ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో తనను కాదని అతనికి చాన్స్‌ ఇవ్వడంపై నీషమ్‌ అవమానంగా భావిస్తున్నట్టు కివీస్‌లో పెద్ద చర్చ నడుస్తోంది.
రాబిన్‌ పీటర్సన్‌: మూడు ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఆడిన ఈ వెటరన్‌ క్రికెటర్‌ మరో ‘చాన్స్‌’ పొందలేకపోయాడు. తుదిజాబితాలో తన పేరు లేకపోవడంతో ఇక వన్డేలకు స్వస్తి చెప్పే యోచనలో పీటర్సన్‌ ఉన్నట్టు సమాచారం. 

Sunday, 4 January 2015

ఆకరిదైన గెలిచేనా


కొత్త సారథి కోహ్లీకి సవాల్‌ 
కంగారూలకు గాయాల బెడద..
జాన్సన్‌ అవుట్‌
నాలుగో టెస్ట్‌ రేపటి నుంచి
ఆసే్ట్రలియా గడ్డపై ఆఖరి పోరాటానికి టీమిండియా సిద్ధమైంది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని 3-0తో కైవసం చేసుకోవాలని అటు కంగారూలు భావిస్తుండగా.. గెలుపుతో సిరీస్‌ను ముగించాలని భారత్‌ కృత నిశ్చయంతో ఉంది. పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టనున్న విరాట్‌ కోహ్లీకి ఈ మ్యాచ్‌ సవాల్‌గా నిలవనుంది. అడిలైడ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ రాణించడం సానుకూలాంశం. ఇక మెల్‌బోర్న్‌ టెస్ట్‌ను డ్రా చేసుకున్న ఆత్మవిశ్వాసంతో యువ భారత్‌ బరిలోకి దిగనుంది.
ఉదయం 4.50 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ 1, 3లలో 
సిడ్నీ: ఈసారి పర్యటనలో టీమిండియా అంచనాలకు మించి రాణిస్తోంది. దీంతో తొలి రెండు టెస్ట్‌ల్లో గెలుపు కోసం ఆతిథ్య ఆసీస్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అడిలైడ్‌, బ్రిస్బేన్‌లో కంగారూలకు భారత్‌ గట్టిపోటీ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లోనూ కంగారూలకు పర్యాటక జట్టు దీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌లోనూ గెలుపు కోసం ఇరు జట్లూ తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది.
రాహుల్‌కు మరో చాన్స్‌: సిడ్నీ టెస్ట్‌కు టీమిండియా ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌లో ప్రభావం చూపని ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌పై వేటుపడడం ఖాయంగా కన్పిస్తోంది. చివరి 13 ఇన్నింగ్స్‌ల్లో ధవన్‌ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. ఇక మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో నిరాశపర్చిన యువ బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌కు మరో చాన్స్‌ ఇవ్వనున్నారు. ఒక్క టెస్ట్‌లోనే అతనిపై అంచనాకు రాలేమని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కాగా మిడిలార్డర్‌లో సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ మధ్య తీవ్ర పోటీనెలకొంది.
రికార్డు పేలవం: సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో 36 ఏళ్లుగా టీమిండియా గెలుపు రుచి చూడలేదు. 1978లో భారత్‌ ఇక్కడ చివరిసారి నెగ్గింది. ఈ వేదికపై భారత్‌ మొత్తం పది టెస్ట్‌ల్లో ఒకటి నెగ్గి.. ఐదింటిలో ఓడింది. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది.
ధవన్‌ ఫామ్‌పై చర్చ...
ఆసే్ట్రలియా పర్యటనలో తీవ్రంగా విఫలమైన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ఫామ్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. శిఖర్‌ విదేశాల్లో ఆడిన పది టెస్ట్‌ల్లో కేవలం 504 రన్సే చేశాడు. సగటు 29 మాత్రమే. ఇక శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడన్న బలహీనతను మూటగట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 28 సగటుతో 167 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81. దీంతో చివరి టెస్ట్‌లో ధవన్‌ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి.
కోహ్లీ దూకుడెంతో చూస్తాం: వార్నర్‌
ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్న కోహ్లీపై కంగారూలు మైండ్‌ గేమ్‌ కొనసాగిస్తున్నారు. సిడ్నీ టెస్ట్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌గా కోహ్లీ బ్యాటింగ్‌ ఆసక్తి రేపుతోందని డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. ‘కోహ్లీ పోటీ తత్వంగల ఆటగాడు. కెప్టెన్‌గా కోహ్లీ అదే దూకుడు కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఇక ఆట గురించి ధోనీ చాలా ఆలోచిస్తాడు. మ హీకి క్రికెట్‌ పరిజ్ఞానం ఎక్కువ. అతని రిటైర్మెంట్‌ మాకు దిగ్ర్భాంతి కలిగించింది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో ధోనీకి బాగా తెలుసు. వ్యూహాలను అమలు పర్చడంతో అతను దిట్ట. అందుకే మహీ వెరీ వెరీ స్మార్ట్‌ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడ’ని వార్నర్‌ తెలిపాడు

