రుణాల మంజూరులో అలసత్వం వద్దు
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కె నిర్మల
15లోగా మంజూరు వివరాలు పంపాలని ఆదేశం
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో, లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె నిర్మల బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంకులకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించడంలో అలసత్వం వహించవద్దని బ్యాంకర్లకు సూచించారు. ఈనెల 15లోగా సంబందిత రుణాల మంజూరుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్యాల పురోగతిని సమీక్షించారు. పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నా.. రుణాల మంజూరికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరస్కరించిన కేసులను తిరిగి పరిశీలించి వారికి అకౌంట్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. వందశాతం లక్ష్యాన్ని సాధించిన బ్యాంకులకు సముచిత రీతిలో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈనెల చివరి వారంలో జరిగే సమావేశానికి బ్యాంకర్లు డిసెంబర్ త్రైమాసిక పూర్తి వివరాల నివేదికతో హాజరుకావాలని సూచించారు. అనంతరం ఆర్ బిఐ ఎజిఎం వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ అమోదించిన దరఖాస్తులను తిరస్కరించే అధికారం లేదని స్పష్టం చేశారు. అదనపు జెసి సంజీవయ్య మాట్లాడుతూ వికలాంగులకు రుణాలు మంజూరీ చేయడంతో బ్యాంకులు చొరవ తీసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ 2013-14 లక్ష్యంలో 50 శాతంపైగా సాధించినప్పటికీ ఆ మేరకు నివేదికలో పురోగతి చూపలేదని అన్నారు. వెంటనే బ్యాంకర్లందరూ తమ నివేదికను ఆప్ డేట్ చేసి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి సత్యనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ అధికారి సలీం పాషా, అక్రం అలీ, డిటిడబ్య్లుఓ శివ పస్రాద్, బిసి కార్పొరేషన్ ఈడి ఖాజానజీమ్ అలీ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment