సీనియారిటీ లిస్టు ప్రకటించాలి
డిఇఓకు యుటిఎఫ్ వినతి
జిల్లాలోని అన్ని క్యాడర్లకు చెందిన ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులను వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండల్ రావు, డి సంజీవరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు యుటిఎఫ్ ప్రతినిధులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి సోమిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టును ప్రకటిస్తున్నారని అన్నారు. సీనియారిటీ లిస్టు పెట్టాలని అనేక మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ముగ్గురు డిఇఓలు కూడా మారిపోయారని పేర్కొన్నారు. ఈ లిస్టులు ఆన్‌లైన్లో పెట్టడం ద్వారా పారదర్శకంగా ప్రమోషన్లు చేయడానికి సాధ్యపడుతోంది. అక్రమ డిప్యూటేషన్ల ద్వారా, అక్రమ బదిలీల ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చే ఉపాధ్యాయులకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారి స్పందించి వెంటనే సీనియారిటీ లిస్టును ఆన్‌లైన్లో పెట్టాలని లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.

No comments:
Post a Comment