Saturday, 3 January 2015

విశ్లేషణ : యువీనా? యువ రక్తమా?


ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రథమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగేళ్లపాటు కప్పు మన దగ్గరే ఉంచగల పదిహేను మంది మొనగాళ్లను ఆరో తేదీన ఎంపిక చేయబోతున్నారు. మరి జట్టులో యువరాజ్‌ సింగ్‌కు చోటుంటుందా? రెండో వికెట్‌ కీపర్‌ను తీసుకెళ్తారా? అసలు జట్టు సారథిగా ధోనీ కొనసాగుతాడా? లేక విరాట్‌ కోహ్లీకి వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెబుతారా? బోలెడంత ఆసక్తి రేపుతున్న ప్రశ్నలివి.
ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌గా గత నెలలో ప్రకటించిన ముప్పై మంది ఆటగాళ్ల జాబితాలో యువరాజ్‌ సింగ్‌ పేరులేదు. కానీ ఆ జాబితాలో లేనివారిని కూడా తుది జట్టులో ఎంపిక చేసే వెసులుబాటుంది. బహుశా అందుకే యువీ ఇప్పుడు సెలక్షన్‌ కమిటీ తలుపులు తెగ బాదేస్తున్నాడు. అంటే అక్షరాలా అలా చేస్తున్నాడని కాదు గానీ రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు కొట్టి సెలెక్టర్లు తనను విస్మరించడానికి వీలులేని పరిస్థితులు కల్పించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించగల సత్తా ఉన్న యువరాజ్‌ లాంటి ఆటగాడిని జట్టులోకి ఎవరైనా కళ్లకద్దుకుని తీసుకుంటారు. క్రితం సారి ప్రపంచకప్‌ను అతని ఆల్‌రౌండ్‌ ప్రతిభ వల్లనే గెలిచాం. కానీ యువీ బౌలింగ్‌లో మునుపటి పస లేదు. ఫీల్డింగ్‌లో కూడా ఒకప్పటి చురుకుదనం లేదు. ఇప్పుడతన్ని కేవలం ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గానే తీసుకోవాలి. మరి ఇప్పటికే జట్టులో సెటిలైన అంబటి రాయుడు లాంటి వారిని తప్పించి యువీని తీసుకుంటారా అన్నది సందేహమే. సందీప్‌ పాటిల్‌ నాయకత్వంలోని సెలెక్షన్‌ కమిటీ పాత కాపుల్ని పక్కన బెట్టి యువతకు పెద్ద పీట వేస్తూ వస్తోంది కనుక యువీ ‘ఘర్‌ వాప్సీ’ కష్టమే. పదిహేను మందితో కూడిన తుది జట్టులో ఒకరు లేదా ఇద్దరు వికెట్‌ కీపర్లతో కలిపి ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌, ఏడుగురు బౌలర్లు ఉంటారు. ఆ ఏడుమంది బౌలర్లలో నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు ఉండే అవకాశముంది.
జట్టులో కచ్చితంగా ఉండే బ్యాట్స్‌మెన్‌ ఎవరో చూద్దాం: శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె, సురేశ్‌ రైనాలకు ప్రపంచకప్‌ టికెట్‌ గ్యారెంటీ. అలాగే మొదటి వికెట్‌ కీపర్‌ స్థానం ధోనీది (కెప్టెన్‌ కూడా అతనేనని చెప్పడానికి సాహసించొచ్చు). ఇక మిగిలిన రెండు స్థానాలకు ఎవరిని జట్టులో చేరుస్తారన్నదే అసలు ప్రశ్న. ఈ రెండు స్థానాలకుగాను అంబటి రాయుడు, మురళి