ప్రపంచ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రథమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగేళ్లపాటు కప్పు మన దగ్గరే ఉంచగల పదిహేను మంది మొనగాళ్లను ఆరో తేదీన ఎంపిక చేయబోతున్నారు. మరి జట్టులో యువరాజ్ సింగ్‌కు చోటుంటుందా? రెండో వికెట్ కీపర్‌ను తీసుకెళ్తారా? అసలు జట్టు సారథిగా ధోనీ కొనసాగుతాడా? లేక విరాట్ కోహ్లీకి వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెబుతారా? బోలెడంత ఆసక్తి రేపుతున్న ప్రశ్నలివి.
ప్రపంచకప్ ప్రాబబుల్స్‌గా గత నెలలో ప్రకటించిన ముప్పై మంది ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్ పేరులేదు. కానీ ఆ జాబితాలో లేనివారిని కూడా తుది జట్టులో ఎంపిక చేసే వెసులుబాటుంది. బహుశా అందుకే యువీ ఇప్పుడు సెలక్షన్ కమిటీ తలుపులు తెగ బాదేస్తున్నాడు. అంటే అక్షరాలా అలా చేస్తున్నాడని కాదు గానీ రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు కొట్టి సెలెక్టర్లు తనను విస్మరించడానికి వీలులేని పరిస్థితులు కల్పించాడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న యువరాజ్ లాంటి ఆటగాడిని జట్టులోకి ఎవరైనా కళ్లకద్దుకుని తీసుకుంటారు. క్రితం సారి ప్రపంచకప్‌ను అతని ఆల్‌రౌండ్ ప్రతిభ వల్లనే గెలిచాం. కానీ యువీ బౌలింగ్‌లో మునుపటి పస లేదు. ఫీల్డింగ్‌లో కూడా ఒకప్పటి చురుకుదనం లేదు. ఇప్పుడతన్ని కేవలం ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గానే తీసుకోవాలి. మరి ఇప్పటికే జట్టులో సెటిలైన అంబటి రాయుడు లాంటి వారిని తప్పించి యువీని తీసుకుంటారా అన్నది సందేహమే. సందీప్ పాటిల్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ పాత కాపుల్ని పక్కన బెట్టి యువతకు పెద్ద పీట వేస్తూ వస్తోంది కనుక యువీ ‘ఘర్ వాప్సీ’ కష్టమే. పదిహేను మందితో కూడిన తుది జట్టులో ఒకరు లేదా ఇద్దరు వికెట్ కీపర్లతో కలిపి ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్, ఏడుగురు బౌలర్లు ఉంటారు. ఆ ఏడుమంది బౌలర్లలో నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు ఉండే అవకాశముంది.
జట్టులో కచ్చితంగా ఉండే బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం: శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, సురేశ్ రైనాలకు ప్రపంచకప్ టికెట్ గ్యారెంటీ. అలాగే మొదటి వికెట్ కీపర్ స్థానం ధోనీది (కెప్టెన్ కూడా అతనేనని చెప్పడానికి సాహసించొచ్చు). ఇక మిగిలిన రెండు స్థానాలకు ఎవరిని జట్టులో చేరుస్తారన్నదే అసలు ప్రశ్న. ఈ రెండు స్థానాలకుగాను అంబటి రాయుడు, మురళి విజయ్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, వృద్ధిమాన్ సాహాల మధ్య గట్టిపోటీ ఉంటుంది. రెండో వికెట్ కీపర్‌ను పంపాలని గనుక సెలెక్టర్లు భావిస్తే స్పెషలిస్టు కీపర్‌గా సాహాకు ఒక స్థానం దక్కుతుంది. అలా కాకుండా ఒక కీపర్ చాలనుకుంటే రాయుడు, మురళి విజయ్ జట్టులోకి వస్తారు. క్రితం ప్రపంచకప్‌లో కూడా భారత జట్టు ఒక కీపర్‌తోనే బరిలోకి దిగింది. కానీ అప్పుడు స్వదేశంలో ఆ పోటీలు జరిగాయి కాబట్టి ఒక్కరితో సరిపెట్టారు. అవసరమైతే రాయుడు కీపింగ్ చేయగలుగుతాడు కాబట్టి రెండో కీపర్ అవసరం ఈసారి కూడా ఉండదేమో. రాబిన్ ఊతప్పకు కూడా ఇదే వర్తిస్తుంది. 2003 విశ్వకప్‌లో మొత్తం టోర్నమెంటంతా పార్ట్ టైం కీపర్ (ద్రావిడ్)తో కథ నడిపించిన ఘనత మనకెలాగూ ఉంది. అందుకే రెండో కీపర్ బదులు అదనంగా ఒక బ్యాట్స్‌మన్‌ను తీసుకెళ్లడానికే సెలెక్టర్ల ఓటుపడొచ్చు.
విజయ్‌కి చోటు?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టుల్లో మంచి ఫామ్ ప్రదర్శిస్తున్న విజయ్ ఇప్పుడు హఠాత్తుగా తెర మీదికొచ్చాడు. ఇప్పటి వరకు పద్నాలుగు వన్డేలాడిన ఈ తమిళ తంబి బ్యాటింగ్ సగటు ఇరవై కూడా దాటలేదు. అయితే ధవన్, రోహిత్‌లిద్దరూ ‘దైవాధీనం’ ఓపెనర్లే కాబట్టి నిలకడగా ఆడే విజయ్‌ని జట్టులోకి తీసుకోవచ్చన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేస్‌బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ కచ్చితంగా జట్టులో ఉంటారని చెప్పొచ్చు. ఇక నాలుగో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్‌ల మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరిలో ఇషాంత్ మెరుగనిపించాడు కాబట్టి సెలెక్టర్లు అతని వైపే మొగ్గు చూపొచ్చు.
జడేజా డౌటు: స్పిన్నర్ల విషయంలో అశ్విన్ పేరొక్కటి పక్కా. రవీంద్ర జడేజా ఫిట్ అని తేలితే అతను కూడా పక్కానే. ఇక మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కు చోటు దక్కొచ్చు. లెగ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని సెలెక్టర్లు అనుకుంటే కర్ణ్‌శర్మకు ఛాన్సుంది. జడేజా గాయం నుంచి కోలుకోకపోతే కర్ణ్, అక్షర్ ఇద్దరూ జట్టులోకొస్తారు.
మొత్తం మీద ప్రపంచకప్‌నకు వెళ్లే భారత జట్టు ఇలా ఉండొచ్చు:
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, మురళి విజయ్, అజింక్యా రహానె, సురేశ్ రైనా, అంబటి రాయుడు/రాబిన్ ఊతప్ప/వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా/కర్ణ్‌శర్మ, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ
మరి ‘ఆల్‌రౌండర్’ స్టువర్ట్ బిన్నీ సంగతేంటి?!

No comments:
Post a Comment