ఢిల్లీ ప్రజలకు మోదీ హామీ.. ఆప్ నేతలు నమ్మకద్రోహులు
అది తిరోగమన పార్టీ.. ఎన్నికల సభలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జనవరి 31: ‘నేను ఢిల్లీ వచ్చింది ప్రధాని కుర్చీలో కూర్చోడానికి కాదు. 15 ఏళ్లుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. కేవలం సౌత్‌బ్లాక్‌కే పరిమితం కావడం తనకిష్టం లేదని, ఢిల్లీలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ సేవలందించాలని భావిస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల జీవితాలను సమూలం గా మార్చి వెలుగులు నింపాలన్నదే తన లక్ష్యమన్నారు. ‘నేను కలిసిమెలసి పనిచేయగల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.. మీ జీవితాల్లో మార్పును చూడండి’ అని పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజలు ఏడుగురు బీజేపీ ఎంపీలను గెలిపించకపోయి ఉంటే తాను ఈ రోజు ఢిల్లీలో ఉండేవాడిని కాదన్నారు. మనం ఢిల్లీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోగలిగితే ప్రపంచం మన దేశం గురించి అంత గొప్పగా భావిస్తుందన్నారు. మీరు ఏడాది క్రితం ఎన్నో ఆశలతో ఓటేసిన గెలిపించిన వ్యక్తులు ఢిల్లీని తిరోగమన దిశగా నడిపించారని పరోక్షంగా ఆప్‌ను విమర్శించారు. ఆప్‌ను తిరోగమన పార్టీగా, ఆ పార్టీ నేతలను నమ్మకద్రోహులుగా అభివర్ణించారు. ‘ఢిల్లీకి కావల్సింది స్థిరమైన ప్రభుత్వం.. ఆ ప్రభుత్వాన్ని నడపడానికి అనుభవజ్ఞులు’ అని స్పష్టం చేశారు. ‘ఢిల్లీ చరిత్రలో కిరణ్‌బేదీ భాగస్వామి. ఇక్కడి ప్రతి అంగుళం ఆమెకు సుపరిచితం. ఆమె చేతుల్లో ఢిల్లీ అభివృద్ధిపథంలో దూసుకెళుతుంది’ అని తెలిపారు. ‘పేదలకు సేవ చేయడమే బీజేపీ లక్ష్యం. దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకునే నాటికి అన్ని మురికివాడల్లోనూ పక్కాఇళ్లు దర్శనమివ్వాలన్నది నా ఆశ’ అని చెప్పారు.

No comments:
Post a Comment