విజయ్‌, యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఊతప్ప, వృద్ధిమాన్‌ సాహాల మధ్య గట్టిపోటీ ఉంటుంది. రెండో వికెట్‌ కీపర్‌ను పంపాలని గనుక సెలెక్టర్లు భావిస్తే స్పెషలిస్టు కీపర్‌గా సాహాకు ఒక స్థానం దక్కుతుంది. అలా కాకుండా ఒక కీపర్‌ చాలనుకుంటే రాయుడు, మురళి విజయ్‌ జట్టులోకి వస్తారు. క్రితం ప్రపంచకప్‌లో కూడా భారత జట్టు ఒక కీపర్‌తోనే బరిలోకి దిగింది. కానీ అప్పుడు స్వదేశంలో ఆ పోటీలు జరిగాయి కాబట్టి ఒక్కరితో సరిపెట్టారు. అవసరమైతే రాయుడు కీపింగ్‌ చేయగలుగుతాడు కాబట్టి రెండో కీపర్‌ అవసరం ఈసారి కూడా ఉండదేమో. రాబిన్‌ ఊతప్పకు కూడా ఇదే వర్తిస్తుంది. 2003 విశ్వకప్‌లో మొత్తం టోర్నమెంటంతా పార్ట్‌ టైం కీపర్‌ (ద్రావిడ్‌)తో కథ నడిపించిన ఘనత మనకెలాగూ ఉంది. అందుకే రెండో కీపర్‌ బదులు అదనంగా ఒక బ్యాట్స్‌మన్‌ను తీసుకెళ్లడానికే సెలెక్టర్ల ఓటుపడొచ్చు.
విజయ్‌కి చోటు?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టుల్లో మంచి ఫామ్‌ ప్రదర్శిస్తున్న విజయ్‌ ఇప్పుడు హఠాత్తుగా తెర మీదికొచ్చాడు. ఇప్పటి వరకు పద్నాలుగు వన్డేలాడిన ఈ తమిళ తంబి బ్యాటింగ్‌ సగటు ఇరవై కూడా దాటలేదు. అయితే ధవన్‌, రోహిత్‌లిద్దరూ ‘దైవాధీనం’ ఓపెనర్లే కాబట్టి నిలకడగా ఆడే విజయ్‌ని జట్టులోకి తీసుకోవచ్చన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేస్‌బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ కచ్చితంగా జట్టులో ఉంటారని చెప్పొచ్చు. ఇక నాలుగో ఫాస్ట్‌ బౌలర్‌ స్థానం కోసం ఇషాంత్‌ శర్మ, వరుణ్‌ ఆరోన్‌ల మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో వీరిద్దరిలో ఇషాంత్‌ మెరుగనిపించాడు కాబట్టి సెలెక్టర్లు అతని వైపే మొగ్గు చూపొచ్చు.
జడేజా డౌటు: స్పిన్నర్ల విషయంలో అశ్విన్‌ పేరొక్కటి పక్కా. రవీంద్ర జడేజా ఫిట్‌ అని తేలితే అతను కూడా పక్కానే. ఇక మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌కు చోటు దక్కొచ్చు. లెగ్‌ స్పిన్నర్‌ ఉండాల్సిందేనని సెలెక్టర్లు అనుకుంటే కర్ణ్‌శర్మకు ఛాన్సుంది. జడేజా గాయం నుంచి కోలుకోకపోతే కర్ణ్‌, అక్షర్‌ ఇద్దరూ జట్టులోకొస్తారు.
మొత్తం మీద ప్రపంచకప్‌నకు వెళ్లే భారత జట్టు ఇలా ఉండొచ్చు:
మహేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లీ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, మురళి విజయ్‌, అజింక్యా రహానె, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు/రాబిన్‌ ఊతప్ప/వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, రవీంద్ర జడేజా/కర్ణ్‌శర్మ, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ
మరి ‘ఆల్‌రౌండర్‌’ స్టువర్ట్‌ బిన్నీ సంగతేంటి?!

