వాళ్లెన్నింటిలో.. మనమెన్నింటిలో
ఆంధ్ర, తెలంగాణ శాఖల భవనాల వినియోగంపై సర్వే!
అనువనువూ లెక్కతీస్తున్న అధికారులు
అధికారుల, సిబ్బంది వివరాల సేకరణ
పునర్విభజన చట్టంలో భాగమే అంటున్న అధికారులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల వివరాల సేకరణలో అధికారులు మునిగిపోయారు. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఏ విభాగానికి ఆ విభాగం అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ భవనాల వివరాలు, వాటిలో పనిచేసే అధికారుల వివరాలూ సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా దానిలోనే ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారా లేక తెలంగాణకు చెందినవారా అనే వివరాలూ తీసుకుంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారమే ఈ వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మండలాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏరియా పరిధిలో 174 ఇరు రాష్ర్టాలకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ మండలాల పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే హైదరాబాద్ జిల్లా యంత్రాంగం నివేదికలు ప్రభుత్వానికి అందించింది. జిల్లాల పరిధిలోనూ వివరాలు సేకరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 436 ప్రభుత్వ భవనాలు ఉన్నాయని లెక్కతేల్చారు. ఈ వివరాలూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేశారు. అయితే మళ్లీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్ర రాజధానిలో ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ విభాగం అధికారులు తహశీల్ కార్యాలయాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 3వరకే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌కు పంపాలని సూచించినా జిల్లాలోని అన్ని మండలాల వివరాలు పంపలేదు. మండల తహశీల్దార్లు సేకరించిన వివరాలను ఆర్డీఓలు మాత్రమే వీటిని ఆ వెబ్‌సైట్‌కు పంపేవిధంగా అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం జిల్లాలోని 9 మండలాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారు. మరో 7 మండలాలు ఇంకా అప్‌లోడ్ చేయలేదు. వీటిలో సైదాబాద్, మారెడ్ పల్లి మండల కార్యాలయాలు సొంతభవనాలు కాకపోవడంతో వాటి వివరాలు పంపాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా అంబర్ పేట్, హిమాయత్ నగర్, బండ్లగూడ, చార్మినార్, తిర్మలగిరి మండలాల వివరాలు అప్ డేట్ చేయాల్సిఉంది. అయితే ఒకటిరెండు మండలాల వివరాలు ఆర్డీఓల వద్దకు వచ్చినా అవి ఇంకా అప్ డేట్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్న వాటిలో 27 అంశాలతో కూడిన వివరాలు అందించాల్సి ఉంది. దీనిలో భవనం విస్తీర్ణం ఎంత?, సర్వే నెంబర్, ఎన్ని అంతస్తులు, ఎన్ని రూములు, ఎన్ని బాత్ రూములు అనేవి ఉన్నాయి. భవనాలకు సంబంధించి ఏమైనా కోర్టు కేసులున్నాయా అని కూడా ఆ వివరాల్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితో పాటు భవనానికి సంబంధించిన నాలుగు దిక్కుల ఫొటోలూ పంపిస్తున్నారు. దీనికితోడు అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారిగా కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ, ఎపి రాష్ర్టాల పరిధిలో ఎన్ని భవనాలున్నాయి, వాటిలో ఎన్నివినియోగంలో ఉన్నాయి.. అని తెలుసుకునేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

No comments:
Post a Comment