ఎన్నికల బరిలో అమీతుమీ
బీజేపీ, ఆప్ మధ్యే ప్రధాన పోరు
న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో నిరుడు ఎన్నికల పర్వం మొదలైనప్పటినుంచి వరుస విజయాలతో ఊపులో ఉన్న ప్రధాని మోదీ ఒకవైపు.. జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోగ ల కార్యకర్తల బలంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మరోవైపు.. ఢిల్లీ ఎన్నికల బరిలో అమీతుమీకి సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ కూడా గెలిచేది తామేనని బీరాలు పోతోంది. మొత్తంమీద ఎవరి కి వారు విజయం తమదంటే తమదేనని సవాళ్లు విసురుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీతో తలపడి భంగపడిన కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల నగారా మోగే పరిస్థితిని ఊహించి ముందుగానే ప్రచార రంగంలో దూకారు. తాజాగా సోమవారం షెడ్యూల్ వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందిగనుక మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించ తలపెట్టిన సభల సమయాన్ని ముందుకు జరపడమే దీనికి నిదర్శనం. గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, రెండోస్థానంలో ఉన్న ఆప్‌తో పాటు మూడో స్థానానికి దిగజారిన కాంగ్రెస్‌తోనూ జట్టుకట్టే పరిస్థితి లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. రాజకీయ పసికూన అయినా ఆప్ మాత్రం ఆత్రపడి కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కింది. అయి తే, కేజ్రీవాల్ ప్రభుత్వ ముచ్చట 49 రోజులకే ముగిసింది. ఈసారి తమకే పూర్తి ఆధిక్యం ఇవ్వాలని రెండుపార్టీలూ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో మోదీ.. ఇటీవల భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్‌నే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ అస్తిత్వం కోసమే పోరాడాల్సి వస్తోంది.
ఈసారీ త్రిశంకు సభేనా!?
ఈసారి కూడా త్రిశంకు సభేనని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గతంలోకన్నా బీజేపీ మరో 4 సీట్లు (35) ఎక్కువగా నూ, ఆప్ ఒక సీటు అదనంగానూ తెచ్చుకోగలదని ‘ఇండియా టీవీ-సీవోటర్’ సర్వే చెప్పింది. ఇక కాంగ్రెస్ 3 సీట్లు కోల్పోయి, 5కు పరిమితం అవుతుందని పేర్కొంది.

No comments:
Post a Comment