నాకేనా ఈ రూల్స్‌? - సైనా సేహ్వాల్


సైనా పేరును పద్మ భూషణ్‌కు సిఫారసు చేయని క్రీడాశాఖ
ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాదీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డు అందుకోవాలని కలలుగన్న బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. 2013లో దక్కని ఈ అవార్డును ఈ సారైనా అందుకోవాలన్న హైదరాబాదీ ఏస్‌ షట్లర్‌కు మరో ఏడాదిదాకా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల సాకుతో గతంలో ఆమె దరఖాస్తును తిరస్కరించిన క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సారి ‘ప్రత్యేక కేసు’గా రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను పేరును తెరపైకి తీసుకొచ్చి సైనా పేరును పక్కనబెట్టింది. పద్మ భూషణ్‌ అవార్డు కోసం బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) సైనా పేరును ఆగస్టులోనే క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసినా.. క్రీడా శాఖ మాత్రం హోం మంత్రిత్వ శాఖకు ఆమె పేరును పంపలేదు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పేరును ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ప్రతిపాదించింది. సుశీల్‌కు కూడా నిబంధనలు అడ్డొస్తున్నా ప్రత్యేకంగా పరిగణించింది. కాగా క్రీడాశాఖ తీరు పట్ల సైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2013లో దరఖాస్తు చేసుకుంటే పద్మశ్రీ తీసుకుని ఐదేళ్లు కాలేదు కాబట్టి 2014లో ప్రయత్నించమన్నారని, కానీ ఇప్పుడేమో తన పేరును హోం శాఖకు పంపలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఐదేళ్లు పూర్తయ్యాయిగా..: సైనాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2013లో ఆమె ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ, ఒకసారి పద్మ అవార్డు తీసుకున్నాక మరో ‘పద్మ’ అవార్డు అందుకోవాలంటే ఐదేళ్లు ఆగాలన్న నిబంధనను సాకుగా చూపిస్తూ క్రీడా శాఖ ఆమె దరఖాస్తును అప్పట్లో తిరస్కరించింది. తర్వాతి ఏడాది ప్రయత్నించమని పేర్కొంది. అయితే ఇప్పుడేమో ఆమె దరఖాస్తును పక్కనబెట్టి సుశీల్‌ కుమార్‌ పేరును ‘ప్రత్యేక కేసు’గా తెరపైకి తెచ్చింది. ఈ పరిణామంపై సైనా స్పందిస్తూ.. ‘పద్మ భూషణ్‌ అవార్డు కోసం సుశీల్‌ కుమార్‌ పేరును ప్రత్యేకంగా పరిగణించి హోం శాఖకు పంపినట్టు తెలిసింది. రెండు పద్మ అవార్డుల మధ్య కనీసం ఐదేళ్లు విరామం ఉండాలని హోం శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. నేను పద్మశ్రీ తీసుకుని ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సుశీల్‌ కుమార్‌ పేరును క్రీడాశాఖ.. హోంశాఖకు ప్రతిపాదిస్తున్నపుడు నా పేరును కూడా సిఫారసు చేయొచ్చు కదా. కానీ, అలా చేయలేదు. ఇది చాలా బాధ కలిగించింద’ని ఆమె వాపోయింది. కాగా, 2011లో పద్మశ్రీ అందుకున్న సుశీల్‌ కుమార్‌ పేరును మాత్రం ఐదేళ్లు పూర్తి కాకపోయినా సిఫారసు చేయడాన్ని సైనా తప్పుబట్టింది.
సుశీల్‌ గొప్ప ఆటగాడే కానీ..: దేశానికి ఎన్నో విజయాలు అందించినప్పటికీ క్రీడా శాఖ తనను చిన్నచూపు చూసిందని సైనా ఆవేదన వ్యక్తం చేసింది. ‘పద్మ భూషణ్‌ అవార్డు కోసం గతేడాది కూడా దరఖాస్తు చేసుకున్నా. అప్పుడు క్రీడాశాఖ ‘సైనా.. నువ్వు పద్మశ్రీ అందుకుని ఐదేళ్లు కాలేదు. కాబట్టి వచ్చే ఏడాది దరఖాస్తు చేసుకో’ అని చెప్పింది. కాబట్టి మళ్లీ 2014లో దరఖాస్తు చేసుకున్నాను. అయినా నా పేరును హోంశాఖకు ఎందుకు సిఫారసు చేయలేదు? 2010 తర్వాత నేను కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించా. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించా. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించా. ఎన్నో సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు నెగ్గా. కాబట్టి ఈ అవార్డుకి నేను పూర్తిగా అర్హురాలినేనని భావిస్తున్నాన’ని సైనా తెలిపింది. ‘సుశీల్‌ గొప్ప ఆటగాడే. కానీ, పతకం పతకమే. ఇద్దరం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాం. ఒకవేళ ప్రత్యేకంగా పరిగణించి అవార్డు ఇవ్వదలచుకుంటే 2012లోనే అతనికి ఇవ్వాల్సింది. ఇప్పుడెందుకు ఇస్తున్నారు. ఈ నిర్ణయం నన్ను చాలా బాధించింది. నేను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నా. ఈ అవార్డు మా ఇద్దరికీ ఇస్తే బాగుంటుంది. ఒక వేళ పద్మశ్రీ అందుకని ఐదేళ్లు పూర్తికాని సుశీల్‌ పేరును ప్రత్యేకంగా పరిగణిస్తే.. నా పేరు కూడా సిఫారసు చేయాలి. ఎందుకంటే నేను పద్మశ్రీ అందుకుని ఐదేళ్లు దాటిపోయింద’ని ఆమె వెల్లడించింది.

