నత్తనడకనక క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన
నగరంలో భూ క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ నెల 20లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినా, గడువులోగా పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. గడిచిన రెండు వారాల్లో కేవలం 20,102 దరఖాస్తులు మాత్రమే అధికారులు పరిశీలించారు. అయితే మరో వారం గడువు ఉండటంతో, గడువు లోపు పూర్తి అవుతాయా? అనే భావన అధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. దీనికితోడు నగరంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ దరఖాస్తుల పరిశీలన మరోనెల వరకు పొగడించవచ్చనే ఆలోచనలో సిబ్బంది ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత క్రమబద్ధీకరణకు 2.13,702 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 63,772 ఉండగా, మిగితా 1,49,930 దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. వీటిలో ప్రాథమిక స్థాయిలోనే వివిధ కారణాలతో 78,110 దరఖాస్తులను పక్కన పెట్టారు. మిగిలిన 1,35,597 దరఖాస్తులను పరిశీలనకు స్వీకరించారు. వీటి పరిశీలనకు గ్రేటర్ పరిధిలో 111 పరిశీలన బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ వేగంగా జరగడం లేదని భావించిన ప్రభుత్వం, హైదరాబాద్ నగరంలో బృందాలను పెంచాలని ఆదేశించింది. దీంతో ఈ దరఖాస్తుల పరిశీలనలో రెవెన్యూ సిబ్బందితో పాటు జిహెచ్‌ఎంసికి చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులను పరిశీలనకు జిహెచ్‌ఎంసి కమిషనర్ కేటాయించారు. ప్రస్తుతం జీవో 59 ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో, గడువు పూర్తయినా జీవో 58 ప్రకారం దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే రెండు వారాల్లో కొత్తగా మరో వెయ్యివరకు దరఖాస్తులు స్వీకరించారు.
ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో 125 గజాలలోపు భూమిని ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలకు ఉచితంగా పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించింది. కానీ క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తుల పరిశీలన మాత్రం ప్రభుత్వం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. గడిచిన రెండు వారాల్లో గ్రేటర్ పరిధిలో 20,102 దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిశీలించారు. మరో 1,15,495 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులకు తోడు జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులను జత చేశారు. అయినా పరిశీలన మాత్రం వేగం పుంజుకోవడం లేదు. రోజుకు ఒక్కో బృందం 15నుంచి 20 దరఖాస్తులను పరిశీలిస్తుంది. దీంతో మరిన్ని పరిశీలన బృందాలను వేయాలని పలువురు సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.
ఈ నెల 20 నుంచి ఉచిత క్రమబద్దీకరణ దరఖాస్తు దారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16న ఎన్నికలు, మార్చి 19న కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 20 వరకు ఎన్నికల కోడ్ గ్రేటర్ హైదరాబాద్‌లో అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ది పనులు చేయకుడదు. కాబట్టి పట్టాల పంపిణీ మార్చి చివరికి వాయిదా పడే అవకాశం ఉంది.

No comments:
Post a Comment