-వెంటాడనున్న ఒంటరితనం.. నిరుత్సాహం, ఊబకాయం సమస్యలు
-టెక్సాస్ యూనివర్సిటీ సర్వే వెల్లడి
టెక్సాస్, జనవరి 31: గంటలకొద్దీ అదే పనిగా టీవీ చూస్తున్నారా..? అయితే, ఈ వార్త మీకోసమే. ఎక్కువ సేపు టీవీ చూడటం అనర్థాలకు దారితీస్తుందని.. ముఖ్యంగా ఒంటరితనం, నిరుత్సాహంతోపాటు ఊబకాయ సమస్యలు వెంటాడుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై అనేక సర్వేలు జరిగినా.. తాజాగా టెక్సాస్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో కూడా టీవీల్లో గంటలకొద్దీ వచ్చే మారథాన్, సీరియళ్లు అదేపనిగా చూస్తారని గుర్తించారు. 18నుంచి 29 ఏండ్ల వయస్సున్న 316మందిపై సర్వే చేయగా ఎక్కువగా టీవీ చూసేవారు నీరసంగా, ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గమనించారు. ఈ సర్వేకు సారథ్యం వహించిన యూన్ హి సంగ్ అదేపనిగా టీవీ చూడటం తీవ్రమైన మానసిక సమస్య అని.. దీనినుంచి బయటకు రావడానికి మానసిక వైద్యుల సహాయం ఎంతైనా అవసరం ఉందని పేర్కొన్నారు.


No comments:
Post a Comment