ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన భారత్ .. ఫైనల్ చాన్స్ మిస్
ఆసీ్‌సతో తుదిపోరుకు మోర్గాన్‌సేన
ముక్కోణపు టోర్నీ
లోపాలు సరిదిద్దుకుంది లేదు..! వ్యూహాలకు పదునుపెట్టిందీ లేదు..! అసలు విజయమనే మాటే లేదు..! టెస్ట్‌ల్లో ఓడినా అచ్చొచ్చిన వన్డేల్లో అదరగొడుతారులే అని ఆశపడ్డాం. ప్రపంచకప్‌నకు రిహార్సల్‌గా భావించిన ముక్కోణపు సిరీ్‌సలో బౌలింగ్ గాడినపడాలని కోరుకున్నాం...! రంగు చొక్కాలు వేసుకోగానే ప్రత్యర్థిని హడలెత్తించే యువ భారత్ ఈ సారి చేతులేత్తేసింది. మూడు మ్యాచ్‌ల్లోనూ చిత్తుగా ఓడి సిరీస్ నుంచి నిష్క్రమించింది. బలమనుకున్న బ్యాటింగే.. బలహీనతగా మారింది. మొత్తంగా ఆసే్ట్రలియా పర్యటనలో గెలుపు రుచే చూడని భారత్.. విశ్వపోరుకు ముందు కొత్త ఆందోళనలను తెరపైకి తెచ్చింది...!
పెర్త్: వరుణుడి రూపంలో వచ్చిన అవకాశాలను టీమిండియా అందిపుచ్చుకోలేపోయింది. ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబరచింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్లతో పరాజయం పాలైంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. 103/1తో పటిష్ట స్థితిలో కనిపించిన ధోనీసేన మరో 97 పరుగులే చేసి మిగతా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహానె (73) అర్ధశతకంతో మెరవగా, ధవన్ (38) సిరీ్‌సలో తొలిసారి రాణించాడు. రైనా (1), కోహ్లీ (8), రాయుడు (12), ధోనీ (17), బిన్నీ (7)తో పాటు జడేజా (5), అక్షర్ (1) విఫలమయ్యారు. చివర్లో షమి (18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 25) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు, వోక్స్, బ్రాడ్, అలీ తలో రెండు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓ దశలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనించింది. అయితే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేమ్స్ టేలర్ (82) అద్భుత పోరాటానికి తోడు బట్లర్ (67) అర్ధశతకంతో రాణించడంతో ఇంగ్లండ్ మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రూట్ (3), మోర్గాన్ (2), బొపార (4), బెల్ (10), అలీ (17) విఫలమయ్యారు. బిన్నీ మూడు, మోహిత్ రెండు వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్-ఆసీస్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
స్కోరుబోర్డు
భారత్: రహానె (సి) బట్లర్ (బి) ఫిన్ 73, ధవన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 38, కోహ్లీ (సి) రూట్ (బి) అలీ 8, రైనా (సి) వోక్స్ (బి) అలీ 1, రాయుడు (సి) బట్లర్ (బి) బ్రాడ్ 12, ధోనీ (ఎల్బీ) అండర్సన్ 17, బిన్నీ (సి) బెల్ (బి) ఫిన్ 7, జడేజా (సి) ఫిన్ (బి) బ్రాడ్ 5, అక్షర్ (సి) బెల్ (బి) ఫిన్ 1, మోహిత్ (నాటౌట్) 7, షమి (సి) బట్లర్ (బి) వోక్స్ 25; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 48.1 ఓవర్లలో 200; వికెట్ల పతనం: 1-83, 2-103, 3-107, 4-134, 5-136, 6-152, 7-164, 8-164, 9-165. బౌలింగ్: అండర్సన్ 9-1-24-1, వోక్స్ 9.1-1-47-2, బ్రాడ్ 10-1-56-2, ఫిన్ 10-0-36-3, అలీ 10-0-35-2.
ఇంగ్లండ్: బెల్ (ఎల్బీ) మోహిత్ 10, అలీ (సి) రాయుడు (బి) అక్షర్ 17, టేలర్ (సి) బిన్నీ (బి) మోహిత్ 82, రూట్ (సి అండ్ బి) బిన్నీ 3, మోర్గాన్ (సి) ధవన్ (బి) బిన్నీ 2, బొపార (సి) జడేజా (బి) బిన్నీ 4, బట్లర్ (సి) రాయుడు (బి) షమి 67, వోక్స్ (నాటౌట్) 4, బ్రాడ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 46.5 ఓవర్లలో 201/7; వికెట్ల పతనం: 1-14, 2-40, 3-44, 4-54, 5-66, 6-191, 7-193. బౌలింగ్: బిన్నీ 8-0-33-3, మోహిత్ 10-1-36-2, షమి 9-0-31-1, అక్షర్ 10-1-39-1, జడేజా 9.5-0-62-0.

No comments:
Post a Comment