Tuesday, 1 July 2014

తిక్రిత్ చుట్టూ మోహరించిన సైన్యం

  • 30/06/2014
బాగ్దాద్, జూన్ 29: సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న తిక్రిత్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఇరాక్ సైన్యం సన్నద్ధమైంది. నగరం చుట్టూ మోహరించి ఏ క్షణమైనా దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మరోపక్క మిలిటెంట్లు పాగా వేసిన భవనాలపై శనివారం సాయంత్రం నుంచి వైమానిక దాడులు చేస్తోంది. మిలిటెంట్లు సైన్యంపై ఎదురుదాడికి దిగడంతో ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిక్రిత్‌లో నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, వైమానిక దాడుల భయం వెన్నాడుతుండటంతో చాలామంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో తిక్రిత్ నగరం చాలామటుకు నిర్మానుష్యంగా మారిపోయింది. ఇరాక్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన తిక్రిత్‌ను సున్నీ మిలిటెంట్లు నెల రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. యావత్ ఇరాక్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు దూకుడుగా వస్తున్న సున్నీ మిలిటెంట్లను అక్కడినుంచి తరిమికొట్టేందుకు యుద్ధట్యాంకులు, హెలికాప్టర్ వాహక నౌకలతో తిక్రిత్‌ను చుట్టుముట్టింది. ఇందుకు సంబంధించి భిన్నమైన వార్తలు వెలువడుతున్నా, సైన్యం ఎంతమేరకు తిక్రిత్‌లోకి చొచ్చుకుపోతుందన్నది స్పష్టంగా తెలియడం లేదు. తిక్రిత్ శివారుల్లో సైన్యం మోహరించిందని, ఏ క్షణమైనా మిలిటెంట్లపై ప్రత్యక్ష దాడికి దిగే అవకాశముందని ప్రొవిన్షియల్ గవర్నర్ వెల్లడించారు. ప్రస్తుతం తిక్రిత్‌ను తిరిగి చేజిక్కించుకునేందుకు సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే అటు ఇరాక్ సైన్యానికి, అధ్యక్షుడు మాలికికి ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు. శనివారం సాయంత్రం తిక్రిత్ సరిహద్దులకు చేరిన సైన్యం మిలిటెంట్లు దాగివున్న యూనివర్శిటీ క్యాంపస్‌పై వైమానిక దాడులు జరిపినట్లు ఇరాక్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఖాసిమ్ అల్ వౌసావి తెలిపారు.
తిక్రిత్‌కు ఉత్తరం వైపునుంచి శివారు వద్దకు సైన్యం చేరుకోగా, మరికొన్ని దళాలు గతంలో అమెరికాకు సేవలందించిన వైమానిక స్థావరం వద్ద రక్షణగా నిలిచినట్లు సలావుద్దీన్ ఆపరేషనల్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ అబు రఖీఫ్ ధ్రువీకరించారు. కాగా, శనివారం సాయంత్రం వరకు తిక్రిత్ నగరం మిలిటెంట్ల అధీనంలోనే ఉందని స్థానికులు వెల్లడించారు. సున్నీల ప్రాబల్యం కలిగిన తిక్రిత్‌లో సుమారు రెండు లక్షలమంది వీధుల్లో పహారా కాస్తున్నారు. యునివర్శిటీ క్యాంపస్‌లో ఉన్న మిలిటెంట్లకు, సైన్యం మధ్య దాడులు జరుగుతున్నాయని స్థానికులు ధ్రువీకరించారు. సైనిక హెలికాప్టర్ల దాడుల అనంతరం టిగ్రిస్ నదీతీరాన ఉన్న అధ్యక్ష భవన కాంప్లెక్స్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపారు.
చిత్రం.. తిక్రిత్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామం వద్ద మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు మాటువేసి ఉన్న ఇరాక్ సైన్యం

