ఛాతి ఆస్పత్రిని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిగా మార్చాలి
వాస్తు పేరుతో సచివాలయం మారుస్తున్నామని అసెంబ్లీలో చెబుతారా?
కెసిఆర్‌కు సిపిఎం నేత తమ్మినేని సవాల్
ఇది లౌకికప్రభుత్వమేనా : చాడ వెంకట్ రెడ్డి
ఛాతి ఆస్పత్రిని సందర్శించిన పది వామపక్ష పార్టీల నేతలు
అనంతగిరికి మార్చితే ఉద్యమమేనని హెచ్చరిక
నగరంలోని ఎర్రగడ్డ చాతి ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరికి మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని పది వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్ని వసతులున్న ఈ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్ చేశాయి. వాస్తుపేరుతో సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకుంటే 12వ తేదీన జరిగే సదస్సులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. బుధవారం ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని పది వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులను, డాక్టర్లు, సిబ్బందిని సిసిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(రాయల వర్గం) రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర నాయకులు గోవర్థన్, సిపిఐ మాజీ ఎంపి అజీజ్ పాషా, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి ఎండి గౌస్, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకులు మురహరి, సిపిఐఎంల్ రాష్ట్ర నాయకులు వీరయ్య, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు నరేందర్, ఆర్‌ఎస్పీ రాష్ట్ర నాయకులు గోవింద్‌తో పలువురు నాయకుల బృందం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వాస్తుపేరుతో ఛాతి ఆస్పత్రి స్థలంలోకి సచివాలయం మార్చాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని అన్నారు. వాస్తు వ్యక్తిగత నమ్మకమని, మూఢాచారమని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన మంత్రులు వ్యతిరేకించకపోవడంతో వారి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. వాస్తుపేరుతో ఆస్పత్రిని మారుస్తున్నామనే విషయాన్ని అసెంబ్లీలో పెడతారా అని సవాల్ విసిరారు. దీనిపై ఎవరైనా కోర్టుకుపోతే కూడా ఇదే విషయాన్ని కోర్టులో చెబుతారా.. ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. వాస్తుపరంగానే కాదు వైద్యపరంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రస్తుతమున్న స్థలంలో ఎక్కువ విభాగాలు ఏర్పాటు చేయాలని, రీసెర్చ్ సెంటర్ గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. చాతి ఆస్పత్రిని 1995లో ప్రభుత్వం జనరల్ ఆస్పత్రిగా మారుస్తూ జీవో విడుదల చేసినా దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. చాతి ఆస్పత్రిని మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాక్షలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని విమర్శించారు. వ్యక్తిగతంగా ఆలోచనను ప్రభుత్వపరంగా అమలు చేయాలని చూడడం దారుణమన్నారు. లౌకక ప్రభుత్వంలో ఉన్నామని వాస్తుపేరుతో ఇలాంటి నిర్ణయాలు చేయడం ప్రజలను అవమానించడమేనని తెలిపారు. ఇదే శంపైన ఈ నెల 12న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలతో సదస్సు నిర్వహిస్తామని, దానిలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. వెంకట్రామయ్య మాట్లాడుతూ చాతి ఆస్పత్రిని మార్చాలని సిఎం తీసుకున్న నిర్ణయం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని అన్నారు. వాస్తుపేరుతో సచివాలయం మార్చే నిర్ణయం తీసుకున్న చరిత్రలో తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రాష్ట్రం పరువుతీస్తున్నారని విమర్శించారు. గోవర్థన్ మాట్లాడుతూ చాతి ఆస్పత్రిని ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్‌గా మార్చాలని, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం వత్తాసు పలకొద్దని కోరారు. ఎండి గౌస్ మాట్లాడుతూ రోగులు రావడం లేదని అందుకే మారుస్తున్నామని కొత్త వాదనలను ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారని విమర్శించారు. కానీ నెలకు 60వేల మందికి పైగా సందర్శిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పద్మ, ఎం శ్రీనివాస్, శేషగిరిరావు, గౌతమ్ ప్రసాద్, పస్క నర్సయ్య, డి సుధాకర్, అనురాధా, సత్య, పర్షరాం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment