సంప్రదాయ విజ్ఞానాన్ని వాడుకుందాం
పాతదంతా చెడ్డదేననటం మూర్ఖత్వమే: జవదేకర్
పైధాగరస్, ఆల్జీబ్రాలు మనవే: కేంద్రమంత్రి హర్షవర్ధన్
హర్షవర్ధన్ వ్యాఖ్యలను సమర్ధించిన శశిధరూర్
సందడిగా సాగిన రెండోరోజు జాతీయ సైన్స్ కాంగ్రెస్
ముంబై, జనవరి 4: బీజగణితంతోపాటు రేఖాగణితంలోని పైథాగరస్ సిద్ధాంతం భారతీయులదేనని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ముంబైలో ఆదివారం రెండోరోజున 102వ జాతీయ సైన్స్‌కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించారు. ప్రాచీన భారతంలో ఖగోళ, గణిత, రసాయన, వైద్య శాసా్త్రలకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణ లు జరిగినా.. పేరు దక్కించుకుంది విదేశీయులేనని వాపోయారు. పైథాగరస్ సిద్ధాంతం, బీజగణితం భారతీయ గణిత శాస్త్రజ్ఞుల మేధస్సుకు నిదర్శనాలైనా... నిస్వార్థంగా ఆ ఘనతను గ్రీకులు, అరబ్బులకిచ్చామని తెలిపారు. శాస్త్రం ఏదైనా భారతీయులు ఏనాడూ దాచుకునేందుకు, దోచుకునేందుకు దాన్ని వాడుకోలేదని కొనియాడారు. హర్షవర్ధన్ మాటలను కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ ట్విట్టర్లో సమర్థించారు. మన ప్రాచీన విజ్ఞానం కొందరు హిందుత్వ వాదుల అతిశయోక్తుల వల్ల అపహాస్యం పాలైందని వ్యాఖ్యానించారు. మహాన్నతభారతీయ విజ్ఞానాన్ని కుహనా ఆధునికులు పాతచింతకాయ పచ్చడిగా చెప్పటాన్ని కూడా తప్పుబట్టారు.
భారతీయ శాస్త్ర సిద్ధాంతాలన్నీ సునిశిత దృష్టితో పలు విషయాలను పరిశోధించాయని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ‘సంస్కృతం-భారతీయ వైజ్ఞానిక చరిత్ర’పై చర్చలో ఆయన పాల్గొన్నారు. వందల ఏళ్లనాడు మన దేశంలో సంస్కృతం అభ్యసించిన జర్మన్లు నేడు కొత్తకొత్త పరికరాలను తయారుచేస్తున్నప్పుడుమన భాషను మనమెందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచించాలన్నారు. పాత విజ్ఞానం అంతా గొప్పది కాకపోయినంత మాత్రాన అది పనికిరానిదని మాత్రం భావించరాదని స్పష్టం చేశారు. తానిప్పటికీ రోజూసంస్కృత వార్తలు వింటానని మంత్రి తెలిపారు.
విమానం భరద్వాజుడిదే
వేదాలలోని వైమానిక విజ్ఞానంపై పరిశోధన చేయాల్సి ఉందని జాతీయ సైన్స్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ‘భారతీయ వైమానిక విజ్ఞానం’పై చర్చలో కెప్టెన్ ఆనంద్ జే బోదాస్ ప్రసంగించారు. రుగ్వేదంలో విమానాల ప్రస్తావన ఉందని, ఏడువేల ఏళ్లనాడే భరద్వాజ మహర్షి ఇతర దేశాలకే గాక గ్రహాలకూ ప్రయాణించే విమానాల గురించి వివరించాడని తెలిపారు. ఈ మేరకు ఆయన రాసిన ‘విమాన సంహిత’లో వైమానిక విజ్ఞానానికి సంబంధించిన మరో 97 ఇతర రచనలనూ ప్రస్తావించారని తెలిపాడు. విమానాల తయారీలో ఎన్నో రకాల మిశ్రమ లోహాల గురించి వివరించాడనీ, విద్యార్థులు ఈ అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. కానీ, చరిత్ర ఈ ఘనతనంతా రైట్ సోదరులకిచ్చిందని వాపోయారు. ఇప్పటి రాడార్లు ఆనాడే ‘రూపర్కన రహస్య’ పేరిట వివరించిన వాటికి దగ్గరగా ఉన్నాయని వివరించారు.
శుశ్రుతుడే తొలి సర్జన్
ప్రపంచంలో తొలి శస్త్రచికిత్స జరిగింది భారత్‌లోనేని, చేసిన వైద్యుడు శుశ్రుతుడేనని ప్రముఖ వైద్యుడు అశ్విన్ సావంత్ తెలిపారు. ఆయన రాసిన ‘శుశ్రుతసంహిత’ శస్త్రచికిత్సపై తొలి గ్రంథమని తెలిపారు. రక్తశుద్ధి కోసం జలగలను వాడింది కూడా శుశ్రుతుడేననీ, ప్రస్తుతం అమెరికాసహా పలు దేశాలు ఈ చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. వైద్య విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు రుగ్వేదం, అధర్వణ వేదాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఏడు వేల ఏళ్లనాడే దంతమార్పిడి టెక్నాలజీ ఉండేదనీ, నాటి కట్టుడు పన్ను ఒకటి ఇప్పటి పాకిస్థాన్‌లో దొరికిందని తెలిపారు. మనిషి శరీరానికి హృదయమే రక్తాన్ని సరఫరా చేస్తున్న విషయాన్ని శుశ్రుతుడు చెప్పినా ఆ ఘనతను చరిత్ర విలియం హార్వేకి ఇచ్చిందన్నారు. మనిషి శరీరంలో కీలకమైన 107 ప్రదేశాలను ‘మర్మస్థానాల’ పేరుతో శుశ్రుతుడు వివరించాడనీ, నేటి వైద్యులకు ఆ సంగతే తెలియదని వాపోయారు. ఇక ద్రాక్షరసం, భంగ్ లాంటి పదార్థాలను శస్త్రచికిత్సకు మత్తుమందుగా వాడింది కూడా శుశ్రుతుడేనని వివరించారు. ఆపరేషన్ కోసం కోతపెట్టిన చర్మం పూర్వస్థితి పొందేందుకు వాడుతున్న ప్లాస్టిక్ సర్జరీని ఆనాడే కనిపెట్టారని తెలిపారు.

No comments:
Post a Comment