ఎనిమిది శక్తివంతమైన బాంబుల స్వాధీనం

కిషన్‌గంజ్ (బీహార్), జూన్ 30: మాల్దా నుంచి న్యూ జల్పాయ్‌గురికి వెళుతున్న ఒక ప్యాసింజర్ రైల్లో ఎనిమిది శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కిషన్‌గంజ్ రైల్వే పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అలోక్ ప్రసాద్ సింగ్ సోమవారం తెలిపారు. రైలు కిషన్‌గంజ్ స్టేషన్‌లో ఆగినప్పుడు పోలీసులు, ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సిబ్బంది నిర్వహించిన తనిఖీలో బాంబులు బయటపడ్డాయని, ఒక జనరల్ బోగీ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బాంబులు ఉన్నట్లు నిర్ధారించిన వెంటనే బాంబు స్క్వాడ్‌ను రప్పించి వాటిని నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఇంటెలిజెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారని తెలిపారు.
చొరబాటు యత్నం భగ్నం
జమ్మూ, జూన్ 30: జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు తీవ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళం తిప్పికొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆరుగురు తీవ్రవాదులను భారత్‌లోకి చొప్పించేందుకు పాకిస్తాన్ సైనికులు తర్కుదీ సెక్టార్‌లో భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని, భారత జవాన్లు దీటుగా ప్రతిస్పందించి ఎదురుదాడికి దిగడంతో తీవ్రవాదులు తోకముడిచారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు. సుశిక్షితులైన తీవ్రవాదులను జమ్మూ-కాశ్మీర్‌లోకి చొప్పించేందుకు పాకిస్తాన్ సైనిక దళం పదేపదే ప్రయత్నిస్తోందని భారత జవాన్లతో పాటు నిఘా సంస్థలు నిందిస్తున్నాయి.
బ్యాగులో యువతి శవం!
పుణె, జూన్ 30: పుణె శివారు ప్రాంతంలోని ఒక చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ట్రావెలింగ్ బ్యాగు నుంచి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతి శవం బయటపడింది. ఈ యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లు, శరీరంపై అక్కడక్కడా కొన్ని గాయాలున్నాయి. చెక్‌పోస్టు వద్ద ఎవరో వదిలి వెళ్లిన బ్యాగును తనిఖీ చేయగా, శవం బయటపడింది. యువతి నల్లని జీన్ ప్యాంటు, తెల్లటి టాపు ధరించి వుందని, మృతికి కారణాలను, యువతికి సంబంధించిన ఆనవాళ్లను ఇంకా గుర్తించాల్సి వుందని పుణె శివారులోని ఎరవాడ పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించేందుకు నగరంలోని మిగతా పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని తెలిపారు.

