-అథ్లెట్లతో కలిసి మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్న
క్రీడల మంత్రి పద్మారావు ఎంపీ జితేందర్‌రెడ్డి
-టోర్నీని ప్రారంభించిన సచిన్
తిరువనంతపురం: 35వ జాతీయ క్రీడలు శనివారం ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టోర్నీకి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రులు సర్బనంద సోనోవాల్, వెంకయ్యనాయుడులు శనివారం పోటీలను ప్రారంభించారు. కాగా టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర జట్టు తొలిరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి, రాష్ట్ర క్రీడలమంత్రి టీ పద్మారావుతో పాటు రాష్ట్ర క్రీడాప్రాథికారం సంస్థ చైర్మన్ దినకర్‌బాబులు రాష్ట్ర జట్టుతో కలిసి మార్చ్‌పాస్ట్‌లో పాల్గొని అథ్లెట్లలో ఉత్సాహం నింపడం విశేషం.
ఈనెల 14వరకు జరగనున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి మొత్తం 150మందికిపైగా అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. దేశంలో నంబర్‌వన్ క్రీడారాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న రాష్ట్ర ప్రభుత్వం..జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన రాష్ట్ర అథ్లెట్లకు భారీస్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో గగన్ నారంగ్, అథ్లెటిక్స్‌లో అబ్దుల్ నజీబ్ ఖురేషీ, టెన్నిస్‌లో విష్ణువర్ధన్, సాకేత్‌లాంటి అథ్లెట్లు తెలంగాణ నుంచి ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు.


No comments:
Post a Comment