క్రైంబ్యూరో: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలే సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన సల్మాన్‌ను పోలీసులు అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవే ఆరోపణలపై ముగ్గురు భారతీయ యువకులు టర్కీలో అరెస్టయినట్లు, వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించారు.
-ఉగ్రవాద సంస్థలో చేరికలకు యత్నాలు
-టర్కీలో పట్టుబడ్డ ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
-మనసుమార్చుకొని తిరిగొచ్చిన మరో యువతి
పట్టుబడ్డ ముగ్గురూ సాఫ్‌వేర్ ఇంజినీర్లేనని, వారిలో ఒకరిని ఖమ్మంకు చెందిన జావెద్ బాబాగా గుర్తించినట్లు పేర్కొన్నారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం ఎమ్మెస్ పూర్తిచేసి, పదేండ్లుగా అమెరికాలో నివసిస్తున్న జావేద్, చెన్నైకి చెందిన అబ్దుల్ అహద్, కర్ణాటకకు చెందిన ఇబ్రహీం నోఫల్‌లు టూరిస్ట్ వీసాపై టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వెళ్లారు. అక్కడి నుంచి సిరియా వెళ్లి ఐఎస్‌లో చేరేందుకు యత్నించినవారిని గత నెల 24న టర్కీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ముగ్గురిని తాము అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దోహాలో నివసిస్తున్న నగరానికి చెందిన 19 ఏండ్ల యువతి.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రసంస్థలో చేరేందుకు టర్కీ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి నిర్ధారించారు.
రెండు నెలల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను తెలుపుతూ దోహాలో నివసిస్తున్న నగర యువతి అక్కడే పరిచయమైన మరోమహిళ ద్వారా ఉగ్రసంస్థలోకి చేరేందుకు ప్రయత్నించి, టర్కీ వరకు వెళ్లి, మనసుమార్చుకొని తల్లిదండ్రుల్ని కలుసుకునేందుకు హైదరాబాద్ వచ్చిందని, విషయాన్ని పసిగట్టిన నిఘావర్గాలు ఆమెను అదుపులోకి తసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టాయిని కొత్వాల్ వివరించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం డైరీ ఆవిష్కరించిన ఆయన నగరంలో నివరిస్తున్న విదేశీయుల పాస్‌పోర్టు, తదితర వివరాలను తనిఖీచేస్తున్నట్లు తెలిపారు.


No comments:
Post a Comment