శాస్తవ్రేత్తలకు అభినందనలు

నెల్లూరు/సూళ్లూరుపేట, జూన్ 30: పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచే ప్రధాని దాదాపు అరగంట ప్రసగించారు. ఆయన ప్రసంగంలో ఇస్రోలో జరిగే ప్రయోగాలతో పాటు శాస్తవ్రేత్తల కృషి, శ్రమను కొనియాడి భవిష్యత్‌లో మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేపట్టడమే కాకుండా యువ శాస్తవ్రేత్తలను తీసుకురావాలన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్, షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఇతర శాస్తవ్రేత్తలను అభినందించారు. ప్రయోగానంతరం పిఎం, గవర్నర్, సిఎంలకు ఇస్రో చైర్మన్, షార్ డైరెక్టర్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లి వీడ్కోలు పలికారు.
ముక్కంటీశుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
శ్రీకాళహస్తి: ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి పిఎస్‌ఎల్‌వి సి-23 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన తరువాత ఆయన కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం వేదపండితులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తరువాత వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ ఇన్స్‌పెక్టర్ సుదర్శన్ తీర్థప్రసాదాలను, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఉపగ్రహ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, ఆ తరువాత శ్రీకాళహస్తీశ్వరాలయానికి రావడం ఆనవాయితీగా ఉంది.

భగ్గుమన్న పెట్రోలు

లీటర్‌పై రూ.1.69, డీజిల్‌పై 50 పైసలు పెంపు
న్యూఢిల్లీ, జూన్ 30: సాయుధ సంఘర్షణలతో అట్టుడుకుతున్న ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం అంతర్జాతీయ చమురు, కరెన్సీ మార్కెట్లపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.1.69 పైసలు, డీజిల్ ధర 50 పైసలు చొప్పున పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని దేశీయ చమురు సంస్థలు స్పష్టం చేశాయి. స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్‌ను మినహాయించి ఈ ధరలను పెంచినందున దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రూ.71.56 పైసలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర సోమవారం అర్ధరాత్రి నుంచి రూ.2.02 పైసలు పెరిగి రూ.73.58 పైసలకు చేరుకుంటుంది. అలాగే డీజిల్ ధర లీటర్‌కు 56 పైసలు పెరిగి రూ.57.84 పైసలకు చేరుకుంటుంది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వలన అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత రెండు వారాల్లో గణనీయంగా పెరిగాయని, ప్రత్యేకించి గ్యాసోలిన్ (పెట్రోల్) ధర బ్యారెల్‌కు 4 అమెరికా డాలర్ల కంటే అధికంగా పెరిగిందని, అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ప్రస్తుతం ఇంధనం ధరల పెంపుదలకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) స్పష్టం చేసింది.

