మార్చి 16న పట్టభద్రుల ఎన్నికలు
19న విడుదల కానున్న నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ కూసింది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 19న విడుదల కానుంది. దీంతో గ్రేటర్‌లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతమే అయినా పార్టీ మద్ధతుదారులను బరిలో నిలిపి గెలుపించుకునేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ప్రముఖ విద్యావెత్త డాక్టర్ నాగేశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ స్థానానికి గడువు ముగుస్తుండటంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు రెండు రోజుల క్రితం ప్రకటించారు. మార్చి 16న పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగానే పట్టభద్రులున్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లు మొత్తం 2,86,311 మంది ఉండగా, వీరిలో ఈ రెండు జిల్లాల నుంచే 2,20,211 మంది ఓటర్లుండటం విశేషం. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,33,003మంది ఓటర్లుండగా 165పోలింగ్ కేంద్రాలను, హైదరాబాద్ జిల్లాలో 87,208మంది ఓటర్లుండగా, 151పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి ఉండటంతో రెండు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజాప్రతినిధుల ప్రచార కార్యక్రమాలకు తెరపడింది.
రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఎన్నిక కావడంతో దీనిపై అన్నిపార్టీలు దృష్టిసారించాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో వివిధ పార్టీలు తమ పార్టీ మద్దతుదారులను బలమైన వారిని పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నాయి. పట్టభద్రుల స్థానం కావడంతో విద్యావేత్తను పెట్టేందుకు అన్ని పార్టీలు వెతుకుతున్నాయి. ఇప్పటికీ కేవలం బిజెపి మద్ధతుదారులుగా రాంచంద్రారెడ్డి పోటీలో ఉంటున్నారని ప్రకటించారు. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అధికారపార్టీ టిఆర్ఎస్ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ కూడా సరైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం ఉద్యోగ సంఘం దేవీప్రసాద్ లేదా విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్‌ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం కూడా అభ్యర్థివేటలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ పోటీలో ఉంటే ఆయనకు మద్దతు ప్రకటిస్తామని పది వామపక్ష పార్టీలు ఇదువరకే ప్రకటించాయి. అయితే నాగేశ్వర్ మాత్రం ఇంతవరకు పోటీ విషయమై ఏ నిర్ణయం ప్రకటించలేదు. ఒక వేళ ఆయన పోటీలో లేకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపైనా ఇంకా వామపక్షాలు నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పోటీలో నిలపాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ఆపూర్వ విజయం సాధించిన ఆమాద్మీ పార్టీ ఈఎన్నికల్లో తమ మద్దతుదారును పోటీలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో అభ్యర్థుల పేర్లు పూర్తిగా బయటకొచ్చే అవకాశాలున్నాయి

No comments:
Post a Comment