అజేయ భారత్

పిఎస్‌ఎల్‌వి-సి 23 దిగ్విజయం
నింగికెగసిన విదేశీ ఉపగ్రహాలు
26 వరుస విజయాలతో రికార్డు
అగ్ర దేశాల సరసన భారత్: నరేంద్ర మోదీ
నెల్లూరు/ సూళ్లూరుపేట, జూన్ 30: అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రోదసీ పరిశోధనలో భారత్ మరో మైలురాయిని అధిగమించి విదేశీ వాణిజ్యరంగ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 23 మరోసారి విజయబావుటా ఎగురవేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 9-52కు పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్‌ను శాస్తవ్రేత్తలు ప్రయోగించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విదేశీ వాణిజ్య, నావిగేషన్ సేవలకు సంబంధించిన స్పాట్-7, ఎఐశాట్, ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2, వెలాక్స్ అనే ఐదు విదేశీ ఉపగ్రహాలతోపాటు (ఇస్రో శాస్తవ్రేత్తలు రూపొందించిన 60 కిలోల ఎఐఎన్‌ఎస్ అనే పేలోడ్‌ను) ఒకేసారి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో శాస్తవ్రేత్తలు మరోసారి తమ సత్తా చాటారు. దీంతో భారత్ సాంకేతిక రంగంలో అగ్ర దేశాలకు దీటుగా నిలవడమేకాకుండా ఇస్రో శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 8:52కు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 49:00 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత సోమవారం ఉదయం 9:52కు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వరుసగా 26వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 23 ఫ్రాన్స్ దేశానికి చెందిన 714 కిలోల బరువున్న స్పాట్-7 ఉపగ్రహంతో పాటు కెనడాకు చెందిన 15 కిలోల బరువున్న ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్- 7.2, జర్మనీకి చెందిన 14 కిలోల బరువున్న ఎఐశాట్, సింగపూర్‌కు చెందిన 6.5 కిలోల బరువున్న వెలాక్స్‌తో పాటు (ఇస్రో శాస్తవ్రేత్తలు రూపొందించిన ఎఐఎన్‌ఎస్ పేలోడ్‌ను) 19:58కు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 23 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విదేశీ ఉపగ్రహాలు 655 కిమీ సూర్యనువర్తమాన కక్ష్యలోకి చేర్చారు. ఈ ప్రయోగం విజయంతో భారతదేశంలో ప్రతి పౌరుడికీ గౌరవం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలను అభినందించారు. ఈ ప్రయోగ విజయం ద్వారా ఏడాదికి 47 కోట్ల రూపాయల ఆదాయం రావడమే కాకుండా వాణిజ్య రంగంలో ఇస్రో మరో మైలురాయిని దాటింది. వీటిలో స్పాట్-7 60 వ్యాసార్థంతో 1.5 మీటర్ల పరిధిలోవన్న ఏ చిన్న వస్తువునైనా ఛాయాచిత్రాలు తీసి ఆయా దేశ రాడార్ కేంద్రాలకు చేరవేస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి స్పాట్-1 నుంచి నేటి స్పాట్-7 వరకు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించి సేవలను వినియోగించుకొంటున్నారు. జర్మనీకి చెందిన ఉపగ్రహాలు ఎఐశాట్ ఉపగ్రహం ద్వారా సముద్రంలో ఉండే నౌకల గమనస్థితులను, వాటి ఇబ్బందులను ఆ దేశాలకు చేరవేస్తుంది. కెనడా దేశానికి చెందిన ఎన్‌ఎల్‌ఎస్ ఉపగ్రహాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా పోయే చిన్న ఉపగ్రహాలను 500 వరకూ వ్యవస్థలను వాటి పనితీరును ఛాయాచిత్రాలు ద్వారా తెలుసుకోగలుగుతుంది. సింగపూర్‌కు చెందిన వెలాక్స్-1 ఉపగ్రహం సముద్రంలో అందే సిగ్నల్‌ను స్టోరేజ్ చేసుకొని ఆయా దేశ సిగ్నల్‌ను అవసరమైనప్పుడు ఆయా దేశాలకు చేరవేస్తోంది. నావిగేషన్ సేవలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యరంగ ప్రయోగానికి ప్రయోగం ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహ సేవలు పదేళ్లపాటు అందనుంది. ఇప్పటికే స్పాట్-6 ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సి 21 ద్వారా 2012లో ప్రయోగించి దాని సేవలు అందుకుంటున్నారు. ప్రయోగ సమయంలో 230 టన్నుల బరువు, 44.4 మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ తన నాలుగు దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని భూమికి 655 కిమీ దూరంలోని సూర్యనువర్తమాన కక్ష్యలోకి ఉపగ్రహాలను శాస్తవ్రేత్తలు విజయవంతంగా చేర్చారు. మిషన్ కంట్రోలర్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న శాస్తవ్రేత్తలు రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తరువాత ఒకదాని తరువాత ఒకటి నిర్ధేశించిన సమయానికే తన నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుంచి ఉపగ్రహాలు విడిపోయి కక్ష్యలోకి దూసుకెళ్లాయి. అక్కడే రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనిస్తున్న రేంజ్ ఆపరేషన్ సిబ్బంది రాకెట్ నాలుగో దశ పూర్తి చేసినట్టు నిర్ధారించడంతో మిషన్ కంట్రోలర్ సెంటర్‌లో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తమ హర్షధ్వానాలతో విదేశీ వాణిజ్యరంగ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా చేర్చామని అక్కడున్న శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు. ఇస్రో నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు ఇప్పటివరకు షార్ నుంచి మొత్తం 27 చేపట్టగా మొదటి ప్రయోగం వినా మిగిలిన 26 ప్రయోగాలు వరుసగా విజయపరంపర మోగించాయి. (చిత్రం)నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న పిఎస్‌ఎల్‌వి సి23 ; రాకెట్ పయనాన్ని ఉత్కంఠగా తిలకిస్తున్న షార్ శాస్తవ్రేత్తలు
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks